SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Telangana RTC: గణేశ్‌ నిమజ్జనం కోసం హైదరాబాద్‌లో ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

Telangana RTC Special Buses For Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో కోలాహలంగా గణేశ్‌ మహా నిమజ్జనం కొనసాగుతోంది. అయితే నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 25, 2026, 12:21 PM IST | Updated: Sep 25, 2026, 12:27 PM IST
Image Credit: Telangana RTC Special Buses
Join

Hyderabad Ganesh Nimajjanam: గణేష్ నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్‌లో సందడి నెలకొంది. గణేశ్‌ మహా శోభయాత్ర కోసం పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ మళ్లింపులు ఏర్పాటుచేయడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు కష్టతరంగా మారింది. ఈ సమయంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నిమజ్జనంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. నగరంలో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వినాయక మహా శోభయాత్ర, నిమజ్జనం సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం వరకు నిమజ్జనం కొనసాగినా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేసింది. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెలిపారు. 24 గంటల పాటు హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసినట్లు ప్రకటించారు. నిమజ్జనం ప్రధానంగా సాగే హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ నగరంలోని వివిధ రూట్లకు నిరంతరాయంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసినట్లు వివరించారు.

​ట్రాఫిక్ డైవర్షన్ల కోసం పోలీస్ కంట్రోల్ రూమ్‌లు, 44 కీలక ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు, కంట్రోలర్లను నియమించారు. ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించేందుకు జోనల్ ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. ​అత్యవసర సహాయం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇందిరా పార్క్, వీవీ విగ్రహం వద్ద ఆర్టీసీ రిలీఫ్ వాహనాలు ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

ఆర్టీసీ ప్రత్యేక క్యాంపులు
ఖైరతాబాద్, లక్డీకాపూల్, కోటి, బషీర్‌బాగ్, ఇందిరా పార్క్, ఆలిండియా రేడియో

మరమ్మతుల కోసం
​అవాంతరాలు లేకుండా బస్సులకు అత్యవసర మరమ్మతులు చేయడానికి పోలీసు స్టేషన్ల వద్ద 113 మంది డ్రైవర్లు, 87 మంది మెకానిక్‌లు అందుబాటులో ఉంచారు.

​పోలీస్ మార్గదర్శకాల ప్రకారం.. ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు సిటీ, అంతర్‌రాష్ట్ర బస్సుల మార్గాలను మళ్లించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES