SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

హైదరాబాద్‌లో రాపిడో డ్రైవర్ వీరంగం.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కొరికిన యువకుడు!

Rapido Driver Bites: చంద్రయాన గుట్ట పరిధిలో ఒక రాపిడో డ్రైవర్ సృష్టించిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఓ ర్యాపిడ్ డ్రైవర్ మద్యం మత్తులో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ కొరికిన ఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 25, 2026, 11:41 AM IST | Updated: Oct 25, 2026, 11:42 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Rapido Driver Bites Telugu News: నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేపట్టిన ప్రత్యేకమైన తనిఖీల్లో ఊహించని.. ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ రాపిడో బైక్ డ్రైవర్.. విధినిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఏకంగా దాడి చేసి దొరికిన తీరు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అనంతరం నడి రోడ్డుపై నానా హంగామా చేస్తూ వీరంగం చేసిన ఘటన పాతబస్తీ పరిధిలోని చంద్రయాన గుట్ట సమీపంలో చోటుచేసుకుంది..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 
చంద్రయానగుట్ట పరిసర ప్రాంతాల్లో పోలీసులు రాత్రి సమీపంలో రాకపోకలను పర్యవేక్షిస్తూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేపట్టారు.. ఈ క్రమంలో అటుగా ప్రయాణికులను తీసుకొని వెళ్తున్న రాపిడో డ్రైవర్‌ను వారు ఆపారు. అయితే, అజీజ్ అనే యువకుడిని పోలీసులు అక్కడే ఆపడంతో పాటు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా.. తీవ్రమైన మద్యం మత్తులో వాహనం నడుపుతున్నట్లు తెలిసింది.. నిబంధనల ప్రకారం..అతడు నడుపుతున్న వాహనం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు..

తన బైకును సీజ్ చేసుకున్నారన్న కోపంతో అజీజ్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.. అతనికి నచ్చజెప్పి శాంతింప చేసేందుకు పోలీసులు వివిధ రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ..ఓ కానిస్టేబుల్ పై నిందితుడు ఒక్కసారిగా విరుచుకు పడడం ఆశ్చర్యం కలిగించింది. అయితే, ఆ యువకుడు మద్యం మత్తులో ఉండడం కారణంగా పోలీసులు ఎంత అతన్ని ఆపాలని ట్రై చేసినప్పటికీ.. అతడు అలాగే ప్రవర్తించి విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ పై దాడి చేసి గట్టిగా కొరికి అతనిని గాయపరిచాడు. నొప్పి భరించలేక కానిస్టేబుల్ కేకలు వేయడంతో తోటి సిబ్బంది వెంటనే స్పందించి.. నిందితుడిని పక్కకి లాగారు..

కానిస్టేబుల్ను కొరికిన తర్వాత కూడా అజీజ్ ఏ మాత్రం ఆగలేకపోయాడు.. రోడ్డుపై పరుగులు తీస్తూ.. వింతగా ప్రవర్తిస్తూ వాహనదారులను.. పోలీసులను అసభ్య పదజాలంతో దూషిస్తూ అక్కడ నానా హంగామా చేశాడు.. మద్యం మత్తు తలకెక్కడంతో రోడ్డుపైనే బైఠాయించి గందరగోళం సృష్టించాడు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.. అయితే పోలీసులు తీవ్రంగా శ్రమించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES