Man attacks on bike rider after asking lift in Mylardevpally: ఇటీవల సమాజంలో అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. డబ్బుల కోసం కొంత మంది ఎంతటి దారుణాలు చేయడానికి సైతం వెనుకాడటంలేదు. ముఖ్యంగా సింగిల్ గా వెళ్తున్న మహిళలు, వృద్ధులను టార్గెట్గా చేసుకుని దాడులు చేసి చోరీలకు పాల్పడి అందిన కాడికి చోరీలు చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు మీద ఇటీవల లిఫ్ట్ లు అడిగి ఆతర్వాత చోరీలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. మైలావ్ దేవ్ పల్లిలో ఈకోవకు చెందిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
లిఫ్ట్ అడిగి, ఫోన్ చోరీకి యత్నం.. ఆపై పట్టుకున్న బైకర్‌పై కత్తితో దాడి హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో మెహఫిల్ హోటల్ సమీపంలో ఘటన తన పని ముగించుకొని.. బైక్‌పై ఇంటికి పయనమైన ఒక వ్యక్తి(57) మెహఫిల్ హోటల్ సమీపంలో ఓ వ్యక్తి లిఫ్ట్ అడగడంతో బైక్ ఆపిన బైకర్ అయితే.. పై జేబులో ఫోన్ ఉండటం చూసి దాన్ని చోరీ చేసేందుకు యత్నం బైకర్ వెంటనే చెయ్యి పట్టుకోగా.. ఆయనపై కత్తితో రెండుసార్లు దాడి చేసిన దుండగుడు బాధితుడి గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావం.. ఆస్పత్రికి తరలించిన స్థానికులు దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి పారిపోయిన నిందితుడు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
— PulseNewsBreaking (@pulsenewsbreak) November 20, 2026
హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మెహఫిల్ హోటల్ సమీపంలో ఒక వ్యక్తి తన పనులు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి మెహఫిల్ హోటల్ సమీపంలో లిఫ్ట్ అడిగాడు. దీంతో బైకర్ ఆగి అతడ్ని ఎక్కించుకున్నాడు.
బైక్ స్టార్ట్ చేసి వెళ్తుంగా జేబులో ఉన్న సెల్ ఫోన్ ను చోరీకి యత్నించాడు. వెంటనే అలర్ట్ అయి చెయ్యి పట్టుకొవడంలోక అతని మెడపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత బైక్ నుంచి దూకి పారిపోయాడు. బాధితుడు తన ఇంటికి అలానే రక్తం కారుతున్న వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాధితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరోవైపు బాధితుడికి గోంతు దగ్గర కత్తి పోట్ల వల్ల లోతు వరకు గాయమైనట్లు వైద్యులు తెలిపారు.
మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దాడి చేసిన వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకొవాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి ఆ మార్గంలో ఉన్నన సీసీటీవీ ఫుటేజీని జల్లెడపడుతున్నారు.