• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విజయవాడ
  • /భీకరంగా అర్నాబ్ తుపాను.. కోతకు గురైన ఉప్పాడ ప్రాంతం..

భీకరంగా అర్నాబ్ తుపాను.. కోతకు గురైన ఉప్పాడ ప్రాంతం..

Arnab Cyclone: అర్నాబ్ తుపాను ఎఫెక్ట్‌ ప్రభావం ఏపీ తీర ప్రాంతాల్లో కనిపిస్తోంది. పలు చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఇక కాకినాడ జిల్లాలో అర్నాబ్ తుఫాన్ ప్రభావం భీకరంగా కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉప్పాడ సముద్రం అల్లకల్లోలంగా మారింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 27, 2026, 11:58 AM IST|Updated: Oct 27, 2026, 12:01 PM IST
joinshare
భీకరంగా అర్నాబ్ తుపాను.. కోతకు గురైన  ఉప్పాడ ప్రాంతం..
Image Credit: Arnab Cyclone (ZEE News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AIADMKలోకి ధనుష్.. రసవత్తరంగా తమిళ రాజకీయాలు..

AIADMKలోకి ధనుష్.. రసవత్తరంగా తమిళ రాజకీయాలు..

2

Pawan Kalyan: బీ-ఫామ్ లేకుంటే పోటీ నుంచి తప్పుకోండి.. కూటమి నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

3

అప్పు తెచ్చిన ముప్పు.. కష్టపడి, ఉన్నదానితో తృప్తిగా బ్రతకడమే నిజమైన ఆనందం అని చెబుతున్న నీతి కథ..!!

4

వంటగది నుంచి వ్యాపారం దాకా.. స్ట్రీట్ ఫుడ్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న బిహార్ మహిళలు..!!

5

తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..నవంబర్ నెలలో శ్రీవారి విశేష పర్వదినాలు! ప్లాన్ చేసుకునే ముందు చూడండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Arnab Cyclone  Updates: ప్రస్తుతం ఉప్పాడలో అలలు ఉధృతంగా ఎగిసి పడుతున్నాయి. అలల ధాటికి ఉప్పాడ బీచ్ రోడ్డుకు సమీపంగా ఉన్న గ్రామాల్లోకి పెద్ద పెద్ద రాళ్లు కొట్టుకు వస్తున్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తుఫాన్ కారణంగా బీచ్ రోడ్డును అధికారులు ఇప్పటికే మూసి వేశారు. నాలుగు రోజుల ముందు నుంచే అధికారులు తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. 

ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా సముద్ర నీటిమట్టం భారీ స్థాయిలో పెరిగి అలలు బీచ్ రోడ్డును తాకుతూ ఎగసి పడుతున్నాయి. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో పక్క ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఉప్పాడకు చేరుకున్నాయి. ఎప్పటికప్పుడు సముద్ర తీరప్రాంతాన్ని అధికారులు పర్యవేక్షించి మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటే  తీర ప్రాంతాన్ని ఆనుకుని నివసిస్తున్న మత్స్యకారులు పునరావాస కాలనీలకు వెళ్లాలని ఇప్పటికే గ్రామాల్లో ప్రజలకు తెలియజేశారు.

కోనసీమ జిల్లాలపై అర్నబ్ తుఫాన్ ప్రభావం ప్రారంభమైంది. తుఫాన్ కారణంగా కోనసీమలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. పలు చోట్ల ఇప్పటికే జల్లులు ప్రారంభమయ్యాయి. అల్లవరం నుంచి అంతర్వేది వరకు కోనసీమ జిల్లా తీరంలో సముద్రం అలలు ఎగిసి పడుతున్నాయి. సముద్ర తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. తీర ప్రాంత గ్రామాల్లో మైక్ ద్వారా పంచాయతీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోనసీమ జిల్లా సరిహద్దులోని యానాం వద్ద తుఫాన్ తీరం దాటే అవకాశం నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. అమలాపురంలో NDRF బృందం, కొత్తపేట లో SDRF బృందాన్ని ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. మరోవైపు తుఫాన్ హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు వణికిపోతున్నారు. మరో రెండు వారాల్లో ఖరీఫ్ వరి పంట కోతకు వస్తున్న నేపథ్యంలో అన్నదాతల్లో ఆందోళన కలుగుతోంది. చేతికి వచ్చిన వరి పంట ఏమవుతుందో అని రైతుల్లో ఆందోళన చెందుతున్నారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Weather Update
AP News
AP Weather