• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. దుకాణంలో ఉన్న మహిళపై కత్తితో దాడి.. అసలేం జరిగిందంటే..?

Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. దుకాణంలో ఉన్న మహిళపై కత్తితో దాడి.. అసలేం జరిగిందంటే..?

Woman murder in Hyderabad: దబీర్‌పురా ప్రాంతానికి చెందిన తహేరా బాను అజంపురాలోని సైఫా మసీదు సమీపంలో ఉన్న మాన్హా హోల్‌సేల్ స్టోర్‌లో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి ఆమెతో వాగ్వాదంకు దిగి కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో కుప్పకూలీంది.

Written ByInamdar Paresh
Published: Oct 10, 2026, 09:56 AM IST|Updated: Oct 10, 2026, 10:02 AM IST
joinshare
Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. దుకాణంలో ఉన్న మహిళపై కత్తితో దాడి.. అసలేం జరిగిందంటే..?
Image Credit: azapmpura Hyderabad

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో CJP అధినేత అభిజిత్ దీప్కే అరెస్ట్..

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో CJP అధినేత అభిజిత్ దీప్కే అరెస్ట్..

2

Donald Trump: నార్వే దేశానికే ఇది సిగ్గుచేటు.. నోబెల్ శాంతి బహుమతిరాకపోవడంపై ఆక్రోశం వెళ్ల గక్కిన డొనాల్డ్ ట్రంప్..

3

రాహువు సంచారంతో అదృష్టం మారుతుందా.. కన్య, మేషం, తులా రాశుల వారికి ఎలాంటి ఫలితాలు?

4

ప్రధాని మోడీపై CJP అధినేత అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..

5

ఢిల్లీ అష్ట దిగ్భంధం.. ధర్నాకు నో పర్మిషన్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Woman found murder after argument in azampura Hyderabad: తెలంగాణలో ఇటీవల తరచుగా హత్యలు,  దోపిడిలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ముఖ్యంగా  హైదరాబాద్ లో ఇటీవల శాంతి భద్రత పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిందా అన్న అనుమానం కల్గుతుంది. ఈ క్రమంలో  తరచుగా పట్టపగలే హత్యలు, దోపిడిల ఘటనలు వార్తలలో  ఉంటున్నాయి. ఇప్పటికే అపోసిషన్ పార్టీలు తరచుగా సీఎం రేవంత్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో అజంపురాలో కత్తిపోట్ల ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

హైదరాబాద్‌లోని అజంపురా ప్రాంతంలో తహేరా బాను (36) అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. ఒక వ్యక్తి దుకాణంకు వచ్చి ఆమెతో వాగ్వాదంకు దిగాడు.  దబీర్‌పురా ప్రాంతానికి చెందిన తహేరా బాను అజంపురాలోని సైఫా మసీదు సమీపంలో ఉన్న మాన్హా హోల్‌సేల్ స్టోర్‌లో పనిచేస్తోంది. ఈ క్రమంలో దుకాణంకు వచ్చిన వ్యక్తి ఆమెతో వాగ్వాదంకు దిగాడు. 

అది కాస్త తారాస్థాయికి చేరడంతో అతను ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. ఆతర్వాత హత్యకు పాల్పడిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. గాయపడ్డ మహిళను సిబ్బంది ఆమెను హుటా హుటీన కేర్ ఆస్పత్రికి తరలించారు.  దీంతో సదరు మహిళ తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ మరణించింది. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం వైద్యులు ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. 

ఈ ఘటనపై చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అసలు హత్యకు దారితీసిన కారణాలు, దాడి వెనుక ఉద్దేశం, నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Crime News
Telangana News