SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Telangana RTC: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల బీభత్సం.. 20 మందికి తీవ్ర గాయాలు

Telangana RTC Bus Accidents In Hyderabad And Hanamakonda: తెలంగాణలో ఆర్టీసీ బస్సులు బీభత్సం సృష్టించాయి. ఒకే రోజు రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. అయితే ఈ ప్రమాదాల్లో అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 15, 2026, 12:48 PM IST | Updated: Sep 15, 2026, 01:16 PM IST
Image Credit: Telangana RTC Bus Accident
Join

20 RTC Passengers Injured: వినాయక చవితి తర్వాతి రోజు తెలంగాణలో ఆర్టీసీ బస్సులు బీభత్సం సృష్టించాయి. పండుగ సెలవుల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రయాణికులకు సేవలు అందించిన ఆర్టీసీ బస్సులు పండుగ తర్వాతి రోజు ప్రమాదాలకు గురయ్యాయి. ఒకే రోజు రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. అయితే ఈ ప్రమాదాలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌, హన్మకొండలో జరిగిన సంఘటనల వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో టిప్పర్‌ లారీ బీభత్సం సృష్టించగా.. ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చేరారు. నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుంట్లూరు రాజీవ్‌ గృహకల్ప వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్‌ లారీ ఢీకొనడంతో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రాజీవ్‌ గృహకల్ప నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని వస్తున్న హయత్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెయిన్‌ రోడ్డు దాటుతున్న సమయంలో నాగోల్‌ వైపు నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్‌ లారీ బస్సును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌ల ద్వారా క్షతగాత్రులను వనస్థలిపురం, సికింద్రాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న నాగోల్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బస్సుపై కూలిన చెట్టు
హన్మకొండలో ఆర్టీసీ బస్సుపై భారీ చెట్టు కూలడంతో తీవ్రంగా దెబ్బతినగా ప్రయాణికులు ఎవరికీ కూడా ఎలాంటి గాయాలు కకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఆర్టీసీ బస్సు వెళ్తుండగా భారీ చెట్టు అకస్మాత్తుగా కూలింది. అయితే బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చెట్టు కూలడంతో రెండు బైకులు, మూడు ఆటోలు దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES