• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /శివలింగాన్ని చుట్టేసిన నాగుపాము.. నవరాత్రుల్లో వైరల్‌గా మారిన అద్భుత దృశ్యం!

శివలింగాన్ని చుట్టేసిన నాగుపాము.. నవరాత్రుల్లో వైరల్‌గా మారిన అద్భుత దృశ్యం!

Snake On Shiva Lingam Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆలయంలోని శివలింగం వద్ద నాగుపాము దర్శనమిచ్చిన దృశ్యాలు మీరు చూడొచ్చు. నవరాత్రుల సమయంలో పాము దర్శనం ఇవ్వడం చూసి అందరూ శివయ్య లీలే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 18, 2026, 02:48 PM IST|Updated: Oct 18, 2026, 02:49 PM IST
joinshare
శివలింగాన్ని చుట్టేసిన నాగుపాము.. నవరాత్రుల్లో వైరల్‌గా మారిన అద్భుత దృశ్యం!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఎయిర్‌టెల్ సంచలనం.. రూ.185 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్! టెలికాం రంగంలో తొలి ఆపరేటర్‌గా రికార్డ్!

ఎయిర్‌టెల్ సంచలనం.. రూ.185 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్! టెలికాం రంగంలో తొలి ఆపరేటర్‌గా రికార్డ్!

2

Dussehra Tragedy: దసరా పండుగ వేళ తీవ్ర విషాదం.. పుట్టింటికి వెళ్తుండగా అన్నాచెల్లెలు దుర్మరణం

3

YS Jagan: ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్

4

వామ్మో.. భారీ కొండచిలువను ఒంటిచేత్తో పట్టుకున్న మహిళ.. వీడియో!

5

మెడలో నాగుపామును వేసుకుని సెల్ఫీ వీడియో.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Snake On Shiva Lingam Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వింతలతో పాటు విశేషాలు, ఆశ్చర్యం కలిగించే వైరల్ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. అయితే, అప్పుడప్పుడు భక్తి భావంతో కూడిన దృశ్యాలు కూడా వైరల్ అవుతూ కనిపిస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దసరా నవరాత్రుల సమయంలో శివలింగంపై నాగుపాము ప్రత్యక్షమైన అరుదైన దృశ్యం ఎప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్‌గా మారింది. శివలింగాన్ని చుట్టుకొని.. పడగవిప్పి నిలబడి ఉన్న నాగుపాము దృశ్యాలు ఇంటర్నెట్ను సైతం షేక్ చేస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక శివాలయం గర్భగుడిలో ప్రతిష్టించిన శివలింగంపై భారీ నాగుపాము ప్రత్యక్షమవడం మీరు గమనించవచ్చు. అది కేవలం అక్కడికి రావడమే కాకుండా. శివలింగానికి శరీరాన్ని గట్టిగా చుట్టుకొని పై భాగంలో పడగవిప్పి కూర్చుని వండడం మీరు చూడొచ్చు. ఆ సమయంలో ఆ పాము తీవ్ర ఉగ్రరూపంలో కనిపిస్తూ పదేపదే బుసలు కొడుతూ ఉండడం మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఆ అద్భుతమైన గుడిలో శివలింగంపై ఈ నాగుపాము పడగవిప్పి కనిపించడం చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు..

ప్రస్తుతం పవిత్రమైన దేవీ నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ అరుదైన దృశ్యం వెలుగులోకి రావడం విశేషం.. శివుని మెడలో నాగాభరణం కొలువై ఉండటం హిందూ పురాణాల్లో అనేక గ్రంథాల్లో మనం చదివి ఉంటాం. అలాంటిది సాక్షాత్తు శివలింగాన్ని నాగుపాము చుట్టుకుని దర్శనం ఇవ్వడం సామాన్యమైన విషయం కాదని భక్తులు సైతం అంటున్నారు. ఇదంతా ఆ శివయ్య లీలే అని.. సాక్షాత్తు పరమశివుడే ఆ నాగరాజు రూపంలో దర్శనం ఇచ్చాడని భావిస్తూ భక్తులు హరహర మహాదేవ అంటూ కామెంట్లు పెడుతూ వస్తున్నారు..

ఈ అద్భుతమైన దృశ్యాన్ని అక్కడ ఉన్నవారు తమ మొబైల్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అధికాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇంస్టాగ్రామ్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో ఈ వీడియోను చాలామంది షేర్ చేస్తున్నారు. కొంతమంది ఇది ప్రకృతి సహజంగా ఆ శివలింగం దగ్గరికి వచ్చిందని అంటూ ఉంటే.. కొందరు మాత్రం ఇది దైవ లీల అంటూ కామెంట్లు చేస్తూ.. పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఏది ఏమైనా నవరాత్రుల సమయంలో ఇలా నాగుపాము దర్శనం ఇవ్వడం చాలా విశేషం..

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Nupur Chanda (@mamanisourav)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News