SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన బంజారా హిల్స్ ఎస్సై.. పోలీసు శాఖలో కలకలం.!.

Banjara hills si bribe Case: ఒక చీటింగ్ కేసులో బాధితుడి నుంచి రూ. 10 లక్షలను ఎస్సై డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్సైను అడ్డంగా పట్టుకున్నారు. ఈ ఘటన సంచలనంగా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 28, 2026, 03:08 PM IST | Updated: Oct 28, 2026, 03:18 PM IST
Image Credit: banjarahills si arrested
Join

Banjara Hills SI arrested by telangana acb while taking bribe: తెలంగాణలో ఇటీవల  కొంత మంది ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోతున్నారు.  ఎన్నిఘటనలు వెలుగులోకి వచ్చిన,ఎంత మంది అవినీతి అనకొండలను అరెస్ట్ చేసిన లంచాలు తీసుకొవడం మాత్రం మానుకొవడంలేదు. ఈక్రమంలో సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు కొంత మంది లంచాలు తీసుకొవడం, బాధితుల్ని లైంగికంగా వేధింపులకు గురిచేయడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో బంజారా హిల్స్ ఎస్సై లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. 

 

 

ఈ ఘటన పోలీసు శాఖలో సంచలనంగా మారింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ఎస్సై ఒక చీటింగ్ కేసులో బాధితుడి నుంచి రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో వలపన్ని ఆయన్ను పట్టుకున్నారు. చీటింగ్ కేసులో  బాధితుడి నుంచి రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు.   ఇదే కాకుండా 2024 సంవత్సరానికి సంబంధించిన కేసులు కూడా అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్నాయని, నోటీసులు ఇవ్వడం, రిప్లైలు తీసుకోవడం వంటి అంశాలపై విచారణ జరుగుతోందని చెప్పారు.  ఈ క్రమంలో కేసుల్లో సహాయం రిలీఫ్ కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. 

ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి బాధితుడితో డబ్బులు ఇప్పిస్తు  ఎస్సై విజయ్‌ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ కీలక విషయాల్ని వెల్లడించారు. అవినీతికి పాల్పడితే ఎవర్ని వదిలేది లేదని తెల్చి చెప్పారు.  ఈ ఘటన  కాస్త పోలీస్ డిపార్ట్ మెంట్ లో తీవ్ర కలకలంగా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES