Amit Shah: ముఖ్యంగా కాంగ్రెస్, కాక్రోచ్ పార్టీలు చేస్తోన్న ఓట్ చోరీ అంటూ దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నారని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా క్రిస్మస్ పండగ సందర్భంగా పది రోజులు పాటు తన యాత్రను వాయిదా వేసుకున్నారు. తన యాత్ర వల్ల క్రిష్టియన్ సోదరులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో తన యాత్రను వాయిదా వేసుకున్నారు. అయితే ఢిల్లీలో మాత్రం అక్కడ వ్యాపారులు దీపావళి వ్యాపారం దెబ్బ తింటుంది మీ ధర్నాను 10 రోజుల పాటు వాయిదా వేసుకోమని నెత్తి నోరు బాదుకున్నా.. పెడచెవిన పెట్టిన విషయాన్ని బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలకు అసలు హిందు పండగలంటే అసలు గౌరవం,ప్రేమ లేవని చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు.
బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు పాదయాత్ర..
మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటీ చోరీ పేరుతో దొంగ నాటకం ఆడుతూ దేశంలో అరాచకవాదాన్ని సృష్టిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో అమిత్ షా పాద యాత్ర మొదలై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు జీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ తెలిపారు. పాదయాత్ర మార్గాన్ని, ఏర్పాట్లను రాంచందర్‌రావు, కిషన్‌రెడ్డి పరిశీలించారు.
SIR ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా అమిత్ షా ర్యాలి: ఈటల..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కాంగ్రెస్ విచిత్రమైన నాటకమాడుతోందన్నారు. భారతజాతి ఆత్మగౌరవాన్ని, కీర్తిని విదేశాల్లో పలచన చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలపైకాంగ్రెస్ దాడులు చేస్తోందని ఆరోపించారు. ఆదివారం జీడిమెట్లలోని పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సర్ ప్రక్రియ బీజేపీ మొదలుపెట్టింది కాదని, ఇప్పటివరకు 13సార్లు సర్ జరిగిందన్నారు. రాహుల్ గాంధీకి నాయకత్వం వహించే సత్తా లేదని, విదేశాల ఫండింగ్‌తో మీడియాను, సోషల్ మీడియాను మేనేజ్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని విచ్ఛినం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.