• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /రేషనలైజేషన్ పేరిట సర్కారు బడులను చంపేస్తున్నారు.. జీ తెలుగు 'గురువందనం' లో మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్..!!

రేషనలైజేషన్ పేరిట సర్కారు బడులను చంపేస్తున్నారు.. జీ తెలుగు 'గురువందనం' లో మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్..!!

Zee Telugu Guru Vandanam: తెలంగాణ విద్యారంగం తీవ్ర అనిశ్చితిలో కూరుకుపోయిందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. ప్రభుత్వ ప్రకటనలకు క్షేత్రస్థాయి ఆచరణకు నడుమ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 13, 2026, 04:33 PM IST|Updated: Oct 13, 2026, 04:35 PM IST
joinshare
రేషనలైజేషన్ పేరిట సర్కారు బడులను చంపేస్తున్నారు.. జీ తెలుగు 'గురువందనం' లో మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్..!!
Image Credit: Zee Telugu Guru Vandanam

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
షుగర్ ఉన్నవారికి కొత్త ముప్పు! 'డబుల్ డయాబెటిస్' వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? అలర్ట్ లేకపోతే అంతే!

షుగర్ ఉన్నవారికి కొత్త ముప్పు! 'డబుల్ డయాబెటిస్' వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? అలర్ట్ లేకపోతే అంతే!

2

Mamitha Baiju Dating: టాలీవుడ్ యంగ్ హీరోతో మమితా బైజు ప్రేమాయణం..డిసెంబరులో పెళ్లికి లగ్గం..?

3

"విద్యా వ్యవస్థలో సంస్కరణలు కాగితాలకే పరిమితం కావొద్దు".. జీతెలుగు వేదికగా కేకే కీలక వ్యాఖ్యలు..!!

4

రేషనలైజేషన్ పేరిట సర్కారు బడులను చంపేస్తున్నారు.. జీ తెలుగు 'గురువందనం' లో మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్..!!

5

Bhatti Vikramarka Speech: "తెలంగాణలో విద్యారంగ విప్లవం" జీ తెలుగు న్యూస్ 'గురువందనం-2026'లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Zee Telugu Guru Vandanam: తెలంగాణ విద్యారంగం తీవ్ర అనిశ్చితిలో కూరుకుపోయిందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. ప్రభుత్వ ప్రకటనలకు క్షేత్రస్థాయి ఆచరణకు నడుమ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. హైదరాబాద్ లో జరిగిన జీ తెలుగు న్యూస్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ అండ్ టీచర్స్ వేదికగా హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా వ్యవస్థ తీరుతెన్నులు.. క్షేత్రస్థాయి లోపాలపై ఆయన ఫైర్ అయ్యారు. 

రాష్ట్రంలో ప్రతినెల 600 నుంచి 700 మంది టీచర్లు రిటైర్డ్ అవుతున్నారని.. ఇప్పటి వరకు దాదాపు 20వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీలను భర్తీ చేయకుండా కేవలం రేషనలైజేషన్.. అడ్జస్ట్ మెంట్ల పేరుతో టీచర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు. అందుకే సర్కారు బడులపై పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం సడలుతోందని హరీశ్ రావు అన్నారు.

అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం పూట అల్పాహారం స్కీమ్ ప్రారంభించామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ 50శాతం జిల్లాల్లోనూ ఆ స్కీమ్ అమలు కావడం లేదన్నారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యాన్ని పర్యీవేక్షించి స్కావెంజర్లకు గత 10 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ విమర్శలు గుప్పించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో దాదాపు 300కు పైగా డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు చేతికి అందక ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్న చదువులకు.. ఉద్యోగాలకు దూరమవుతున్నారని మండిపడ్డారు. ఇంటర్, పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని.. ఈ అనిశ్చితికి వెంటనే తెరదించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీశ్ రావు. 


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News