ఈటల పాదయాత్రకు బ్రేక్..? అనుమతులివ్వని పోలీసులు..
Telangana BJP MP Etala Rajender: జవహార్ నగర్ డంపింగ్ యార్డు తరలించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీ ఈటల రాజేంధర్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇవాళ ఉదయం ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు నుండి పాదయాత్రను చేపట్టాలనుకున్న ఈటలకు చుక్కెదురు అయింది. అనుమతులు లేవని పోలీసులు పాదయాత్రకు నో చెప్పారు.
Etala Rajender: డంపింగ్ యార్డును తరలించాలనే డిమాండ్‌తో స్థానికులను ఏకతాటిపైకి తీసుకువచ్చి, ఆందోళనను తీవ్రతరం చేయడమే ఈ పాదయాత్ర ఉద్దేశ్యమన్నారు. ఇప్పటికే మేధావులు, పర్యావరణవేత్తలు, బాధితులతో ఎంపీ ఈటల సమావేశం అయ్యారు. డంపింగ్ యార్డు నుంచి వచ్చే మిథేన్ గ్యాస్‌తో చుట్టు పక్కల అనేక మంది ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. స్థానికంగా మల్కాజ్‌గిరి ఎంపీగా ఈ డంపింగ్ యార్డ్ తరలింపు తన అత్యంత ప్రాధాన్యత అంశాల్లో ఒకటని పేర్కొన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఈటల పాదయాత్రను తలపెట్టారు. ఇంటి నుంచి ఒక్కరు పాదయాత్రకు తరలిరావాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి జవహార్ నగర్ డంపింగ్ యార్డు తరలింపు డిమాండ్‌పై రాజకీయం చేయొద్దని ఈటల ప్రకటన చేశారు. డంపింగ్ యార్డులోని చెత్తను ఇంకో దగ్గర చెత్త వేయడానికి ప్రజలు ఒప్పుకోరన్నారు.
దీనికి జీరో పొల్యూషన్ టెక్నాలజీతో చెత్త డంపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్‌గా పాదయాత్ర సాగనుంది. ఇక ఈ ప్రాంత మహిళలు, చిన్నారులు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, 30 కిలోమీటర్ల రేడియస్‌లో కాలుష్యం ఉందని పర్యావరణ వేత్తలు ఈటల దృష్టికి తీసుకొచ్చారు. చెత్తను ఎలక్ట్రిసిటీ జనరేషన్, బయోగ్యాస్, ఆర్గానిక్ మెన్యూర్ గా చేయవచ్చని, దీనికి కేంద్రం నుంచి నిధులు తెప్పించే బాధ్యత తీసుకుంటానని ఈటల తెలిపారు. పోలీసుల అనుమతులు రద్దు చేయడంతో పాదయాత్ర విషయంలో ఈటల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తీసుకుంటారనేది చూడాలి.
పోలీసులు అనుమతులు ఇవ్వకపోయినా.. నేటి నుంచి నాలుగు రోజుల పాటు మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర సాగనున్నట్టు చెప్పారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు తరలింపుపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు పాదయాత్రను మొదలుపెట్టినట్టు చెప్పారు. ఈరోజు ఏదులాబాద్ నుంచి మొదలై నాలుగో రోజు జవహర్ నగర్‌లో ముగియనుంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అయిన మల్కాజిగిరిలో డంపింగ్ యార్డు సమస్య వల్ల లక్షలాది మంది ప్రజలు రోడ్డున పడే దుస్థితి వచ్చిందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.
విపరీతమైన చెత్త వల్ల ఆ ఏరియా నుంచి ముప్పై కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు కలుషితం అయ్యాయన్నారు. దీనిపై అనేక సార్లు ముఖ్యమంత్రిని కలిసినా ఫలితం లేదన్నారు. తన నియోజకవర్గ ప్రజల సమస్యను తానే స్వయంగా ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే యాత్ర మొదలు పెట్టినట్లు చెప్పారు. ఈరోజు ఏదులాబాద్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాత్ర ప్రారంభించారు ఈటల రాజేందర్. మరి పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి.