• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /వాహనదారులకు బిగ్ అలర్ట్.. నేడు సద్దుల బతుకమ్మ నేపథ్యంలోనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

వాహనదారులకు బిగ్ అలర్ట్.. నేడు సద్దుల బతుకమ్మ నేపథ్యంలోనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

Traffic Divertion: సద్దుల బతుకమ్మ పండగ కారణంగా హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సిటీలో ఇవాళ సద్దుల బతుకమ్మ పండుగ వేడుకల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. వివిధ ప్రాంతాల మార్గాల దారులు మళ్లించారు. ఆయా ప్రాంతాల వైపు వచ్చే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్లాన్ చేసుకోవాలని సూచించారు ట్రాఫిక్ పోలీసులు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 18, 2026, 02:09 PM IST|Updated: Oct 18, 2026, 02:14 PM IST
joinshare
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నేడు సద్దుల బతుకమ్మ నేపథ్యంలోనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
వామ్మో.. భారీ కొండచిలువను ఒంటిచేత్తో పట్టుకున్న మహిళ.. వీడియో!

వామ్మో.. భారీ కొండచిలువను ఒంటిచేత్తో పట్టుకున్న మహిళ.. వీడియో!

2

మెడలో నాగుపామును వేసుకుని సెల్ఫీ వీడియో.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

3

రైతులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 25న పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయా?.. వెంటనే చెక్ చేసుకోండి!

4

శివలింగాన్ని చుట్టేసిన నాగుపాము.. నవరాత్రుల్లో వైరల్‌గా మారిన అద్భుత దృశ్యం!

5

వామ్మె, పాడైన దొండకాయలకు ఆకుపచ్చ రంగు.. వీడియో!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Saddula Bathukamma: మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. కూకట్‌పల్లిలోని ఐడిఎల్ వద్ద జరిగే సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా హైటెక్ సిటీ నుంచి కూకట్‌పల్లి వైపు వాహనదారులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇవాళ సాయంత్రం ఆంక్షలు విధించారు. హైటెక్ సిటీ, మాదాపూర్, హఫీజ్‌పేట్ నుండి కూకట్‌పల్లి వై-జంక్షన్ వైపు వాహనదారులను మళ్లించారు. లక్కీ రెస్టారెంట్ సిగ్నల్, కేపీహెచ్‌బీ ఫేజ్ 4, రోడ్ నెం. 1, రెమెడీ హాస్పిటల్ మీదుగా రానున్నాయి.

వాహనాలు రెయిన్‌బో విస్టాస్, అంజయ్య నగర్ క్రాస్‌రోడ్స్, మూసాపేట్‌లోని వసుంధర ఆసుపత్రి మీదుగా కూకట్‌పల్లి వై-జంక్షన్‌కు చేరుకోవచ్చు. దీనికితోడు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సులు, సిటీ బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేశారు. వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎనిమిది చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచన చేశారు. ట్రాఫిక్ సమాచారం కోసం 9010203626 సంప్రదించాలని పేర్కొన్నారు పోలీసులు.

ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాల మళ్లింపు..

అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ, DBR మిల్స్, ఇందిరా పార్క్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు మళ్లించనున్నారు. ఖైరతాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను నెక్లెస్ రోటరీ వద్ద ప్రసాద్స్ ఐమాక్స్, మింట్ కాంపౌండ్ రోడ్ వైపు డైవర్ట్ చేశారు. అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఇక్బాల్ మినార్ యూ-టర్న్ వైపు మళ్లించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా వాహనాలు వెళ్లనున్నాయి. సికింద్రాబాద్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలు.. కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్, కవాడిగూడ, గాంధీనగర్, ఇందిరా పార్క్, కట్ట మైసమ్మ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నారు.

నల్లకుంట జంక్షన్ నుంచి బుద్ధ భవన్ వైపు వాహనాలను అనుమతించరు. వాటిని రాణిగంజ్, నెక్లెస్ రోడ్ వైపు వెళ్లనున్నాయి. ముషీరాబాద్ నుంచి చిల్డ్రన్స్ పార్క్, ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను DBR మిల్స్ వద్ద ఇందిరా పార్క్, కట్టమైసమ్మ వైపు మళ్లించనున్నట్లు తెలిపారు. హైటెక్ సిటీ నుంచి కూకట్‌పల్లి వైపు వాహనాలపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Trending News