తెలంగాణ సచివాలయానికి వాటర్ షాక్.. బిల్లుకు పేరుకు పేవడంతో నీళ్లు కట్..
Telangana Secretariat: అది రాష్ట్రానికి దిశా నిర్దేశం చేసే సచివాలయం. సాక్షాత్తు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొలువు దీరి ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రభుత్వ ప్రధాన కార్యాలయం. అలాంటి చోట ఏళ్లకు ఏళ్లకు నీటి సరఫరాకు సంబంధించిన బిల్లులు పేరుకుపోవడంతో నీటి క్యాన్ల సరఫరాను బంద్ చేయడం కలకలం రేపుతుంది.
Secretariat Water Bandh: తాగునీ టి సమస్య చివరికి తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి చేరింది. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు వాటర్ క్యాన్ల సరఫరా బంద్ చేశారని తెలుస్తోంది. ఒక్కో డిపార్ట్‌మెంట్ నుంచి లక్షల్లో బకాయిలు ఉండటంతో పాత బకాయిలు క్లియర్ చేస్తేనే క్యాన్లు పంపిస్తామని తేల్చిచెప్పినట్లు సమాచారం. సెక్రటేరియట్ కు నీటిని సరఫరా చేసే నాలుగు ప్రైవేటు ఏజెన్సీలకు సుమారు రూ.80 లక్షల బకాయిలు ఉన్నట్టు సమాచారం.
దీంతో ఉద్యోగులు, సిబ్బంది ఎవరి బాటిల్స్ వారే ఇంటి నుంచి తెచ్చుకోవాలని పేషీల అధికారులు ఆదేశించారని అంతర్గత టాక్ వినిపిస్తోంది. మొత్తంగా రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సెక్రటేరియట్ అందులో పనిచేసే ఉద్యోగులకు నీటిని అందించాల్సిన బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేసే వారికి.. పనుల నిమిత్తం సెక్రటేరియట్‌కు వచ్చే వారికి నీరు అందుబాటులో లేకపోతే తీవ్ర ఇక్కట్లను ఎదర్కొవాల్సి ఉంటుంది.
మొత్తంగా ఈ బకాయిలు బీఆర్ఎస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఉందా..? లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నీటి క్యాన్లకు సంబంధించిన బకాయిలను విడుదల చేయడం లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా ప్రజలకు జవాబుదారీగా మిగతా వారికీ ఆదర్శంగా ఉండాల్సిన సెక్రటేరియట్‌లో నీటి బిల్లులు చెల్లించకపోవడానికి కారణాలేంటి అనే ప్రశ్న ఉత్పన్న మవుతుంది. సెక్రటేరియట్‌లో ఏ శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్ని ఆర్ధిక శాఖకు రావాల్సిందే. ఆ శాఖ క్లియరన్స్ ఇస్తేనే బిల్లులన్ని క్లియర్ అవుతాయి. మొత్తంగా సెక్రటేరియట్ వాటర్ క్రైసిస్‌కు ఆర్ధిక శాఖ బాధ్యత వహిస్తుందా.. ? ఏ పేషీకి సంబంధించినది ఆ పేషీ వాళ్లు బాధ్యత వహిస్తారా అనేదా చూడాలి.