SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Khairatabad Bypoll: ఖైరతాబాద్ బైపోల్‌కు బీజేపీ బిగ్ స్కెచ్..? అభ్యర్థి ఎంపిక కోసం వేట..!

Khairatabad By Election: తెలంగాణలో మరో బైపోల్ కు బీజేపీ రెడీ అవుతోంది..! త్వరలోనే ఖైరతాబాద్ సెగ్మెంట్‌కు బైపోల్ ఖాయమని ప్రచారం సాగుతుండటంతో.. అభ్యర్ధి ఎంపిక విషయంలో కమలనాథులు కసరత్తు మొదలు పెట్టారు..! ఖైరతాబాద్‌లో ఎవరిని బరిలో దింపాలనే దానిపై అధిష్టానం పెద్దలతో చర్చ జరుపుతున్నారు..! ప్రస్తుతం కాషాయ పార్టీ రేసులో నలుగురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. ఇద్దరూ ఆశావాదుల మధ్య మాత్రం.. నువ్వానేనా అన్నట్టుగా పోటీ ఉందా..! వీరిలో ఎవరో ఒకరిని ఖరారు చేసి.. ఇప్పటినుంచే ప్రజాక్షేత్రంలో దింపే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారా..! ఇంతకీ కాషాయ పార్టీలో అభ్యర్థిగా ఎవరిని ప్రకటించబోతున్నారు..!

Written By Ashok Krindinti
Published: Sep 23, 2026, 07:09 PM IST | Updated: Sep 23, 2026, 07:12 PM IST
Image Credit: Khairatabad By Election
Join

Khairatabad By Election: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు వేటు వేయడంతో.. ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. త్వరలోనే ఖైరతాబాద్ సెగ్మెంట్‌ కు బై పోల్ ఖాయమని అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టాయి.. కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీలో ఉంటారని ప్రచారం సాగుతుండగా.. బీఆర్ఎస్ నుంచి నలుగురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అటు బీజేపీ నుంచి కూడా నలుగురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే గెలుపు గుర్రానికి టికెట్ ఇవ్వాలని కాషాయ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఆయన పేరు కూడా టికెట్ రేసులో ఉంది.. కానీ మరో ముగ్గురు నేతలు కూడా తమకు టికెట్ కావాలని హైకమాండ్‌ను కోరుతుండటంతో.. టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే దానంను బలంగా ఢీ కొడితే.. బీజేపీ గ్రాఫ్ మరింత పెరుగుతుందని కాషాయ పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం..

గతంలో ఖైరతాబాద్ సెగ్మెంట్ నుంచి చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2009, 2014, 2023  ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్ధిగా రేసులో నిలిచారు. నాలుగుసార్లు పోటీలో నిలిస్తే.. 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. మూడుసార్లు మాత్రం ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం చింతల రామచంద్రారెడ్డి వయసు 74 ఏళ్లు. దాంతో ఈసారి ఆయనకు ఛాన్స్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిఆ ఉన్న బొల్లిపల్లి ఇంద్ర సేనారెడ్డి పేరును కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాషాయ పార్టీలో ఈయన కీలక నేతగా ఉండటంతో.. పాటు.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్టార్టప్ సేవలు ఏర్పాటు చేయాలని అనుకునేవారికి ఆయన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే టార్గెట్‌గా కాషాయ పార్టీ పెద్దలు ఇప్పటినుంచే కసరత్తు మొదలు పెట్టడంతో.. ఖైరతాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే అభ్యర్ధిని ముందుగా ప్రకటించి.. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాలని లెక్కలు వేసుకుంటున్నారట. 

మరోవైపు ఖైరతాబాద్ బీజేపీ టికెట్ రేసులో మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తనయ బండారు విజయలక్ష్మి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బండారు దత్తాత్రేయ కాషాయ పార్టీలో చాలా సీనియర్ నేత, గతంలో సికింద్రాబాద్ నుంచి అనేక సార్లు ఎంపీగా పనిచేశారు. ప్రధాని వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం గవర్నర్ గా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడాయన తన కూతురికి ఖైరతాబాద్ టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అలయ్- బలయ్ కార్యక్రమం ద్వారా విజయలక్ష్మిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే తన కూతురికి టికెట్ ఇస్తే.. తాను దగ్గరుండి గెలిపించుకుంటానని పార్టీ పెద్దలకు హామీ ఇస్తున్నారట. మరోవైపు బీజేపీ మహిళా నేత జూటూరీ కీర్తిరెడ్డి కూడా తనకు టికెట్ ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం యువతకు అవకాశం ఇస్తే.. పార్టీకి మరింత ప్లస్ అవుతుందని కాషాయ పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరోవైపు బీజేపీ టికెట్ ఎవరికి ఇస్తారో తేలకముందే.. కాషాయ పార్టీ నేతలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్లిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఉప ఎన్నికల్లో పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందన్న కేంద్రమంత్రి కాంగ్రెస్ ను జనం అసహ్యించుకుంటున్నారని అంటున్నారు. అసలు కాంగ్రెస్ తమకు పోటీ కానేకాదని చెబుతున్నారు. మరోవైపు దానం నాగేందర్ తనను తాను ఖైరతాబాద్ వినాయకుడితో పోల్చుకోవడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. మొత్తంగా ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమని అన్నారు..

ఏదీఏమైనా ఖైరతాబాద్‌లో కాషాయ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఎవరనేది మాత్రం.. త్వరలోనే తేలనుంది. అయితే ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో.. సర్వేలు నిర్వహించి.. గెలుపు గుర్రానికే టికెట్ ఇచ్చే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. చూడాలి మరి.. ఖైరతాబాద్‌లో బీజేపీ టికెట్ ఎవరికి దక్కుతుందో..!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES