• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /ఈటల పాదయాత్రకు బ్రేక్..? అనుమతులివ్వని పోలీసులు..

ఈటల పాదయాత్రకు బ్రేక్..? అనుమతులివ్వని పోలీసులు..

Telangana BJP MP Etala Rajender: జవహార్‌ నగర్‌ డంపింగ్‌ యార్డు తరలించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఎంపీ ఈటల రాజేంధర్‌ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇవాళ ఉదయం ఏదులాబాద్‌ లక్ష్మీనారాయణ చెరువు నుండి పాదయాత్రను చేపట్టాలనుకున్న ఈటలకు చుక్కెదురు అయింది. అనుమతులు లేవని పోలీసులు పాదయాత్రకు నో చెప్పారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 27, 2026, 11:30 AM IST|Updated: Oct 27, 2026, 11:42 AM IST
joinshare
ఈటల పాదయాత్రకు బ్రేక్..? అనుమతులివ్వని పోలీసులు..
Image Credit: Etela Rajender Pada Yatra Break (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
వంటగది నుంచి వ్యాపారం దాకా.. స్ట్రీట్ ఫుడ్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న బిహార్ మహిళలు..!!

వంటగది నుంచి వ్యాపారం దాకా.. స్ట్రీట్ ఫుడ్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న బిహార్ మహిళలు..!!

2

తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..నవంబర్ నెలలో శ్రీవారి విశేష పర్వదినాలు! ప్లాన్ చేసుకునే ముందు చూడండి!

3

తమిళనాడు తేని జైలులో బిగ్ ఎస్కేప్.. 17 మంది ఖైదీలు పరార్..!

4

భీకరంగా అర్నాబ్ తుపాను.. కోతకు గురైన ఉప్పాడ ప్రాంతం..

5

Bengal Encounter: బెంగాల్‌లో మరో సంచలనం.. మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడు ఎన్‌కౌంటర్‌..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Etala Rajender: డంపింగ్ యార్డును తరలించాలనే డిమాండ్‌తో స్థానికులను ఏకతాటిపైకి తీసుకువచ్చి, ఆందోళనను తీవ్రతరం చేయడమే ఈ పాదయాత్ర ఉద్దేశ్యమన్నారు. ఇప్పటికే మేధావులు, పర్యావరణవేత్తలు, బాధితులతో ఎంపీ ఈటల సమావేశం అయ్యారు. డంపింగ్‌ యార్డు నుంచి వచ్చే మిథేన్‌ గ్యాస్‌తో చుట్టు పక్కల అనేక మంది ప్రజలకు  ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. స్థానికంగా మల్కాజ్‌గిరి ఎంపీగా ఈ డంపింగ్ యార్డ్ తరలింపు తన అత్యంత ప్రాధాన్యత అంశాల్లో ఒకటని పేర్కొన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఈటల పాదయాత్రను తలపెట్టారు. ఇంటి నుంచి ఒక్కరు పాదయాత్రకు తరలిరావాలని పిలుపునిచ్చారు. రేవంత్‌ రెడ్డి జవహార్‌ నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపు డిమాండ్‌పై రాజకీయం చేయొద్దని ఈటల ప్రకటన చేశారు. డంపింగ్‌ యార్డులోని చెత్తను ఇంకో దగ్గర చెత్త వేయడానికి ప్రజలు ఒప్పుకోరన్నారు.

దీనికి జీరో పొల్యూషన్‌ టెక్నాలజీతో చెత్త డంపింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్‌గా పాదయాత్ర సాగనుంది. ఇక ఈ ప్రాంత మహిళలు, చిన్నారులు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, 30 కిలోమీటర్ల రేడియస్‌లో కాలుష్యం ఉందని పర్యావరణ వేత్తలు ఈటల దృష్టికి తీసుకొచ్చారు. చెత్తను ఎలక్ట్రిసిటీ జనరేషన్, బయోగ్యాస్, ఆర్గానిక్ మెన్యూర్ గా చేయవచ్చని, దీనికి కేంద్రం నుంచి నిధులు తెప్పించే బాధ్యత తీసుకుంటానని ఈటల తెలిపారు. పోలీసుల అనుమతులు రద్దు చేయడంతో పాదయాత్ర విషయంలో ఈటల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది  తీసుకుంటారనేది చూడాలి.

పోలీసులు అనుమతులు ఇవ్వకపోయినా..  నేటి నుంచి నాలుగు రోజుల పాటు మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర సాగనున్నట్టు చెప్పారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు తరలింపుపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు పాదయాత్రను మొదలుపెట్టినట్టు చెప్పారు. ఈరోజు ఏదులాబాద్ నుంచి మొదలై నాలుగో రోజు జవహర్ నగర్‌లో ముగియనుంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అయిన మల్కాజిగిరిలో డంపింగ్ యార్డు సమస్య వల్ల లక్షలాది మంది ప్రజలు రోడ్డున పడే దుస్థితి వచ్చిందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. 

విపరీతమైన చెత్త వల్ల ఆ ఏరియా నుంచి ముప్పై కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు కలుషితం అయ్యాయన్నారు. దీనిపై అనేక సార్లు ముఖ్యమంత్రిని  కలిసినా ఫలితం లేదన్నారు.  తన నియోజకవర్గ ప్రజల సమస్యను తానే స్వయంగా ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే  యాత్ర మొదలు పెట్టినట్లు చెప్పారు. ఈరోజు ఏదులాబాద్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాత్ర ప్రారంభించారు ఈటల రాజేందర్‌. మరి పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
BJP
Telugu News