Four dead in lorry auto rickshaw collision in vikarabad: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అనంతగిరి కొండల ఘాట్ రోడ్డు మార్గంలో లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటో పూర్తిగా బోల్తాపడి ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు విగతజీవులుగా మారిపోయింది. వెంటనే అక్కడి వారు ఆటోలో ఉన్న వారిని బైటకు తీశారు. కానీ అప్పటికే వారంతా చనిపోయినట్లు గుర్తించారు.
ఆ ప్రాంత మంతా రక్తపు మరకలతో భయానకంగా మారిపోయింది. ఆటోలో ఉన్నవారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని స్థానికులు చెబుతున్నారు. వికారాబాద్ మండలం పెండ్లి మడుగు నుంచి కేరెల్లికి ఆటోలో వెళ్తుండగా బుగ్గామేశ్వరం సమీపంలో మలువు వద్ద ఘటన చోటు చేసుకుంది.
చనిపోయిన వారిలో.. ముగ్గురు మహిళలు, ఆటో డ్రైవర్ , చనిపోయిన వారిలో నాగేష్, చంద్రమ్మ, పార్వతమ్మ, సరితగా గుర్తించారు. పోలీసులు వచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. డెడ్ బాడీల్ని అక్కడి నుంచి మార్చురీకి తరలించారు.