• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /అమిత్ షాతో చిరంజీవి, రామ్‌చరణ్ భేటి.. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు..

అమిత్ షాతో చిరంజీవి, రామ్‌చరణ్ భేటి.. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు..

Chiranjeevi Charan Met Amit Shah: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షాతో ప్రముఖ సినీ నటులు చిరంజీవి, రామ్ చరణ్ భేటీ కానున్నారు. ఈ సమావేశం సినీ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 02, 2026, 01:32 PM IST|Updated: Nov 02, 2026, 01:37 PM IST
joinshare
అమిత్ షాతో చిరంజీవి, రామ్‌చరణ్ భేటి..  రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు..
Image Credit: Amit Shah Chiru Ram Charan (Source/File)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
School Holiday: ముంచుకొస్తున్న మురసు తుఫాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

School Holiday: ముంచుకొస్తున్న మురసు తుఫాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

2

Rajgopal Reddy: కాంగ్రెస్‌లో మంచితనాన్ని కూడా ఓర్చుకోలేరు.. సీఎం రేవంత్ పై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

3

Gurnoor Brar: టీమ్ ఇండియా పేసర్ ప్రైవేట్ ఫొటోలు లీక్..? నెట్టింట స్క్రీన్‌షాట్స్ వైరల్..!

4

Jailer 2 Movie Collection: రూ.800 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన 'జైలర్ 2' మూవీ..సినీ చరిత్రలో రజనీకాంత్ సరికొత్త రికార్డు!

5

Dhana trayodashi: ధనత్రయోదశి వేళ మరో అద్భుతం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్‌తో పాటు సొంతింటి కల సాకారం.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Amit Shah Meeting With Chiranjeevi Ram Charan: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక రోజు పర్యటన నిమిత్తం భాగ్యనగరానికి విచ్చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈయనకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. అటు నుంచి ఆయన హోటల్ కాకతీయలో బస చేయనున్నారు.

ఐటీసీ కాకతీయలో అమిత్ షాతో చిరు, చరణ్ భేటి.. 

ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో వీరు అమిత్ షాతో మర్యాదపూర్వకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ.. అందుకు అనుగుణంగా రాజకీయ, సంస్థాగత కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. ఇటీవలే పార్టీలో కీలక సంస్థాగత మార్పులు చేపట్టిన అధిష్ఠానం.. తాజాగా ఇండియా కూటమి ఆందోళనలకు కౌంటర్ ఇచ్చేందుకు అమిత్ షాను రంగంలోకి దింపింది.

ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ అమిత్ షాతో భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పైకి ఇది మర్యాదపూర్వక సమావేశమేనని చెబుతున్నప్పటికీ.. దీని వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా లేదా అన్న  చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఎస్ఐఆర్ ప్రక్రియ.. 

ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇండి కూటమి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలకు కౌంటర్ ఇచ్చేలా జాతీయ నాయకత్వం ఆదేశాలతో రాష్ట్ర బీజేపీ మహా పాదయాత్రకు సిద్ధమైంది. ‘లోక్‌తంత్ర బచావో-అరాచకత హటావో’ నినాదంతో నిర్వహించనున్న ఈ పాదయాత్రలో అమిత్ షా పాల్గొననున్నారు. ముందుగా  నడిబొడ్డున పాతబస్తిలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటించనున్నారు. 

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న అమిత్ షా.. 

మరికాసేపట్లో ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. CRPF బలగాలతో గస్లీ కాస్తున్నారు. బీజేపీ నేతలతో కలిసి అమిత్ షా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అమిత్ షా..మహా పాదయాత్రలో పాల్గొననున్నారు. పాదయాత్ర అనంతరం సాయంత్రం ఆయన తిరిగి ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Amit Shah
BJP
Telangana News
Hyderabad