• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /అప్పు తెచ్చిన ముప్పు.. కష్టపడి, ఉన్నదానితో తృప్తిగా బ్రతకడమే నిజమైన ఆనందం అని చెబుతున్న నీతి కథ..!!

అప్పు తెచ్చిన ముప్పు.. కష్టపడి, ఉన్నదానితో తృప్తిగా బ్రతకడమే నిజమైన ఆనందం అని చెబుతున్న నీతి కథ..!!

Moral Story: అనవసరమైన అప్పులు, అక్రమ మార్గాలు తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చినా చివరికి కోలుకోలేని ముప్పును, అవమానాన్ని తెచ్చిపెడతాయి. కష్టపడి, ఉన్నదానితో తృప్తిగా బ్రతకడమే నిజమైన నిశ్చింత, ఆనందం..

Written ByBhoomi
Published: Oct 27, 2026, 12:51 PM IST|Updated: Oct 27, 2026, 12:54 PM IST
joinshare
అప్పు తెచ్చిన ముప్పు.. కష్టపడి, ఉన్నదానితో తృప్తిగా బ్రతకడమే నిజమైన ఆనందం అని చెబుతున్న నీతి కథ..!!
Image Credit: Moral Story

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఎవరొచ్చినా చూసుకుందాం..షర్ట్ మడతబెట్టా.. పులివెందులలో జగన్ మాస్ వార్నింగ్..!!

ఎవరొచ్చినా చూసుకుందాం..షర్ట్ మడతబెట్టా.. పులివెందులలో జగన్ మాస్ వార్నింగ్..!!

2

Sekhar Kammula: గోదావరి సినిమాకు లాంటి మ్యాజిక్ శేఖర్ కమ్ములాకైనా సాధ్యమా?

3

‘జైలర్ 2’తో రజినీకాంత్ ఆ ఫీట్ అందుకుంటాడా..!! తమిళ సినిమా పరువు తలైవా చేతుల్లోనే.

4

AIADMKలోకి ధనుష్.. రసవత్తరంగా తమిళ రాజకీయాలు..

5

Pawan Kalyan: బీ-ఫామ్ లేకుంటే పోటీ నుంచి తప్పుకోండి.. కూటమి నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Moral Story: రామాపురం అనే  గ్రామంలో వెంకటేష్, సత్యం అనే ఇద్దరు ప్రాణస్నేహితులు నివసించేవారు. ఇద్దరి వృత్తి వ్యవసాయమే. సత్యానికి పది ఎకరాల సారవంతమైన భూమి ఉండగా, వెంకటేష్‌కు ఐదు ఎకరాల మెట్ట  పొలం మాత్రమే ఉండేది. ఆర్థికంగా కూడా వెంకటేష్ కంటే సత్యం కుటుంబమే చాలా కలసివచ్చిన స్థితిలో ఉండేది.

అయితే పట్టణం నుండి వడ్డీ వ్యాపారులు గ్రామానికి వచ్చి రైతులకు, ఇతరులకు ధారాళంగా అప్పులు ఇచ్చేవారు. కొందరికైతే అడగకుండానే మొహమాటపెట్టి మరీ చేతిలో డబ్బులు పెట్టేవారు. కొందరి దగ్గర పొలాలు, ఇళ్ళు తాకట్టు పెట్టుకుంటే..  మరికొందరి వద్ద కేవలం తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుని అప్పులు ఇచ్చేవారు. వడ్డీ రేట్లు భరించలేనంత ఎక్కువగా ఉన్నప్పటికీ, సులభంగా డబ్బులు చేతికి వస్తుండటంతో గ్రామస్థులంతా ఎలాంటి ఆలోచన లేకుండా రుణాలు తీసుకునేవారు.

నిజానికి సత్యానికి అప్పులు చేసి వ్యవసాయం చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అయినా తన సొంత సొమ్మును తాకకుండా, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి పొలం సాగు చేసేవాడు. పంట చేతికి వచ్చాక దాన్ని ఎక్కువ లాభం కోసం దొంగచాటుగా విక్రయించి బాగా సొమ్ము చేసుకునేవాడు.

కానీ వెంకటేష్‌కు మాత్రం అప్పులు చేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. తన వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి... వీలైనంత మేరకే పొలాన్ని సాగు చేసుకునేవాడు. అత్యవసరమైతే తన భార్య వరలక్ష్మి మెడలోని బంగారాన్ని కుదువ పెట్టేవాడు. మళ్ళీ పంట అమ్మిన తర్వాత ఆ నగను విడిపించి ఇచ్చేవాడు. ఉన్నది ఐదేకరాలైనా, చేతిలో సొమ్ము లేకపోవడం వల్ల సగం పొలాన్ని మాత్రమే సాగు చేయగలిగేవాడు. దాంతో కుటుంబం గడవడం చాలా కష్టంగా మారేది.

స్నేహితుడి ఇబ్బంది చూసి సత్యం తరచూ వెంకటేష్‌తో, "ఒరేయ్ వెంకటేష్ ఊళ్ళో వడ్డీ వ్యాపారులు ఉండగా ఎందుకంత అవస్థపడతావు ? అప్పు తెచ్చి ఐదేకరాల పొలంలో పంట వేస్తే హాయిగా లాభాలు వస్తాయి కదా... అని ఒత్తిడి చేసేవాడు. కానీ వెంకటేష్ మాత్రం "నాకొద్దు రా నాయనా" అని కచ్చితంగా చెప్పేసేవాడు.

వెంకటేష్ భార్య వరలక్ష్మికి కూడా భర్త వైఖరి నచ్చేది కాదు. "చాలీచాలని సొమ్ముతో ఈ అరకొర వ్యవసాయం ఏంటి ? ఊళ్ళో అందరూ అప్పులు చేసి పచ్చగా ఉన్నారు. ఆ సత్యం గారిని చూసైనా నేర్చుకోవచ్చు కదా" అని నిత్యం పోరు పెట్టేది.

దానికి వెంకటేష్ శాంతంగా, "అప్పు, తప్పు, నిప్పు — ఈ మూడూ మనిషిని కోలుకోలేని దెబ్బతీస్తాయి. ఏదైనా కారణంతో అప్పు తీర్చకపోతే అది కొండంత భారమై కూర్చుంటుంది. తెలియక నిప్పును ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది. అలాగే ఒకసారి తప్పు చేస్తే జీవితాంతం మనశ్శాంతి ఉండదు. అందుకే వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. అప్పు చేసి పప్పుకూడు తినడం కంటే, చెమటోడ్చి కష్టపడి గంజి తాగినా ప్రశాంతంగా నిద్రపడుతుంది" అని నచ్చజెప్పేవాడు. కానీ వరలక్ష్మికి భర్త మాటలు పిచ్చిగా అనిపించేవి.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా వరసగా రెండేళ్ళ పాటు తీవ్రమైన అనావృష్టి వచ్చి పంటలు ఎండిపోయాయి. రైతులంతా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పెద్ద రైతులే తట్టుకోలేకపోయేసరికి సన్నకారు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఊళ్ళో తిండిగింజలకు విపరీతమైన కరువు ఏర్పడింది.

అప్పుడు సత్యం వచ్చి, "వెంకటేష్ నేను వడ్డీ వ్యాపారులతో చెప్పి నీకు అప్పు ఇప్పిస్తాను, మళ్ళీ విత్తనాలు కొని సాగు ప్రారంభించు" అని ఉచిత సలహా ఇచ్చాడు. వరలక్ష్మి కూడా అదే మాట అంది. కానీ వెంకటేష్ మాత్రం పట్టుబట్టి, "అవసరమైతే కూలి పనికైనా వెళ్తాను కానీ, అప్పు మాత్రం చేయను" అని తెగేసి చెప్పాడు. దాంతో భర్తపై కోపంతో వరలక్ష్మి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది.

కొద్దిరోజులకే అనుకోకుండా ప్రభుత్వ అధికారులు సత్యం ఇంటిపై దాడులు చేశారు. ఎక్కువ ధరకు అమ్మడానికి అని సత్యం దొంగచాటుగా దాచి ఉంచిన ధాన్యం, ఇతర సరుకులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా భారీ జరిమానా విధించారు. దాంతో ఉన్న సొమ్మంతా ఊడ్చిపెట్టి ఆ జరిమానా చెల్లించి, జైలు శిక్ష నుండి తప్పించుకున్నాడు సత్యం.

అంతటితో ఆగలేదు... ఈలోగా వడ్డీ వ్యాపారులు గ్రామం మీద పడ్డారు. రెండేళ్ళుగా వడ్డీలు, అసలు తీర్చలేదనే నెపంతో రైతుల భూములను, ఇళ్ళను జప్తు చేయడం మొదలుపెట్టారు. అప్పటివరకు బ్రతిమాలి అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు, ఇప్పుడు సత్యానికి బాకీ తీర్చడానికి చిన్న గడువు కూడా ఇవ్వలేదు. అతడి పది ఎకరాల పొలాన్ని, ఆఖరికి నివాసముంటున్న ఇల్లును కూడా జప్తు చేసుకున్నారు.

సత్యం వీధిన పడ్డాడనే వార్త తెలిసిన వెంకటేష్ ఎంతగానో కలత చెందాడు. వెంటనే మిత్రుడిని పరామర్శించడానికి వెళ్ళాడు. "సత్యం నేను మొదటినుంచీ చెప్తూనే ఉన్నాను. అవసరం ఉన్నా లేకపోయినా అప్పులు చేస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. అప్పుకి తోడు, అక్రమంగా ధాన్యం దాచి తప్పు కూడా చేశావు. నిప్పు కాలకముందే జాగ్రత్త పడాలి కానీ, చెయ్యి కాలేక బాధపడితే ఏం లాభం?" అని సన్నగా మందలించాడు. స్నేహితుడి మాటల్లోని నిజాన్ని గ్రహించిన సత్యం పశ్చాత్తాపంతో తలవంచుకున్నాడు.

వెంకటేష్ జాలిపడి, "జరిగిన దానికి బాధపడకు మిత్రమా నువ్వు మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు నా భార్య నగలు కుదువపెట్టి, నా పొలంలో ఇద్దరం కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేద్దాం. వచ్చే దిగుబడిని సగానికి పంచుకుందాం" అని కొండంత అభయమిచ్చాడు. స్నేహితుడి ఉదారత్వానికి సత్యం కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. భావోద్వేగంతో వెంకటేష్‌ను కౌగిలించుకున్నాడు.

అక్కడ గ్రామంలో జరిగిన ఈ అనూహ్య పరిణామాలన్నీ విన్న వరలక్ష్మి నిర్ఘాంతపోయింది. తన భర్త ఎంత దూరదృష్టి గలవాడో, ఎంతటి ఉత్తముడో అర్థమై వెంటనే ఇంటికి తిరిగి వచ్చింది. తన అజ్ఞానాన్ని క్షమించమని కోరిన భార్యను వెంకటేష్ అనురాగంతో క్షమించి చేరదీశాడు. అనవసరమైన అప్పులు, అక్రమ మార్గాలు తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చినా చివరికి కోలుకోలేని ముప్పును, అవమానాన్ని తెచ్చిపెడతాయి. కష్టపడి, ఉన్నదానితో తృప్తిగా బ్రతకడమే నిజమైన నిశ్చింత, ఆనందం..

Also Read: 

సోమరిపోతు బద్ధకం వదిలించిన గుప్త నిధి రహస్యం.. కష్టాన్ని మించిన నిధి లేదని చెబుతున్న నీతి కథ..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Moral Stories
Motivational Stories
Telugu News