SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

10 నెలల బిడ్డను భుజాన వేసుకుని.. ఉత్తరాలు పంచుతున్న మమత..

Medchal Postal Worker Mamatha: ఒక చేత పసికందును వేసుకుని.. మరో చేత ఉత్తరాలను పంచుతున్న ఓ మహిళ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మేడ్చల్ పోస్టాఫీసులో పని చేస్తున్న మమత తన పసికందును భూజాన వేసుకుని.. ఉత్తరాలు పంచుతుంది. అయితే, దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 22, 2026, 06:21 PM IST | Updated: Sep 22, 2026, 06:23 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్
Join

Medchal Postal Worker Mamatha: ఒక చేతితో ఇంటి బాధ్యతలు, మరో చేతితో ఉద్యోగ బాధ్యతలను సమానం చేసుకుంటూ.. ముందుకు సాగడం ప్రతి మహిళ జీవితంలో ఒక సందర్భంలో ఎదురయ్యే పెద్ద సవాలని భావించవచ్చు.. అయితే.. ఈ రెండింటి మధ్య నలిగిపోకుండా.. రెండింటినీ సమానంగా స్వీకరిస్తూ సమాజానికే ఆదర్శంగా నిలుస్తున్నారు మేడ్చల్‌కు చెందిన మమత అనే పోస్టల్ ఉద్యోగిని.. తన 10 నెలల పసికందును భుజానికి ఎత్తుకుని.. మరోవైపు పోస్టులు పంచుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.

మేడ్చల్ పోస్టాఫీసులో గత 4 సంవత్సరాలుగా పోస్టల్ డెలివరీ ఉద్యోగిగా మమత ఉద్యోగం చేస్తోంది. ప్రసవం అనంతరం తిరిగి.. విధుల్లో చేరిన ఆమెకు పసిబిడ్డ సంరక్షణ అనేది పెద్ద సవాలుగా మారుతూ వచ్చింది.. ఇంటివద్ద బిడ్డను వదిలివెళ్లలేని పరిస్థితి.. అలాగని చేస్తున్న ఉద్యోగాన్ని ఆపేయలేని ఎన్నో కారణాలు.. ఈ క్రమంలో ఆమె వెనకడుగు వేయలేదు.. తన కర్తవ్యానికి ఎలాంటి లోటు రాకుండా.. రెండింటినీ ఏకకాలంలో సమన్వయం చేసుకోవాలని ఒక అద్భుతమైన గొప్ప నిర్ణయం తీసుకుంది..

ఉదయాన్నే విధులకు హాజరయ్యే మమత.. తన 10 నెలల చిన్నారిని బెల్టుతో భుజానికి కట్టుకుని.. చేతిలో పోస్టల్ బ్యాగుతో గల్లీగల్లీ తిరుగుతున్నారు. ఎండ, వర్షం వంటి వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా ఇంటింటికీ వెళ్లి ఉత్తరాలతో పాటు పార్శిళ్లు, ఇతర పోస్టల్ సేవలను ప్రజలకు సకాలంలో అందించడం విశేషం..

ఇది కూడా చదవండి..:అన్నదానంలో మరిగే సాంబార్ గిన్నెలో పడిపోయిన మహిళ.. CCTV వీడియో వైరల్! 

రోజూ బాబును ఎత్తుకుని.. కాలినడకన విధులు నిర్వర్తిస్తున్న మమతను చూసి స్థానికులు.. ఉన్నతాధికారులు ప్రసంశల కురిపిస్తున్నారు. పనిపై ఆమెకున్న అంకితభావంతో పాటు బిడ్డపై చూపిస్తున్న ప్రేమ చూసి అందరూ గ్రేట్‌ అంటున్నారు. చాలామంది మహిళలకు ఆమె ఇప్పుడు ఒక స్ఫూర్తిగా నిలుస్తూ వస్తోంది.. బాధ్యతలను తప్పించుకోవడానికి కారణాలు వెతికే సమాజంలో.. ఉన్న సమస్యలనే ధైర్యంగా ఎదుర్కొంటూ.. రెండు బాధ్యతలను మోస్తున్న మమత అందరికీ గొప్ప ఆదర్శం. ప్రస్తుతం మమత విధులను నిర్వర్తిస్తున్న తీరుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి..:అన్నదానంలో మరిగే సాంబార్ గిన్నెలో పడిపోయిన మహిళ.. CCTV వీడియో వైరల్! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES