• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /AIADMKలోకి ధనుష్.. రసవత్తరంగా తమిళ రాజకీయాలు..

AIADMKలోకి ధనుష్.. రసవత్తరంగా తమిళ రాజకీయాలు..

Dhanush Political Entry: ముల్లును ముల్లుతోనే తీయాలనేది సామెత. ఇపుడు తమిళనాడు సీఎం విజయ్ ను ఎదుర్కొవాలంటే ఆయనకు ధీటుగా ఇపుడు మరో నటుడు ధనుశ్ రంగంలోకి దిగబోతున్నాడు. ఇప్పటికే తన అభిమాన సంఘాలతో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విజయ్ సీఎం కాగా లేనిది తను రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. అందుకు AIADMK పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 27, 2026, 01:16 PM IST|Updated: Oct 27, 2026, 01:21 PM IST
joinshare
AIADMKలోకి ధనుష్.. రసవత్తరంగా తమిళ రాజకీయాలు..
Image Credit: Dhanush Joins AIADMK (ZEE News/Telugu)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఎవరొచ్చినా చూసుకుందాం..షర్ట్ మడతబెట్టా.. పులివెందులలో జగన్ మాస్ వార్నింగ్..!!

ఎవరొచ్చినా చూసుకుందాం..షర్ట్ మడతబెట్టా.. పులివెందులలో జగన్ మాస్ వార్నింగ్..!!

2

‘జైలర్ 2’తో రజినీకాంత్ ఆ ఫీట్ అందుకుంటాడా..!! తమిళ సినిమా పరువు తలైవా చేతుల్లోనే.

3

AIADMKలోకి ధనుష్.. రసవత్తరంగా తమిళ రాజకీయాలు..

4

Pawan Kalyan: బీ-ఫామ్ లేకుంటే పోటీ నుంచి తప్పుకోండి.. కూటమి నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

5

అప్పు తెచ్చిన ముప్పు.. కష్టపడి, ఉన్నదానితో తృప్తిగా బ్రతకడమే నిజమైన ఆనందం అని చెబుతున్న నీతి కథ..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dhanush AIADMK Party: గత ఎన్నికల ముందు తమిళనాడులోని రాజకీయ శూన్యత విజయ్‌కు బాగా కలిసొచ్చింది. ఆయన పార్టీ మెజారిటీకి చేరువలో వచ్చి ఆగింది. ఆ తర్వాత కొన్ని మిత్ర పక్షాల మద్ధతుతో సీఎం అయ్యారు. మరోవైపు డీఎంకే స్టాలిన్ వారసుడిగా ఉదయనిధి ఉన్నారు. ఇతను కూడా సినిమా హీరో. దీంతో తమిళనాడులో రాజకీయాల్లో పాగా వేయాలంటే హీరో అయితే సరిపోతుందనే ఉద్దేశ్యంతో ధనుశ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. అందుకు AIADMKను ఎంచుకున్నట్టు తెలుస్తుంది.

అన్నాడీఎంకే అంతర్గత పోరు.. 

ప్రస్తుతం అన్నాడీఎంకేలో అంతర్గత పోరు రోజురోజుకీ తారాస్థాయికి చేరింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం వర్గం తీవ్ర వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు ప్రతి చర్యగానే షణ్ముగం మద్దతుదారులు 100 మందిని ఈపీఎస్‌ పార్టీ నుంచి తొలగించినట్లు తెలిసింది. పార్టీలో నెలకొన్న ఈ అంతర్గత సమస్యల కారణంగా కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయిన అన్నాడీఎంకేకు ఇక భవిష్యత్‌ ఉందా? అనే ప్రశ్న ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే బలంగా వినిపిస్తోంది.

ధనుష్ ముందన్న ఆప్షన్..

2026 ఎన్నికల ఫలితాలతో రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ధనుష్‌ మదిలో బలపడింది. తన అభిమాన సంఘాన్ని సేవా సంఘంగా మార్చారు. అలాగే జెండాలో కూడా మార్పులు చేశారు. అయితే విజయ్‌ మాదిరి  ధనుష్‌కు లేడీస్‌లో యూత్‌లో పెద్దగా ఫాలోయింగ్‌ లేదు. దీనివల్ల ఆయన సొంతంగా ఓటు బ్యాంకు సృష్టించుకోవటం కష్టం అంటున్నారు రాజకీయ నిపుణులు. అభిమాన సంఘాల నెట్‌వర్క్‌ కూడా అంత బలంగా లేదు. గతంలో రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తానని చెప్పి వెనక్కు తగ్గటానికి కారణం కూడా.  తమిళనాడు అంతటా బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయలేక పోవడమే. అభిమాన సంఘాలను సేవా సంస్థలుగా మార్చినా తదుపరి ఎన్నికల వరకు దాన్ని బలంగా నడపటం, దానికి కావాల్సిన ఆర్థిక నేపథ్యం ధనుష్‌ దగ్గర లేదు. ఈ బలహీనతను అధిగమించేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం ఉన్న అన్నాడీఎంకేలో చేరి తన రాజకీయ భవిష్యత్‌కు పునాది వేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ధనుష్‌. అందుకే ఆ పార్టీలో చేరడానికి  మొగ్గుచూపుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

పార్టీలో ఈపీఎస్‌కు వ్యతిరేకంగా అసమ్మతి.. 

పార్టీని తదుపరి స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలేవీ ఈపీఎస్‌ వద్ద లేవని ఎస్పీ వేలుమణి వర్గం చెబుతోంది. అయితే ప్రముఖ సినీ నటుడు ధనుష్‌ను అన్నాడీఎంకేలోకి తీసుకురావటానికి ఈపీఎస్‌ పెద్ద ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రాథమిక చర్యలు కూడా పూర్తయినట్లు సమాచారం. ధనుష్‌కు కూడా పాలిటిక్స్ పై  ఆసక్తి ఉన్నట్లు తెలియడంతో ఈ ప్రక్రియ వేగవంతం అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పళనిసామి కుమారుడు మిథున్, నటుడు ధనుష్‌ మధ్య ఇప్పటికే మూడుసార్లు ప్రాథమిక చర్చలు జరిగినట్లు అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు వెల్లడించారు. ఇటీవల మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ మాట్లాడుతూ. ధనుష్‌ తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని అనడం గమనార్హం.


అన్నాడీఎంకే యువజన విభాగం అద్యక్షుడిగా ధనుశ్... 
అన్నాడీఎంకేలో ధనుష్‌కు జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ లేదా యువజన విభాగ కార్యదర్శి బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు కూడా సమాచారం. టీవీకేతో పోటీ పడేందుకు, యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు ధనుష్‌ను పళనిసామి అస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా భవిష్యత్‌లో తన కుమారుడు మిథున్‌ను రాజకీయాల్లోకి తీసుకురావటానికి కూడా ధనుష్‌ ఎంట్రీ మంచి నిర్ణయం అవుతుందని ఈపీఎస్‌ నమ్ముతున్నారు. సామాజికవర్గాల పరంగా కూడా ధనుష్‌కు ఉన్న మద్దతు అన్నాడీఎంకేకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ధనుష్‌ను అన్నాడీఎంకే కండు కప్పుకున్నా కప్పుకొవచ్చు.

ధనుశ్ పొలిటికల్ ఎంట్రీ వెనక బీజేపీ స్కెచ్.. 
ఇదిలా ఉంటే ధనుష్‌ను అన్నాడీఎంకేలోకి తీసుకువచ్చే పథకం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయ్‌ వర్సెస్‌ ధనుష్‌ అనే రాజకీయాలను సృష్టించి భవిష్యత్‌లో తమ వ్యూహాలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నేరుగా ధనుష్‌ను ముందుకు తీసుకురావటం కంటే అన్నాడీఎంకే ద్వారా తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రణాళిక చేస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ధనుశ్ పొలిటికల్ ఎంట్రీ.. చేవ చచ్చిన అన్నాడీఎంకేకు ఊపు తీసుకొస్తుందా అనేది చూడాలి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News
Trending News