SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ganesh Shobhayatra: ఎల్లుండి హైదరాబాద్‌లో మహా నిమజ్జనం.. తెలంగాణ పోలీస్‌ భారీ ఏర్పాట్లు

All Set To Hyderabad Maha Nimmajjanam On September 25th: వినాయక ఉత్సవాలు శుక్రవారంతో ముగియనుండగా.. హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా సాగనున్న మహా నిమజ్జన శోభాయాత్రకు పోలీస్‌ శాఖ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది. మహా నిమజ్జనాన్ని ప్రశాంతంగా.. సాఫీగా జరిగేందుకు తాము సిద్ధమని పోలీస్‌ శాఖ ప్రకటన చేసింది.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 23, 2026, 05:05 PM IST | Updated: Sep 23, 2026, 05:15 PM IST
Image Credit: Hyderabad Police YouTube
Join

Hyderabad Maha Nimmajjanam: దేశంలోనే విశిష్ట గుర్తింపు పొందిన హైదరాబాద్‌ గణేశ్ ఉత్సవాలు శుక్రవారంతో ముగియనున్నాయి. చివరి రోజు మహా నిమజ్జనం శోభాయాత్ర అంగరంగ వైభవంగా.. కోలాహలంగా.. ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరగనుంది. వేలాది గణనాథులు నిమజ్జనం కానుండగా.. లక్షలాది ప్రజలు ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఈ గణేశ్‌ మహా నిమజ్జన శోభాయాత్రకు తెలంగాణ పోలీస్‌ సర్వం సిద్ధమైంది. ప్రశాంతంగా.. ఎంతో భక్తి ప్రపత్తులతో వినాయక నిమజ్జనం పూర్తయ్యేలా పటిష్ట ఏర్పాట్లు చేసింది. నిమజ్జన ఏర్పాట్లపై నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు.

హైదరాబాద్‌లో వినాయక ఉత్సవాల ముగింపు వేడుకలకు ఈ నెల 25న శుక్రవారం జరిగే మహానిమజ్జన శోభాయాత్రకు హైదరాబాద్‌ సిటీ పోలీసు యంత్రాంగం సర్వసన్నద్ధమైందని సీపీ సజ్జనార్‌ ప్రకటించారు. మూడో రోజు నుంచే ప్రారంభమైన విగ్రహాల నిమజ్జనం ఇప్పటికే నగరంలో ప్రశాంతంగా సాగుతుండగా.. చివరి రోజు బాలాపూర్ గణేష్ నుంచి జరిగే తుది శోభాయాత్రను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

భారీ బందోబస్తు
హైదరాబాద్‌తోపాటు సైబరాబాద్‌, మల్కాజిగిరి, ఫ్యూచర్‌ సిటీ, పొరుగు జిల్లాల నుంచి పోటెత్తే లక్షలాది మంది భక్తులు, వేలాది విగ్రహాల వచ్చే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సజ్జనార్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీ, విద్యుత్, వాటర్ బోర్డు, తదితర అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో తగిన చర్యలు తీసుకుంటునట్లు వెల్లడించారు. హైదరాబాద్ నలుమూలలా భద్రతా వలయాన్ని పటిష్టంగా తీర్చిదిద్ది.. ఏ చిన్న అవాంఛనీయ ఘటనలకూ తావులేకుండా ప్రశాంత వాతావరణంలో వినాయకుడికి వీడ్కోలు పలికేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు.

అన్నీ విభాగాలు
జీహెచ్‌ఎంసీ, ఆర్‌ అండ్‌ బీ, విద్యుత్‌, జలమండలి, రవాణా, అగ్నిమాపక, వైద్యారోగ్య, హైడ్రా, సమాచార పౌరసంబంధాలు, హెచ్‌ఎండీఏ తదితర ప్రభుత్వ విభాగాలతో పాటు భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్ర‌తినిధులు ఈ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకంఉటున్నట్లు హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ వివరించారు. శోభాయాత్ర సాఫీగా సాగేందుకు బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు ఉత్సవ సమితులు, వివిధ శాఖల అధికారులతో కలిసి సంయుక్త రూట్‌ తనిఖీలు పూర్తిచేసి రోడ్ల మరమ్మతులు, విద్యుత్‌ తీగల తొలగింపు, చెట్ల కొమ్మల కత్తిరింపులు వంటి పనులను పూర్తి చేసినట్లు తెలిపారు.

క్షణక్షణం పర్యవేక్షణ
మహా నిమజ్జనం శోభాయాత్రను క్షణక్షణం పర్యవేక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని హైద‌రాబాద్ సిటీ పోలీస్ పూర్తిస్థాయిలో రంగంలోకి దించినట్లు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ఊరేగింపు సాగే ప్రధాన మార్గాల్లో 10 వేల సీసీ కెమెరాలను బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలోని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానిచ్చారు. ప్రధాన రహదారులపై డేగకన్ను వేసేందుకు 24 అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ప్రధాన మార్గాల్లో దాదాపు 100 వరకు హైరైజ్ కెమెరాలను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా విగ్రహాల లెక్కింపు చేస్తున్నారు.

బందోబస్తులో పోలీస్‌ బలగాలు
మహా నిమజ్జనం కోసం 20 వేల మంది భద్రతా బలగాలు క్షేత్రస్థాయిలో ఉండనున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్‌ కమిషనరేట్‌కు చెందిన శాంతి భద్రతలు (లా అండ్‌ ఆర్డర్‌(, ట్రాఫిక్‌, టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, సిటీ సెక్యూరిటీ వింగ్‌, సీఏఆర్‌ తదితర విభాగాల నుంచి దాదాపు 20 వేల మంది సిబ్బంది విధుల్లో ఉండనున్నాయి. ఇతర జిల్లాల నుంచి గతంలో నిమజ్జన బందోబస్తులో అనుభవమున్న 8,142 మంది అధికారులు, సిబ్బందితో కూడిన 42 ప్లాటూన్లను రప్పించి ఏడు జోన్లకు కేటాయించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతల కోసం 4 రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) కంపెనీలను దింపారు.

మండపాలు ఎన్ని అంటే?
ఆన్‌లైన్‌ విధానంలో వినాయక మండపాలకు 15,426 దరఖాస్తులు వచ్చాయి. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 14,929 మండపాలకు అనుమతులు మంజూరు చేశారు. అనుమతి పొందిన అన్ని మండపాలను జియో ట్యాగింగ్‌ చేయడంతో పాటు ప్రమాద నివారణ, విద్యుత్‌ తీగల రక్షణ జాగ్రత్తలపై పోస్టర్లను మండపాల వద్ద అతికించారు.

ఎన్ని నిమజ్జనం?
ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 32,878 విగ్రహాల నిమజ్జనం విజయవంతంగా ముగిశాయి. వాటిలో హైదరాబాద్‌ నగరానికి చెందిన 6,108 విగ్రహాలు ఉన్నాయి. 24 గంటల్లోనే నగర పరిధిలోని 2,161 విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES