SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Balapur Laddu: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు తిరగరాస్తుందా? ఎంత మంది పోటీ అంటే?

Balapur Laddu Auction 2026 Full Details: వినాయక చవితి ఉత్సవాల్లో బాలాపూర్‌ లడ్డూ వేలం ఎంతో విశేషమైనది. నవరాత్రుల పాటు విశేష పూజలు అందుకున్న లడ్డూ ఈసారి ఎంత వేలం ధర పలుకుతుందనేది ఉత్కంఠ నెలకొంది. బాలాపూర్‌ లడ్డూ వేలం విశేషాలు ఇలా ఉన్నాయి.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 25, 2026, 07:53 AM IST | Updated: Sep 25, 2026, 07:56 AM IST
Image Credit: Balapur Laddu Auction
Join

Balapur Ganesh Laddu Auction 2026: హైదరాబాద్‌లో ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణపతి కొన్ని గంటల్లో నిమజ్జనం కానున్నాడు. హైదరాబాద్‌ మహా శోభాయాత్ర బాలాపూర్‌ నుంచే ప్రారంభం కానుంది. అంతుకుముందు బాలాపూర్‌ గణపతి  లడ్డూ వేలం పాట జరగనుంది. దేశంలోనే విశిష్ట ప్రాధాన్యం కలిగిన బాలాపూర్‌ లడ్డూ వేలం పాటకు సర్వం సిద్ధమైంది. లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు, దాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది వేలంపాటలో పాల్గొనేందుకు ఇప్పటివరకు ఎనిమిది మంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

వేలంపాటలో పాల్గొనాలనుకునే భక్తులు, దాతలు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని కమిటీ ప్రకటించింది. ప్రతి ఏడాది బాలాపూర్ గణపతి లడ్డూకు విశేష ఆదరణ లభిస్తుండగా లడ్డూను దక్కించుకోవడం అదృష్టంగా భక్తులు భావిస్తారు. గత ఏడాది వేలంపాటలో లడ్డూ రికార్డు ధర పలికిన నేపథ్యంలో ఈ ఏడాది ఆ రికార్డును అధిగమిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. బాలాపూర్ గణేష్ మండపం వద్ద లడ్డూ వేలంపాట నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది.

బాలాపూర్ గణేష్ లడ్డూ ఆశావహులు – 2026
సామ ప్రణీత్ రెడ్డి – అర్బన్ గ్రూప్, నివాసం: సాహెబ్‌నగర్
మర్రి రవికిరణ్ రెడ్డి – నివాసం: చంపాపేట్
కందాడ శాలిని వీరేందర్ రెడ్డి – కేవీఆర్ ఫ్లవర్ మర్చంట్, నివాసం: చంపాపేట్
కంచర్ల శివ రెడ్డి – నివాసం: హస్తినాపురం
సామ దయానంద్ రెడ్డి & సామ వరణంద్ రెడ్డి – ది సుషీ కో., లండన్
గడ్డం నవీన్ రెడ్డి – జీఎన్‌ఆర్ డెవలపర్స్, నివాసం: హస్తినాపురం
శ్రీకాంత్ – పీఎస్‌కే గ్రూప్
ఇబ్రామ్ ప్రత్యూష్ – నివాసం: బాలాపూర్
⁠రాజనాల రితున్ రెడ్డి- నివాసం బాలాపూర్

భారీ బందోబస్తు
బాలాపూర్ గణేష్ పూజా వేడుకలు ప్రారంభమయ్యాయి. మండపం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. నవరాత్రుల అనంతరం చివరి పూజతో విఘ్నేశ్వరుడి మండపం వద్ద వేడుకలు మొదలయ్యాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆధికారులు పటిష్టం భద్రతా చర్యలు చేపట్టారు. గణేష్ మండపం పరిధిలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక నిఘా బృందాలు,సిసి కెమారాలతో పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కూడా ప్రత్యేక బృందాలను నియమించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES