• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /తెలంగాణ సచివాలయానికి వాటర్‌ షాక్‌.. బిల్లుకు పేరుకు పేవడంతో నీళ్లు కట్..

తెలంగాణ సచివాలయానికి వాటర్‌ షాక్‌.. బిల్లుకు పేరుకు పేవడంతో నీళ్లు కట్..

Telangana Secretariat: అది రాష్ట్రానికి దిశా నిర్దేశం చేసే సచివాలయం. సాక్షాత్తు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొలువు దీరి ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రభుత్వ ప్రధాన కార్యాలయం. అలాంటి చోట ఏళ్లకు ఏళ్లకు నీటి సరఫరాకు సంబంధించిన బిల్లులు పేరుకుపోవడంతో నీటి క్యాన్ల సరఫరాను బంద్ చేయడం కలకలం రేపుతుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 05, 2026, 04:10 PM IST|Updated: Oct 05, 2026, 04:12 PM IST
joinshare
తెలంగాణ సచివాలయానికి వాటర్‌ షాక్‌.. బిల్లుకు పేరుకు పేవడంతో నీళ్లు కట్..
Image Credit: Secretariat (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Fauzi Movie Leaked: ప్రభాస్ 'ఫౌజీ' సినిమా నుంచి మరో లీక్? 1.09 నిమిషాల వీడియో బయటకు..వీడియో తేడాగా ఉంది!

Fauzi Movie Leaked: ప్రభాస్ 'ఫౌజీ' సినిమా నుంచి మరో లీక్? 1.09 నిమిషాల వీడియో బయటకు..వీడియో తేడాగా ఉంది!

2

Adarsha Kutumbam Release Postpone: మూడు రోజుల్లో మూవీ రిలీజ్..అంతలోనే వెంకటేష్ సినిమా వాయిదా..ఎందుకు?

3

కాంతి వెలుగుల్లో మెదడు మర్మం.. ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్..!!

4

Pithapuram Temples: టెంపుల్ టూరిజంగా ‘పీఠికాపురం’.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్

5

బరువు తగ్గాలనుకుంటున్నారా?.. సాయంత్రం ఆకలేస్తే తినే 10 'జీరో గిల్ట్' హెల్తీ స్నాక్స్ ఇవే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Secretariat Water Bandh: తాగునీ టి సమస్య చివరికి తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి చేరింది. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు వాటర్ క్యాన్ల సరఫరా బంద్ చేశారని తెలుస్తోంది. ఒక్కో డిపార్ట్‌మెంట్ నుంచి లక్షల్లో బకాయిలు ఉండటంతో పాత బకాయిలు క్లియర్ చేస్తేనే క్యాన్లు పంపిస్తామని  తేల్చిచెప్పినట్లు సమాచారం. సెక్రటేరియట్ కు నీటిని సరఫరా చేసే నాలుగు ప్రైవేటు ఏజెన్సీలకు సుమారు రూ.80 లక్షల బకాయిలు ఉన్నట్టు సమాచారం.

దీంతో ఉద్యోగులు, సిబ్బంది ఎవరి బాటిల్స్ వారే ఇంటి నుంచి తెచ్చుకోవాలని పేషీల అధికారులు ఆదేశించారని అంతర్గత టాక్‌ వినిపిస్తోంది. మొత్తంగా రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సెక్రటేరియట్ అందులో పనిచేసే ఉద్యోగులకు నీటిని అందించాల్సిన బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేసే వారికి.. పనుల నిమిత్తం సెక్రటేరియట్‌కు వచ్చే వారికి నీరు అందుబాటులో లేకపోతే తీవ్ర ఇక్కట్లను ఎదర్కొవాల్సి ఉంటుంది.

మొత్తంగా ఈ బకాయిలు బీఆర్ఎస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఉందా..? లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నీటి క్యాన్లకు సంబంధించిన బకాయిలను విడుదల చేయడం లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా ప్రజలకు జవాబుదారీగా మిగతా వారికీ ఆదర్శంగా ఉండాల్సిన సెక్రటేరియట్‌లో నీటి బిల్లులు చెల్లించకపోవడానికి కారణాలేంటి అనే ప్రశ్న ఉత్పన్న మవుతుంది. సెక్రటేరియట్‌లో ఏ శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్ని ఆర్ధిక శాఖకు రావాల్సిందే. ఆ శాఖ క్లియరన్స్ ఇస్తేనే బిల్లులన్ని  క్లియర్ అవుతాయి. మొత్తంగా సెక్రటేరియట్ వాటర్ క్రైసిస్‌కు ఆర్ధిక శాఖ బాధ్యత వహిస్తుందా.. ? ఏ పేషీకి సంబంధించినది ఆ  పేషీ వాళ్లు బాధ్యత వహిస్తారా అనేదా చూడాలి. 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Trending News
Revanth Reddy