• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ప్రధాని మోడీపై CJP అధినేత అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..

ప్రధాని మోడీపై CJP అధినేత అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..

CJP Dharna at Delhi: CJP ధర్నాతో ఢిల్లీ అట్టుడుకుతోంది. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. నిరసన కోసం వస్తున్న వారిని ఎక్కడికక్కడా అరెస్టులు చేస్తున్నారు. దీంతో ఢిల్లీ మరో లాక్ డౌన్ ను తలపిస్తోంది. మరోవైపు ఆందోళనకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రాజధాని వ్యాప్తంగా డ్రోన్లతో భారీ నిఘా పెట్టారు. ఇప్పటి వరకు 35 వేల మంది పారా మిలటరీతో పోలీసులు నిఘా పెట్టారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 10, 2026, 10:23 AM IST|Updated: Oct 10, 2026, 10:25 AM IST
joinshare
ప్రధాని మోడీపై CJP అధినేత అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
Image Credit: Deepke Sensational Comments on Modi (ZEE News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో CJP అధినేత అభిజిత్ దీప్కే అరెస్ట్..

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో CJP అధినేత అభిజిత్ దీప్కే అరెస్ట్..

2

Donald Trump: నార్వే దేశానికే ఇది సిగ్గుచేటు.. నోబెల్ శాంతి బహుమతిరాకపోవడంపై ఆక్రోశం వెళ్ల గక్కిన డొనాల్డ్ ట్రంప్..

3

రాహువు సంచారంతో అదృష్టం మారుతుందా.. కన్య, మేషం, తులా రాశుల వారికి ఎలాంటి ఫలితాలు?

4

ప్రధాని మోడీపై CJP అధినేత అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..

5

ఢిల్లీ అష్ట దిగ్భంధం.. ధర్నాకు నో పర్మిషన్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

CJP Dharna Againast CEC Resignation:‘సర్’ ప్రక్రియకు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల కమిషన్  జ్ఞానేశ్‌ కుమార్‌కు రాజీనామా చేయాలంటూ సీజేపీ పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో   సీజేపీ నిరసనకు సుమారు 7వేల మంది వస్తారని ఢిల్లీ పోలీసులు అంచనా వేస్తున్నారు. నిరసన నేపథ్యంలో పోలీసులు సంయమనం పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  రెచ్చగొట్టే చర్యలకు స్పందించకుండా ప్రశాంతంగా విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అనుమతి లేని సమావేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఆంక్షలను ఉల్లంఘించి నిరసనకు వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని, ముందుగా నిర్ణయించిన నిర్బంధ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.

రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో డ్రోన్లతో కొనసాగుతున్న నిఘా ..
పోలీసులను రెచ్చగొట్టడం లేదా ఘర్షణలకు కారణమయ్యే ప్రయత్నాలు చేసే వ్యక్తులపైరి పరిస్థితులను బట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.సీజేపీ నిరసన నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో డ్రోన్లతో నిఘా కొనసాగుతోంది. స్టేషన్‌ పరిసరాల్లో భద్రతా కవాతులు నిర్వహిస్తూ, అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టారు. మరోవైపు.. జంతర్‌మంతర్‌ వైపు వస్తున్న సీజేపీ మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాని మోడీ భయపడుతున్నారన్న దీప్కే.. 
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని యువతను, ప్రజలను చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు అబిజిత్ దీప్కే. రైలు సేవలను, మెట్రో కార్యకలాపాలను ఎందుకు నిలిపివేశారని ఆయన ప్రశ్నించారు. ఇంటర్నెట్ నిలిపివేత, రహదారుల దిగ్బంధం వంటి చర్యలను ఆయన విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ నుంచి సైన్యాన్ని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల నుంచి CRPF బలగాలను ఢిల్లీకి ఎందుకు తీసుకొచ్చారన్నారని ప్రశ్నించారు. దేశ ప్రజలపైనే యుద్ధం చేయాలనుకుంటున్నారా అని ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. జ్ఞానేశ్ కుమార్ కోసం ప్రజలపై పోలీసు, సైనిక బలగాలను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.

అరెస్ట్ చేసినా వెనకాడం..
మరోవైపు ఢిల్లీ విమానాశ్రయంలో తనను అరెస్టు చేసినా లేదా అదుపులోకి తీసుకున్నా సిద్ధంగా ఉన్నానని తెలిపారు అబిజిత్ దిప్కే.UAPA, NSA వంటి కఠినమైన చట్టాలను తనపై ప్రయోగించినా వెనక్కి తగ్గబోనని ప్రకటించారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
PM Modi
Delhi
Trending News