• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఢిల్లీ అష్ట దిగ్భంధం.. ధర్నాకు నో పర్మిషన్..

ఢిల్లీ అష్ట దిగ్భంధం.. ధర్నాకు నో పర్మిషన్..

CJP Protest Delhi High Alert: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన SIR కు వ్యతిరేకంగా మొదలైన కార్చిచ్చు మరింత రగులుతోంది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌ సహా సర్‌ ప్రక్రియను రద్దు చేయాలంటూ కాక్రోచ్‌ జనతా పార్టీ ఇవాళ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని CJP కోరుతోంది. నీట్‌ పేపర్‌ లీక్‌ విషయంలో సీజేపీ ఆందోళన సందర్భంగా ఎదురైన అనుభవంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చారు, జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని తేల్చిచెప్పారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 10, 2026, 09:56 AM IST|Updated: Oct 10, 2026, 09:59 AM IST
joinshare
ఢిల్లీ అష్ట దిగ్భంధం.. ధర్నాకు నో పర్మిషన్..
Image Credit: Delhi Dharna (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో CJP అధినేత అభిజిత్ దీప్కే అరెస్ట్..

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో CJP అధినేత అభిజిత్ దీప్కే అరెస్ట్..

2

Donald Trump: నార్వే దేశానికే ఇది సిగ్గుచేటు.. నోబెల్ శాంతి బహుమతిరాకపోవడంపై ఆక్రోశం వెళ్ల గక్కిన డొనాల్డ్ ట్రంప్..

3

రాహువు సంచారంతో అదృష్టం మారుతుందా.. కన్య, మేషం, తులా రాశుల వారికి ఎలాంటి ఫలితాలు?

4

ప్రధాని మోడీపై CJP అధినేత అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..

5

ఢిల్లీ అష్ట దిగ్భంధం.. ధర్నాకు నో పర్మిషన్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

CJP CEC Resignation Demand: దేశ రాజధాని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ మొత్తం భద్రతా బలగాల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. నగర సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, బస్‌ టెర్మినల్స్, హోటళ్లు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎటుచూసినా అష్టదిగ్బంధనమే కనిపిస్తోంది. అంతేకాకుండా పలు కఠిన అంక్షలు విధించారు. నగరంలో శాంతిభద్రతలను కాపాడటానికి విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అనుమతి లేని ధర్నాకు ఎవరూ రావొద్దని ఢిల్లీ పోలీసులు సూచించారు.  

ఢిల్లీలో 35 వేల జవాన్ల మోహరింపు.. 
ఢిల్లీలో కేంద్ర పారా మిలటరీ దళాలకు చెందిన 35 వేల మంది జవాన్లు మోహరించారు. నగరాన్ని తమ అదీనంలోకి తీసుకున్నారు. ప్రతి ప్రాంతాన్నీ క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్‌ తదితర దళాలు రంగంలోకి దిగాయి. ప్రతి 50 మీటర్లకు ఒక జవాను పహారా కాస్తున్నారు. నిరసనకారులు రైళ్లలో తరలివచ్చే అవకాశం ఉండడంతో వారిని అడ్డుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ఢిల్లీకి వచ్చే రైల్లు రద్దు..

దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. నగరంలోని మొత్తం 57 మెట్రో రైలు స్టేషన్లను నిన్న రాత్రి 9 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ను పోలీసులు కోరారు. న్యూఢిల్లీ, హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్లకు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకోవాల్సిన పలు మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేశారు.  ఇప్పటికే  AP, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల నుంచి ఢిల్లీకి పలు రైళ్లు బయలుదేరాయి. నాగపూర్, భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్‌ తదితర స్టేషన్లలో ఆగి ఉన్న రైళ్లలో ప్రయాణిస్తున్న కొందరు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందర్నీ సమీపంలోని పోలీసు స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. ఢిల్లీలో ఎక్కడికక్కడ అదనంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జనం కదలికలను గమనిస్తున్నారు.

ఢిల్లీలో 12 నిర్భంధ కేంద్రాలు.. 
అలాగే 12 నిర్బంధ కేంద్రాలను సైతం సిద్ధం చేశారు. నిరసనకారులను అరెస్టు చేసి వాటిలో నిర్బంధించే అవకాశం ఉంది. శనివారం ఉదయం 6 గంటల తర్వాత ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలపై ఆంక్షలు విధించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులు తమను గృహ నిర్బంధంలో ఉంచారని నోయిడాలోని పలు సామాజిక సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాల సభ్యులు, రాజకీయ పార్టీల నేతలు ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.  

పోలీసుల హెచ్చరికలు.. 
జంతర్‌మంతర్‌ వైపు ఏ ఒక్కరూ రావొద్దంటూ ఢిల్లీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నగరమంతటా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పా టు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. యజమానుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని నోయిడా, గురుగ్రామ్‌ వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. నగరంలో విద్యా సంస్థలను శనివారం మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులెవరూ బయటకు రావడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. దాంతో ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. ఇవాళ  జరగాల్సిన పరీక్షలు, క్రీడా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.  

మద్యం దుకాణాలు బంద్.. 
ఢిల్లీలో నిన్న సాయంత్రం నుంచే అన్ని మద్యం దుకాణాలను పోలీసులు మూసివేయించారు. హాస్టళ్లు, పేయింగ్‌ గెస్టు వసతి గృహాలను తనిఖీ చేస్తున్నారు. సెవెన్‌స్టార్‌ హోటళ్లు మొదలు చిన్నపాటి లాడ్జీల వరకు బుకింగ్స్‌పై ఆంక్షలు విధించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే హోటళ్లు, లాడ్జీల్లోకి ప్రవేశానికి అనుమతి ఇస్తున్నారు. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న స్టార్‌ హోటళ్లు మినహా మిగతా ఇతర ప్రాంతాల్లో బుకింగ్స్‌పై ఆంక్షలు విధించడంతో సందర్శకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వసతి దొరక్కపోవడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.  

కాక్రోచ్ జనతా పార్టీకి నో పర్మిషన్.. 
జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీతోపాటు కొన్ని విద్యార్థి సంఘాలు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించినట్లు న్యూఢిల్లీ రేంజ్‌ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ నూపుర్‌ ప్రసాద్‌ శుక్రవారం స్పష్టంచేశారు. అనుమతి కోసం దరఖాస్తును ఆలస్యంగా సమర్పించడం, గతంలో సీజేపీ నిరసన సమయంలో నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాలను ప్రస్తావించారు. అందుకే ఈసారి అనుమతి ఇవ్వలేదని తెలిపారు.


సీజేపీ కో–కన్వీనర్‌ సౌరవ్‌ దాస్‌ నుంచి ఈ నెల 10న దరఖాస్తు అందినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం.. నిరసనకు 10 రోజుల ముందే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. గతంలో నిరసన చేపట్టడానికి సీజేపీకి అనుమతి ఇచ్చినప్పుడు, వారు చట్టపరమైన ఆదేశాలను పాటించలేదని గుర్తుచేశారు. శాంతిభద్రతల సమస్యను దృష్టిలో పెట్టుకొని సీజేపీ నిరసనకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. అందుకే జంతర్‌మంతర్‌కు ఎవరూ రావొద్దని సూచించారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

పోలీసు రికార్డుల్లో నమోదైన నేరగాళ్లు.. 
పోలీసు రికార్డుల్లో నమోదైన నేరగాళ్లు, అనుమానాస్పద సోషల్‌ మీడియా ఖాతాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈ ఏడాది జూలైలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిలో 2,873 మందికి నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించి, వారి కదలికలపై దృష్టి పెట్టారు. ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్తాన్‌ వైపు నుంచి ఢిల్లీకి వచ్చే మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నోయిడాను ఢిల్లీతో కలిపే సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనకు సంబంధించి సోషల్‌ మీడియాలో సాగుతున్న ప్రచారంపైనా పోలీసులు నిఘా పెంచారు. నిరసనకు ప్రజలను సమీకరించే ప్రయత్నాలు, వాట్సాప్, టెలిగ్రామ్‌ తదితర వేదికల్లో జరుగుతున్న ప్రచారాన్ని పరిశీలిస్తున్నారు. 200 సోషల్‌ మీడియా చానళ్లను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  

జంతర్ మంతర్ 4 కి.మీ పరిధిలో ఇంటర్నట్ సేవలు నిలిపివేత.. 
జంతర్‌ మంతర్‌కు 4 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. నేటి రాత్రి 10 గంటల నుంచి ఆదివారం 10వ తేదీ రాత్రి 10 గంటల వరకు సేవలు నిలిచిపోనున్నట్లు వెల్లడించాయి. ఈ నిర్ణయానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని అధికారులు చెప్పారు. ఈ నిలిపివేత అన్ని మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలకు వర్తిస్తుంది. ఢిల్లీలోని మిగిలిన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపారు. సెంట్రల్‌ ఢిల్లీలో పలు ప్రాంతాల్లో జామర్లు ఏర్పాటు చేయడంతో ఫోన్‌ సిగ్నల్స్‌ అందడం లేదు.  

20 జోన్లుగా న్యూ ఢిల్లీ.. 

శాంతిభద్రతలను కాపాడేందుకు న్యూఢిల్లీ జిల్లాను 20 జోన్లుగా విభజించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై పర్యవేక్షణ కోసం ఈ 20 జోన్లలో ప్రతి జోన్‌ను ఒక జాయింట్‌ కమిషనర్, ఒక డిప్యూటీ కమిషనర్, ఒక అదనపు డిప్యూటీ కమిషనర్‌ను నియమించినట్లు చెప్పారు. భద్రతా చర్యల్లో భాగంగా న్యూఢిల్లీ, సెంట్రల్‌ ఢిల్లీ, నార్త్‌ ఢిల్లీ జిల్లాల్లోని కీలక ప్రదేశాల్లో అదనపు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  

ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు కాక్రోచ్‌ జనతా పార్టీ మద్దతుదారులు ఎవరూ వెళ్లకుండా నిరోధించాలని, ఈ విషయంలో ఢిల్లీ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలకు లేఖ రాశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని కోరుతూ ఢిల్లీ పోలీసు లు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ‘‘యూనిఫాం వెనుక కూడా ఒక మనిషి ఉంటారు’’అని వివరించారు. ధర్నాల్లో పిల్లలు పాల్గొనకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Delhi
National News
PM Modi
BJP