SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

భాగ్యనగరంలో నేడు రాహుల్ ర్యాలీ.. హై అలర్ట్..

Rahul Gandhi Hyderabad Rally: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో రాహుల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 14, 2026, 07:36 AM IST | Updated: Nov 14, 2026, 07:37 AM IST
Image Credit: Rahul Gandhi at Hyderabad (ZEE News Telugu/Source)
Join

Rahul Gandhi Bharat Summit: హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోనన  భారత్‌ సమిట్‌లో పాల్గొనేందుకు అర్ధరాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు  ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. ఈ రోజు ఉదయం తెలంగాణ గిగ్‌ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమం పథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో కలిసి  పాల్గొంటారు.

సాయంత్రం భారత్‌ సమిట్‌ ముగింపు సభలో రాహుల్‌ గాంధీ ప్రసంగం..  

ఉదయం 9 గంటలకు భారత్‌ సమిట్‌లో భాగంగా లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ప్రతినిధులతో సమావేశం అవుతారు. 9.45 గంటలకు అమెరికా, ఐరోపా ప్రతినిధులతో మరో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు హైటెక్‌సిటీలోని శిల్పారామం నుంచి ర్యాలీగా బయలుదేరి జయభేరి గ్రౌండ్‌కు చేరుకుంటారు.

తెలంగాణ గిగ్‌వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకం ప్రారంభం..

అక్కడ 11 గంటలకు తెలంగాణ గిగ్‌వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు హెచ్‌ఐసీసీలో జరిగే భారత్‌ సమిట్‌ ముగింపు సభకు హాజరవుతారు. ఈ సందర్బంగా ఈయన ఏం మాట్లాడుతారనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో రాహుల్ గాంధీ ర్యాలీతో రాబోయే జీహెచ్‌ఎంసీ సహా మూడు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చూడాలి. మరోవైపు రాహుల్ గాంధీ ‘సర్’ సహా ప్రధాని మోడీ సహా దేశానికి సంబంధించిన ఏయే అంశాలను ఈ వేదికగా ప్రస్తావిస్తారనేది ఆసక్తికరంగా మారింది. లోక్ సభ ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఆయన పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES