SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Amit Shah Padayatra: అమిత్‌ షా మహా పాదయాత్ర.. హైదరాబాద్‌లో ఆ రూట్‌లో అస్సలు వెళ్లరాదు

Hyderabad Traffic Diversions A Head Amit Shah Maha Padayatra: హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మహా పాదయాత్ర చేపట్టనున్నారు. దీంతో హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆ మార్గంలో రాకపోకలు చేయకపోవడం మంచిది అని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 02, 2026, 12:25 PM IST | Updated: Nov 02, 2026, 12:31 PM IST
Image Credit: Amitshah Maha Padayatra
Join

Hyderabad Traffic Diversions: హైదరాబాద్‌లో బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు బీజేపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. కేంద్ర హోం మంత్రి పర్యటన కావడతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లో దాదాపు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేయనుండడంతో ఆ మేరకు భద్రతా చర్యలు తీసుకున్నారు. దీంతో నగర ప్రజలకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దాదాపుగా ఆ మార్గంలో రాకపోకలు సాగించకపోవడం మంచిది అని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు.

బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్‌ రామ్‌ (బీజేఆర్) విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు పాదయాత్ర జరగనుంది. పాదయాత్ర నేపథ్యంలో పలు ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. బీజేఆర్ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్, ఎంజే మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలు నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు ట్రాఫిక్‌ పోలీసులు మళ్లింపు చేశారు.

జాంబాగ్, అఫ్జల్‌గంజ్ నుంచి జీపీఓ వైపు వచ్చే వాహనాలు ఎంజే మార్కెట్ వద్ద తాజ్ ఐలాండ్ వైపు మళ్లించారు. లిబర్టీ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలకు పూర్తిగా అనుమతి నిరాకరించారు. ఆ వాహనాలన్నింటిని హిమాయత్‌నగర్ వైపు దారి మళ్లించారు. హిమాయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ వద్ద పాత అంబేడ్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తూ ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

బషీర్‌బాగ్, కింగ్‌కోఠి, బోగ్గులకుంట, అబిడ్స్ పరిసరాల్లోనూ ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఎంజే మార్కెట్ నుంచి జీపీఓ, నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. జీపీఓ నుంచి ఎంజే మార్కెట్ వైపు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. లిబర్టీ, రవీంద్రభారతి, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం జంక్షన్లను తప్పించుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్, జాంబాగ్, తాజ్ ఐలాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీకి అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

నాంపల్లి, అబిడ్స్, రామకోటి, కోఠి, చాదర్‌ఘాట్ మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సుల రూట్లలోనూ మార్పులు చేసి.. వాటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లించారు. ఇక నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని చెప్పారు.

పాదయాత్ర ఏర్పాట్లు పరిశీలన
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాదయాత్ర ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పరిశీలించారు. బషీర్‌బాగ్‌లోని డాక్టర్‌ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ఎంజె మార్కెట్ (మొజాంజాహి మార్కెట్) వరకు అమిత్ షా భారీ పాదయాత్ర జరగనుండడంతో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ / ఫాతిమా హోటల్ పరిసరాల నుంచి ఎంజే మార్కెట్ (మొజాంజాహి మార్కెట్) వరకు వారు మార్గాన్ని పరిశీలించి, పాదయాత్ర విజయవంతానికి సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా అంశాలను పర్యవేక్షించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES