SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gajwel Mro Suspended: రైతన్నపై అనుచిత వ్యాఖ్యలు.. గజ్వేల్ ఎమ్మార్వోపై సస్పెన్షన్ వేటు..

Gajwel tahsildar sudpended: రైతును పట్టుకుని గజ్వేల్‌ తహసీల్దార్ స్వామి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీనిపై కలెక్టర్ కు బాధిత రైతు ఫిర్యాదు చేశాడు.

Written By Inamdar Paresh
Published: Oct 11, 2026, 11:47 AM IST | Updated: Oct 11, 2026, 11:56 AM IST
Image Credit: Gajwel mro controversy video row
Join

 Gajwel Tahsildar suspended over derogatory remarks on farmer: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో రైతుపై ఎమ్మార్వో చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గామారింది. అంతే కాకుండా బాధిత రైతు కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో కూడా అధికారి వరకు చేరడంతో దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. 

దీనిపై రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కలెక్టర్ ఎమ్మార్వోను సస్పెండ్ చేస్తు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా అధికారులంతా కార్యాలయాలకు వచ్చే వారి పట్ల బాధ్యతతో, నిబద్దతో పనిచేయాలని ప్రవర్తించాలని ఆదేశించారు.


గజ్వేల్ ఎమ్మార్వో వివాదం ఏమిటంటే..?

ఇటీవల రైతు  తన భూమికి చెందిన సమస్యపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లాడు.అయితే అక్కడికి వచ్చిన రైతును చూసి తహసీల్దార్ చిట్టంపల్లి స్వామి అవహేళనగా మాట్లాడారు. నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..?.. బతికే ఉన్నావా..?.. అంటూ నీచంగా మాట్లాడాడు. 

అంతే కాకుండా ఇలా మాట్లాడటం ఏంటని రైతు అడిగితే.. బరా బర్ వస్తది అంటూ ఇంకాస్త అహాంకారంతో మాట్లాడాడు. ఇది కాస్త ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో దీనిపై అధికారులు ఎమ్మార్వోపై చర్యలు తీసుకున్నారు.

  మొత్తంగా ఈ ఘటన కాస్త వైరల్గా మారడంతో దీనిపై నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా.. అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని సైతం కలెక్టర్ తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES