• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /మహానగరానికి ముంచుకొస్తున్న మంచినీటి సమస్య.. ఎల్ నినో ప్రభావంతో అడుగంటుతున్న భూగర్భజలాలు..

మహానగరానికి ముంచుకొస్తున్న మంచినీటి సమస్య.. ఎల్ నినో ప్రభావంతో అడుగంటుతున్న భూగర్భజలాలు..

Hyderabad Water Crisis: నిన్నమొన్నటిదాకా తాగునీటికి ఇబ్బందిలేని హైదరాబాద్ మహానగరం… ఇపుడు నీటి కొరతతో సతమతమవుతోంది. ఎల్ నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటాయి. వర్షాభావ పరిస్థితులతో జల వనరుల్లో తాగు నీటి నిల్వలు క్రమేణ తగ్గిపోతున్నాయి. వర్షాలు కురవకపోతే...రాబోయే నెలరోజుల్లో తీవ్రమైన ఇబ్బందులు పొంచి ఉన్నాయనే సంకేతాలు ప్రజానీకాన్ని కలవరపెడుతున్నాయి. ఇంతకీ హైదరాబాద్ కు ఎక్కడినుంచి నీళ్లొస్తున్నాయి? నీటి కష్టాలు ఎందుకు వచ్చాయి? జీ న్యూస్ తెలుగు స్పెషల్ ఫోకస్..!!

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 22, 2026, 07:53 IST|Updated: Nov 22, 2026, 07:57 IST
joinshare
మహానగరానికి ముంచుకొస్తున్న మంచినీటి సమస్య.. ఎల్ నినో ప్రభావంతో అడుగంటుతున్న భూగర్భజలాలు..
Image Credit: Hyderabad Water Crisis (Source/ZEE News)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

El Nino Effect on Hyderabad: తెలంగాణ రాష్ట్ర జనాభాలో దాదాపు మూడో వంతు మందికి ఆశ్రయమిస్తున్న హైదరాబాద్ నగరానికి మంచినీటి  కష్టాలు ముంచుకొస్తున్నాయి. వాతావరణ ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో హైదరాబాద్ కు తాగునీటి అవసరాలు తీర్చే జలవనరులు అడుగంటుతున్నాయి.

హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలను తీర్చే బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్  చూసుకుంటుంది. 16లక్షల 50వేల గృహావసరాలకు, మూడులక్షల 50వేల వాణిజ్య అవసరాలకు జలమండలి ఆధ్వర్యంలో మంచినీటిని సరఫరా చేస్తోంది.  శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ కు రోజుకు సగటున 2600 మిలియన్ లీటర్లను సరఫరా చేస్తున్నారు. నీటి లభ్యతను బట్టి రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి సగటున వెయ్యిలీటర్ల నీటికి పైగా సరఫరా చేస్తున్నారు.

ఎల్ నినో ప్రభావంతో అడుగంటుతున్న భూగర్భజలాలు..

గోదావరి జలాలను శ్రీపాదయల్లంపల్లి ప్రాజెక్టునుంచి, కృష్ణాజలాలను అక్కంపల్లి ప్రాజెక్టునుంచి, హిమాయత్ సాగర్,  గండిపేట చెరువు గా పిలుచుకుంటున్న ఉస్మాన్ సాగర్ నుంచి, మంజీర, సింగూరు జలాలతో హైదరాబాద్ మహానగర ప్రజానీకానికి తాగునీటి అవసరాలను తీరుస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో జలవనరుల్లో నిల్వ సామర్థ్యాలు క్రమేణ తగ్గిపోతున్నాయి. భూగర్భజాలాలు అడుగంటడంతో  ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గడం, బోర్లు ఎండిపోవడంతో నగరంలో ట్యాంకర్ల డిమాండ్ పెరిగింది. రోజుకు సగటున ట్యాంకర్ల ద్వారా 11 వేలనుంచి 12 వేల ట్రిప్పల ద్వారా నీటిని సరఫరా చేసేవారు. ఇపుడు దాదాపుగా ఆరు వేల ట్రిప్పులకు తగ్గించారు.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశాలు..

రోజువారి తాగునీటి అవసరాలను తీర్చేక్రమంలో జలమండలి శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నప్పటికీ… నీటి వనరులను పొదుపుగా వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు.  నీటి దుబారాను నియంత్రించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు తీవ్రతరం కావచ్చన్న అంచనాల నేపథ్యంలో హైదరాబాద్‌ నగరానికి తాగునీటి సరఫరాపై జనవరి నుంచి ఒత్తిడి పెరగనుంది. ఈ పరిస్థితిని ముందుగానే ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. నగరానికి నీటి కొరత ఏర్పడకుండా.. జల మండలితోపాటు పలు కీలక ప్రభుత్వ శాఖలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. జలమండలి, మూడు నగరపాలక సంస్థలు, భూగర్భజల శాఖ, హైడ్రా, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, సమాచార పౌర సంబంధాల శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కంటెంజెన్సీ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. జలమండలి ఎండీ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. పురపాలక, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల కార్యదర్శులతోపాటు క్యూర్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల కమిషనర్లు, హెచ్‌ఎండీఏ, హైడ్రా కమిషనర్లు, భూగర్భజల శాఖ, పీసీబీ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు.

రూ. వెయ్యి నుంచి రూ. 2500కు పెరిగిన ట్యాంకర్ రేట్లు..

నీటి పొదుపులో భాగంగా వాణిజ్య అవసరాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కావడం గగనంగా మారింది. హోటళ్లు, రెస్టారెంట్లకు ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ, ప్రైవేటు హాస్టళ్లకు ట్యాంకర్లు ద్వారా నీటిని సరఫరా నిలిపివేశారు. దీంతో  హైదరాబాద్ లో అత్యధికంగా హాస్టళ్లు ఉన్న కూకట్ పల్లి హౌసింగ్ బోర్డుకాలనీలో ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. నీటి కొరతతో ప్రైవేట్ హాస్టళ్లను మూసివేసే పరిస్థితి నెలకొంది. ఉద్యోగార్థులు, చదువుల కోసం వచ్చిన విద్యార్థులు ఆశ్రయం పొందుతున్న ప్రైవేట్ హాస్టళ్ల నిర్వహణ కష్టంగా మారింది. భూగర్భ జలాలు అడుగంటడంతో హాస్టల్ భవనాల్లో ఉన్న బోరుబావులు ఎండిపోయాయి. దీంతో ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీళ్లను తెప్పించుకోవాల్సి వస్తోంది. సాధారణ రోజుల్లో ఒక్కో ట్యాంకర్ నీళ్లు..  వెయ్యిరూపాయలు ఉండేవి… ఎల్ నినో ప్రభావంతో ఒక్కో ట్యాంకర్ నీటిని 2500 రూపాయలకు పెంచేశారు.


జలవనరుల్లో నీటి నిల్వలు తగ్గడంతో తాగునీటి సమస్య..
హైదరాబాద్ మహానగరానికి నీటికష్టాలను గట్టెక్కించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.  ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల నుంచి నగరానికి అదనపు తాగునీటిని సరఫరా చేసే సాధ్యాసాధ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రధానంగా రాబోయే ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెరిగే తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, జంట జలాశయాల నుంచి అదనంగా ఎంత నీటిని సేకరించవచ్చు, ఏ మార్గాల్లో తరలించవచ్చు.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న పైప్‌లైన్ వ్యవస్థతో ఎలా అనుసంధానం చేయవచ్చనే అంశాలపై అధికారులతో చర్చించారు.

నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం, తాగునీటి సమస్య తలెత్తడంతో నిర్వహణ కష్టమైపోతోందని ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకులు నిర్ణయం సెన్సేషన్ క్రియేట్ చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో హాస్టళ్లను మూసేస్తున్నామని హాస్టల్ యజమానుల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించడంతో ఎక్కువమంది హాస్టళ్లలో ఉండి విధులు నిర్వహించుకుంటున్నారు. దీంతో విద్యుత్తు, నీటి వ్యయం భాగా పెరగడంతో హాస్టళ్లను మూసేయడమే శరణ్యమని నిర్వాహకులు భావిస్తున్నారు.

నీటి ఎద్దడితో విలవిల్లాడుతున్న అపార్ట్ మెంట్ వాసులు.. 
జలవనరులు కనుమరుగైపోవడం, చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాకు గురవడంతో జలవనరులు కుచించుకుపోయాయి. చెరువులు కుంటల్లో అపార్ట్ మెంట్లు వెలిశాయి. దీంతో నీటి కొరత మరింత తీవ్రంగా మారింది.  భారీ అపార్ట్ మెంట్లు ఉంటున్న హైదరాబాద్ లో మంచినీటి కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అపార్ట్ మెంట్లల్లో బోరు బావులు అడుగంటి పోవడంతో ట్యాంకర్లను తెప్పించుకోడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో అపార్ట్ మెంట్ కల్చర్ నుంచి బయటపడేందుకు ప్రజలు మనసు మార్చుకుంటున్నారు. నీటి సమస్య కొనసాగితే… రాబోయే రోజుల్లో అపార్ట్ మెంట్లు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.

కాంక్రీట్ జంగిల్‌గా మహా నగరం.. 
మహానగరం కాంక్రీట్ జంగిల్ పెరిగిపోవడం, వర్షపు నీటి సంరక్షణ మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఈ దుస్థితికి ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం 15 శాతం విస్తీర్ణంలో మాత్రమే పనితీరు బాగున్న రైన్ వాటర్ హార్వెస్టింగ్, భూగర్భ జల రీఛార్జ్ వ్యవస్థలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నగరంలో అత్యధిక శాతం భూమి కాంక్రీట్, రోడ్లతో నిండిపోవడం వల్ల వర్షం పడినా నీరు భూమిలోకి ఇంకే మార్గం లేకుండా పోయిందని చెబుతున్నారు. దీనికి తోడు హైదరాబాద్‌లోని రాతి భూగర్భ పొరలు, తగ్గిపోతున్న ఖాళీ స్థలాలు సహజ రీఛార్జ్ ప్రక్రియను పూర్తిగా దెబ్బతీశాయని జేఎన్‌టీయూహెచ్ వాటర్ రీసోర్సెస్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ బి. వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.

రాబోయే వేసవిలో తాగునీటి సరఫరాలో తలెత్తే అవకాశం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి ముందస్తు చర్యలను ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా నగరానికి ప్రధాన జలవనరులైన సింగూరు-మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ జలవనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Rain News
Weather Update
Telugu News