SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే టెకీ దుర్మరణం.. అసలేం జరిగిందంటే..?

Techie died in madhapur raod accident: సుష్మా చౌదరీ అనే టెకీ మాదాపూర్ లో వెళ్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్, చెట్టును ఢీకొట్టింది.దీంతో తీవ్ర రక్త స్రావం కావడంతో టెకీ స్పాట్ లోనే మృతి చెందింది. హైదరాబాద్ లో ఈ ఘటనతో ప్రజలు రోడ్డు ప్రమాదాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 26, 2026, 08:34 IST | Updated: Nov 26, 2026, 08:45 IST
Image Credit: Sushma chaudhary Techie died in hyderabad news (file)
Join

Woman Software employee died in Hyderabad road accident: హైదరాబాద్ లో ఇటీవల  రోడ్లపై విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు  జరక్కుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. అయిన కూడా కొంత మంది తప్పిదాల వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాగ్ రూట్ లో వాహనాల్ని నడిపించడం, ట్రిబుల్ రైడింగ్,  రాంగ్ రూట్ లో పార్కింగ్ చేయడం వంటివిచేస్తున్నారు. కొన్నిసార్లు  రోడ్డుపై మట్టి పేరుకుని పోవడం, సడెన్ బ్రేకులు వేయడంతో పలు చోట్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా.. మాదాపూర్ వద్ద ఒక టెకీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి స్పాట్ లోనే దుర్మరణం చెందింది.


హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జైపూర్ కు చెందిన సుష్మా చౌదరీ ప్రముఖ కంపెనీలో టెకీగా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఖాజాగూడలో ఒక సంస్థలో మేనెజర్ గా పనిచేస్తున్న కొతిలి  అక్షయ్  కుమార్ ను ప్రేమించింది. ఇద్దరు పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని కలలు కన్నారు. ఇటీవల వీరిద్దరు కావూరీ హిల్స్ లో ఉంటున్న ఒక ఫ్రెండ్ ఇంటికి భోజనంకువెళ్లారు. రాత్రి మరల వస్తుండగా కొండాపూర్ సీఐఐ జంకన్ వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్, చెట్టును బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో బైక్ వెనుకాల కూర్చున్న సుష్మా చౌదరి తలకు బలమైన గాయాలయ్యాయి.

 బైక్ నడుపుతున్న అక్షయ్ కుమార్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించగా సుష్మా చౌదరీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ  ఘటనతో టెకీల కుటుంబంతో తీవ్ర విషాదం అలుముకుంది.  మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకొవడానికి ఏర్పాట్లు సైతం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES