SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అర్హులైన సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలి: TSCPSEU రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్

Telangana Graduate MLC Elections: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన పట్టభద్రులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం (TSCPSEU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Written By Bhoomi
Published: Oct 27, 2026, 03:25 PM IST | Updated: Oct 27, 2026, 03:44 PM IST
Image Credit: cps
Join

Telangana Graduate MLC Elections: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన పట్టభద్రులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం (TSCPSEU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

సీపీఎస్ (CPS) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించడంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను చట్టసభల్లో గళమెత్తి వినిపించేందుకు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల హక్కులను పరిరక్షించడం.. వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని కిరణ్ కుమార్  వెల్లడించారు.

ఎన్నికల సంఘం  నిర్దేశించిన నిబంధనలు.. గడువు తేదీల ప్రకారం అర్హులైన ప్రతి పట్టభద్ర ఉద్యోగి, ఉపాధ్యాయుడు తమ ఓటును నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. కేవలం తమ ఓటు నమోదు చేసుకోవడమే కాకుండా.. తమ సహచర పట్టభద్రులకు కూడా ఓటరు నమోదు ప్రాముఖ్యతను వివరించి, ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో అందరూ చురుగ్గా భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

ఈ ఓటరు నమోదు ఎందుకంత ముఖ్యం?
సీపీఎస్ రద్దు - పాత పెన్షన్ పునరుద్ధరణ: దశాబ్దాలుగా మనం పోరాడుతున్న సీపీఎస్  రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ డిమాండ్లను శాసనమండలి (చట్టసభల) వేదికగా బలంగా వినిపించాల్సిన అవసరం ఉంది.

మన సమస్యలపై పోరాడే నాయకత్వం: ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను నిలదీయడానికి, మన హక్కులను రక్షించడానికి, మన ఆకాంక్షలను ప్రతిబింబించే సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అత్యంత కీలకమైన వేదిక.

ఓటు హక్కు అనేది మన ప్రజాస్వామ్య బలం. అర్హులైన ప్రతి సీపీఎస్ ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఓటరుగా నమోదు చేసుకొని, తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES