• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /కేబీఆర్ పార్క్.. రచ్చ.. తప్పు ఎవరిది..? ప్రభుత్వ లెక్క ఎక్కడ తప్పింది..!!

కేబీఆర్ పార్క్.. రచ్చ.. తప్పు ఎవరిది..? ప్రభుత్వ లెక్క ఎక్కడ తప్పింది..!!

KBR Park Controversy: హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ ప్రజా ప్రయోజనకర పనులు చేపట్టాలనుకున్నారు. పర్యావరణాన్ని ధ్వంసంచేశారు. అంతా అయిన తర్వాత పనులు మొదలుపెట్టిన తర్వాత చేయాలనుకున్న పనులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం ఇపుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద రచ్చగా మారింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 07, 2026, 05:59 AM IST|Updated: Oct 07, 2026, 07:19 AM IST
joinshare
కేబీఆర్ పార్క్.. రచ్చ.. తప్పు ఎవరిది..?  ప్రభుత్వ లెక్క ఎక్కడ తప్పింది..!!
Image Credit: KBR Park (ZEE News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ప్రధాని మోడీ రేర్ రికార్డు.. ప్రభుత్వాధినేతగా 25 యేళ్లు పూర్తి..

ప్రధాని మోడీ రేర్ రికార్డు.. ప్రభుత్వాధినేతగా 25 యేళ్లు పూర్తి..

2

Jharkhand: చీరకట్టులో, షూస్ లేకుండా రన్నింగ్.. హోంగార్డ్ జాబ్ కోసం మహిళ చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో..

3

Uttarakhand earthquake: అర్ధరాత్రి ఒక్కసారిగా కంపించిన భూమి.. భయంతో బయటకు పరుగులు..!

4

తెలంగాణలో నేటితో ముగియనున్న కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ..

5

Tamil nadu: రెస్టారెంట్‌లోని వ్యక్తితో పరిచయం.. భర్త అడ్డుగా ఉన్నాడని భార్య కన్నింగ్ ప్లాన్.. తమిళనాడులో బైటపడ్డ షాకింగ్ ఘటన..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Is Government Mistake: వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి దాదాపు రెండువేల చెట్లను నరికివేసి, నగరం నడిబొడ్డున పచ్చని పరిసరాలను తీవ్రంగా దెబ్బతీసిన తర్వాత... ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించాలనుకున్న 7 ఫ్లైఓవర్లను, 7 అండర్‌ పాస్‌లను   రద్దు చేయాలని  ప్రభుత్వ యంత్రాంగం తీరిగ్గా నిర్ణయం తీసుకోవడం పెద్ద వివాదానికి దారి తీసింది. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారమా? ప్రభుత్వానికి ప్రాజెక్టు ఖర్చు ఆదా అయిందా? అధికారులు ఏమంటున్నారు?ఇంతకీ ప్రభుత్వం ఏంచేయాలనుకుంది? ఇపుడు ఏంచేసిందనే దానిపై పెద్ద రచ్చ నడుస్తోంది.

ముందుగా 7 ఫ్లై ఓవర్లు.. 7 అండర్ పాస్‌లు.. 

రోజురోజుకు పెరిగిన వాహనాలతో హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్య నానాటికీ తీవ్రతరమైంది. కేబీఆర్ పార్కు దగ్గర పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పీక్ టైంలో వాహనదారులు రోజూ చుక్కలు చూస్తున్నారు. కేబీఆర్ పార్క్ దగ్గక ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ చేసింది.వాహనాల రద్ధీని క్రమ బద్ధీకరించేందుకు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద.. కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు నిర్మించాలని టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజినీర్లు ప్రతిపాదనలు చేశారు.

కేబీఆర్ పార్క్ చుట్టూ 14 వందల కోట్ల అంచనా.. 
కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు 14 వందల కోట్ల అంచనా వ్యయంతో మల్టీ డైరెక్షనల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల పనులు ప్రారంభించారు. నిర్మాణ పనుల కోసం కేబీఆర్ పార్కు చుట్టూ  క్లాక్ వైజ్ వన్ వే విధనాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రవేశపెట్టిన క్లాక్‌వైజ్ వన్-వే ట్రాఫిక్ విధానం విజయవంతం కావడంతో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గింది. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడంతో ..చేపట్టాలనుకున్న మల్టీ డైరెక్షనల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణ ప్రాజెక్టును అధికార యంత్రాంగం నిలుపుదల చేసింది.


కేఎన్ఆర్ - మేఘా కాంట్రాక్ట్స్ రద్దు.. 
కేబీఆర్ ​పార్కు గేట్​, బసవతారకం క్యాన్సర్​ ఆస్పత్రి, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, ముగ్దా జంక్షన్​ తదితర కూడళ్లలో తలపెట్టిన పనులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులకు సంబంధించిన కాంట్రాక్టు సంస్థలు కేఎన్​ఆర్​, మేఘాతో చేసుకున్న ఒప్పందాల రద్దయ్యాయి.

పర్యావరణం ధ్వంసంచేసి ప్రజాధనం వృధా చేశారనే విమర్శలు..

అయితే కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, అండ్ పాస్ ల నిర్మాణంకోసం పెద్ద పెద్ద గుంతల తీశారు. వందలాది చెట్లను నరికివేశారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డును కూడా తవ్వేశారు. ఈ పనులతో పర్యావరణం ధ్వంసమైందనే ఆరోపణలు వచ్చాయి. చెట్ల నరికివేతపై కొందరు పర్యావరణ వేత్తలు కోర్టులకు కూడా వెళ్లారు. గ్రీన్ ట్రిబున్యల్ తో పాటు సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు వేశారు. కేబీఆర్ దగ్గర చేపట్టిన నిర్మాణాలపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణాలను రద్దు చేస్తూ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటి నిర్ణయం తీసుకుంది. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. వందల కోట్ల రూపాయల పనులు చేపట్టాకా రద్దు చేయడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. నరికేసిన చెట్ల పరిస్థితి ఏంటనే కొందరు ప్రశ్నిస్తున్నారు.

అండర్ పాస్‌లు.. ఫ్లై ఓవర్స్ స్థానంలో ఎలివేటెడ్ కారిడార్..

ఇక సర్కార్ నిర్ణయంతో ప్రాజెక్టు తలపెట్టిన పరిసరాల్లో  ఫ్లైఓవర్ల పిల్లర్ల కోసం భారీగా తవ్విన గుంతలను మట్టితో పూడ్చుతున్నారు. నిర్మాణ ప్రదేశాల్లో మిగిలిన స్టీల్ రాడ్లను సైతం తొలగించి తరలిస్తున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ ప్రతిపాదిన ప్రాజెక్టును రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత  జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీకర్ణన్ పరిశీలించారు. వన్ వే విధానంతో ట్రాఫిక్ సమస్య తగ్గిందని.. అందుకే ఎలివేటెడ్ కారిడార్ చేపట్టాలని నిర్ణయించామని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి 4 వందల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు.

వారం రోజులు పాటు తప్పని తిప్పలు.. 
వన్ వే విధానం అమల్లోకి తెచ్చిన వారంరోజుల పాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కనిపించారు. అయితే ట్రాఫిక్ సమస్యకు ఇబ్బంది లేకుండా పోయింది. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ విధానంతో వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలు ఎక్కువసేపు ఆగే పరిస్థితి లేకుండా పోయింది. అయితే అండర్ పాస్, ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టకముందే వన్ విధానాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించి, ఆ తర్వాత పనులు చేపట్టి ఉంటే బాగుండేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పర్యావరణం ధ్వంసమై, ప్రజాధనం ఖర్చుచేసిన తర్వాత ప్రాజెక్టును రద్దు చేశారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ట్రాఫిక్ సమస్య లేకపోవడంతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ రద్దు..

కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యకు పరిష్కార మార్గం లభించిందని భావిస్తున్న అధికారులు.. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు ఎలివేటెడ్ వేకు ప్లాన్ చేశారు. పంజాగుట్ట ఎన్​ఎఫ్​సీఎల్​ కూడలి నుంచి జూబ్లీ చెక్​‌పోస్ట్ మెట్రో స్టేషన్​ రోడ్డును కలుపుతూ ఆరు లేన్ల ఎలివేటెడ్​ కారిడార్​ నిర్మాణానికి స్థాయీ సంఘం ఆమోదం తెలిపింది. ఈ పైవంతెన 4 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. బంజారాహిల్స్​ రోడ్డు నెం.3లోని ముఫకంజా విద్యాసంస్థల వద్ద పైవంతెన ఎక్కితే నేరుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మెట్రో స్టేషన్​ చేరుకునే విధంగా ఆరు లేన్ల రోడ్డు రూపుదిద్దుకోబోతోంది.

గతంలో చేపట్టిన ఏడు ఫ్లైఓవర్లు.. అండర్ పాసులను దాదాపు 14 వందల కోట్ల రూపాయలతో చేపట్టగా.. తాజాగా తలపెట్టిన 4.4 కిలోమీటర్ల ఎలివేటెడ్ వేకు సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి. ప్రజాప్రయోజనా దృష్ట్యా చేపట్టే అభివృద్ధి పనుల్లో ప్రజాధనం వృధా చేయకుండా… అధికార యంత్రాంగం ముందస్తుగా అధ్యయనం చేసి, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

(రచయతలు.. కిరణ్ కుమార్ శర్మ - మునిరాజ్ జీ తెలుగు న్యూస్ డెస్క్ సౌజన్యంతో)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Congress
BRS
BJP