• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తుపాను ప్రభావంతో తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు..

తుపాను ప్రభావంతో తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు..

Due To Murasu Toofan Effect: బంగాళాఖాతంలో అర్నాబ్ తుపాను తర్వాత మరో తుపాను ఏర్పడింది. దీనికి మురాసు అనే నామకరణం చేశారు. దీని ప్రభావం ఏపీతో పాటు తెలంగాణపైనా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 02, 2026, 08:37 AM IST|Updated: Nov 02, 2026, 08:43 AM IST
joinshare
తుపాను ప్రభావంతో తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు..
Image Credit: toofan effect on Telangana (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కార్తీక మాసం ప్రాముఖ్యత.. భక్తులు  పాటించాల్సిన నియమాలు..

కార్తీక మాసం ప్రాముఖ్యత.. భక్తులు పాటించాల్సిన నియమాలు..

2

తుపాను ప్రభావంతో తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు..

3

APకి రెడ్ అలర్ట్.. దూసుకొస్తున్న తీవ్ర తుపాను.. పక్క రాష్ట్రాల సాయం కోరిన బాబు..

4

నేడు భాగ్యనగరానికి కేంద్ర హోం మంత్రి.. కాంగ్రెస్, కాక్రోచ్‌లకు చెక్ పెట్టేలా అమిత్ షా మహా పాదయాత్ర..

5

దర్శకులకు బాలయ్య బంపర్ ఆఫర్.. ఇది కదా కావాల్సింది.. !!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Murasu Effect on Telangana: మురాసు తుపాను ఎఫెక్ట్ ఏపీలోని కోస్తాంధ్రతో పాటు తెలంగాణ పలు జిల్లాలపై పెను ప్రభావం చూపుతోంది. ఇది  చెన్నైకి సుమారు 630 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండంగా మారి తుపానుగా బలపడింది. ఈ రోజు తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు,  రేపు  ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని  ఐఎండీ సూచించింది. మురాసు ఎఫెక్ట్  తెలంగాణలో పలు జిల్లాలకు ఉంది. దీంతో ఐఎండీ పలు జిల్లాలకు  ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

మంగళవారం తెలంగాణలో అత్యంతభారీ వర్ష సూచన..
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,  వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు  జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

రాబోయే 48 గంటల్లో ఓ మోస్తరు వర్షపాతం..

రేపు తుపాను తీరం దాటనుంది. దీంతో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం,  మహబూబాబాద్ సూర్యాపేట, జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  బుధ, గురువారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయని తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో వచ్చే 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడనున్నట్లు సూచించింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Weather
Rain News
Weather Update
Telangana News