SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Govt Ex Gratia: గణేశ్‌ నిమజ్జనంలో మృతిచెందిన విద్యార్థులకు నష్ట పరిహారం ప్రకటన

Telangana Govt Announces Ex Gratia Rs 2 Lakhs To Who Dead In Ganesh Immersion: గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో దురదృష్టవశాత్తు చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా.. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 17, 2026, 12:10 AM IST | Updated: Sep 17, 2026, 12:13 AM IST
Image Credit: Ganesh Immersion Death
Join

Ganesh Immersion Death: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణేశుడిని చెరువులో నిమజ్జనం చేస్తూ దురదృష్టవశాత్తు చెరువులోకి పడిపోయిన ఆరుగురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. తీవ్ర విషాదం నింపిన ఈ సంఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూనే.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా చెరువులోకి దిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. పండుగ వేళ ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ప్రకటించారు.

విద్యార్థులు మృతిచెందారనే సంఘటన వార్త తెలుసుకున్న వెంటనే సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో మంత్రి వివేక్ వెంకటస్వామి ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, చేపట్టిన సహాయక చర్యలు, బాధిత కుటుంబాలకు అందుతున్న సహాయం తదితర అంశాలపై కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

మృతి చెందిన ఆరుగురు విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల వద్ద నిమజ్జన కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ముందస్తు భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES