SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఐటీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. చెన్నై నుంచి భాగ్యనగరానికి దిగ్గజ టెక్ సంస్థ.. భారీగా ఉద్యోగాలు..!

Hyderabad IT Jobs: ప్రముఖ లైఫ్ సైన్సెస్ టెక్నాలజీ సంస్థ అగిలిసియం తమ ఆసియా ప్రధాన కార్యాలయాన్ని చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించనుంది. రానున్న రోజుల్లో ఐదు వేల మంది నిపుణులను నియమించుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Oct 28, 2026, 05:28 PM IST | Updated: Oct 28, 2026, 05:30 PM IST
Image Credit: Agilisium Asia Headquarter (Source: AI)
Join

Hyderabad IT Jobs: హైదరాబాద్‌కు మరో టెక్ దిగ్గజ సంస్థ రానుంది. ప్రముఖ లైఫ్ సైన్సెస్ అండ్ డేటా అనలిటిక్స్ కంపెనీ అగిలిసియం (Agilisium) తన ఆసియా హెడ్‌క్వార్టర్స్‌ను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించాలని నిర్ణయం తీసుకుంది. లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ రంగాలలో అంతర్జాతీయ కంపెనీలకు హైదరాబాద్ మొదటి ప్రాధాన్యతగా మారుతోంది. ఈ క్రమంలోనే అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టెక్నాలజీ సేవల సంస్థ అగిలిసియం తమ విస్తరణను వేగవంతం చేసింది. ఇప్పటివరకు తమిళనాడులోని చెన్నై కేంద్రంగా సాగిన తమ ఆసియా ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. హైదరాబాద్‌లో ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

5 వేల మందికి ఉద్యోగావకాశాలు

రానున్న 5 నుంచి 7 ఏళ్లలో దాదాపు 5 వేల మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను నియమించుకోవాలని అగిలిసియం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే తమ వార్షిక ఆదాయాన్ని 500 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.4,200 కోట్లు) చేరాలనే ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం 2026 నాటికి సంస్థ 72 నుంచి 75 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసే దిశగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా గ్లోబల్ ఫార్మా, బయోటెక్, మెడికల్ డివైసెస్ సంస్థలకు అవసరమైన డీప్-టెక్ ప్రాడక్ట్స్, సొల్యూషన్స్‌ను డెవలప్ చేయనున్నట్లు అగిలిసియం ఫౌండర్, సీఈవో రాజ్ బాబు వెల్లడించారు.

2018లో లైఫ్ సైన్సెస్ విభాగంలోకి అడుగుపెట్టిన అగిలిసియం.. రీసెర్చ్ అండ్ డ్రగ్ డిస్కవరీ, క్లినికల్ డెవలప్‌మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాల్లో వినూత్న పరిష్కారాలను అందిస్తోంది. కేవలం సంప్రదాయ ఐటీ సేవలకే పరిమితం కాకుండా, లైఫ్ సైన్సెస్ విభాగానికి అవసరమైన అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ టెక్నాలజీ పరిష్కారాలను అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ నగరం దేశంలోనే లైఫ్ సైన్సెస్, జీనోమ్ వ్యాలీ వంటి ప్రపంచ స్థాయి ఎకోసిస్టమ్‌ను కలిగి ఉండటం కంపెనీ విస్తరణకు ప్రధాన బలంగా మారనుంది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES