SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gachibowli Hotel Raid: హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచార ముఠా..ముగ్గురు విదేశీ అమ్మాయిలతో దందా..అడ్డంగా దొరికిపోయి..

Gachibowli Hotel Raid Busts: హైదరాబాద్ నగరం నడిబొడ్డున విచ్చలవిడిగా వ్యభిచార దందా నడుస్తోంది. గచ్చిబౌలి ప్రాంతంలో విదేశీ మహిళల రప్పించి హైటెక్ లెవల్‌లో ఈ వ్యభిచారం చేయిస్తుందన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హోటల్‌పై పోలీసులు చేసిన దాడిలో ఈ వ్యవహారం బయటపడింది. ఉజ్బెకిస్థాన్ దేశానికి చెందిన ముగ్గురు మహిళలతో ఈ అక్రమ దందా వెనుకుండి నడిపిస్తున్న ముగ్గురు నిర్వాహకులను అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

Written By Harish Darla
Published: Oct 01, 2026, 08:04 PM IST | Updated: Oct 01, 2026, 08:06 PM IST
Join

Gachibowli Hotel Raid Busts: హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ ప్రముఖ హోటల్‌లో వ్యభిచార దందా యదేచ్ఛగా సాగుతోంది. ఇలా రహస్యంగా జరుగుతోన్న మానవ అక్రమ రవాణా, వ్యభిచార దందాను స్థానిక పోలీసులు ఛేదించారు. ఉజ్బెకిస్థాన్ దేశానికి చెందిన ముగ్గురు మహిళలను ఇక్కడికి తీసుకొచ్చి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అధికారులకు అందింది. పక్కా సమాచారంతో సంబంధిత హౌటల్‌కు వెళ్లిన పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) అధికారులు సంయుక్తంగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆకస్మికంగా దాడులు చేశారు.

అదే సమయంలో హోటల్‌లోని వేర్వేరు గదుల్లో ఉంటూ వ్యభిచార దందా సాగిస్తున్న ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఈ అక్రమ దందా వెనుక ప్రధాన సూత్రధారులుగా ఉన్న ఢిల్లీకి చెందిన నిఖిల్‌, హర్షిత్‌ సింఘానియా, రామ్మోహన్‌రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసు అధికారులు అరెస్టు చేశారు.

అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ మొత్తం వ్యవహారానికి నిఖిల్‌ ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించగా, అతనికి రామ్మోహన్‌రెడ్డి ప్రధానంగా సహకరించి ఈ దందాను నడిపించినట్లు అధికారులు గుర్తించారు. గచ్చిబౌలీలోని ఈ హోటల్‌పై దాడి చేసిన సందర్భంగా చేపట్టిన సోదాల్లో పోలీసు అధికారులు రూ. 13 వేల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు, రామ్మోహన్‌రెడ్డి వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.

పోలీసుల దాడుల్లో అధికారులకు చిక్కిన ఉజ్బెకిస్థాన్ మహిళలు కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు తేలింది. వారి వద్ద ఉన్న పాస్‌పోర్టులు, వీసా రికార్డులను పోలీసులు స్పష్టంగా పరిశీలించగా.. అవి ప్రస్తుతం చెల్లుబాటులోనే ఉన్నాయని అధికారులు నిర్ధారించారు.

అయితే, ఈ విదేశీ మహిళలు నగరానికి చేరుకున్న తర్వాత ఎవరెవరిని కలిశారు? హోటల్‌లో గదుల బుకింగ్స్ ఎవరు చేశారు, అసలు వీరిని ఈ వ్యభిచార వ్యవహారంలోకి ఎవరు తీసుకొచ్చారు అనే అనేక కీలక అంశాలపై ప్రసుత్తం గచ్చిబౌలీ పోలీసులు కీలకంగా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్ ద్వారా విటులను సంప్రదించి ఈ హోటల్‌కు రప్పించారా? అనే కోణంలోనూ అధికారులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.

అలాగే స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో ఉన్న కాల్ వివరాలు, సందేశాలు, ఇతర డిజిటల్ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఈ నెట్‌వర్క్‌ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందో, ఇంకా ఎంతమంది ఉన్నారో తేల్చేందుకు గచ్చిబౌలీ పోలీసులు ముమ్మరంగా ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES