• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /Kondagattu Anjanna: 60 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టంకు అంకురార్పణ.. అంజన్న నిజరూప దర్శనం కోసం భారీగా తరలివస్తున్న భక్తులు..

Kondagattu Anjanna: 60 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టంకు అంకురార్పణ.. అంజన్న నిజరూప దర్శనం కోసం భారీగా తరలివస్తున్న భక్తులు..

Sindoor removal rituals in kondagattu: కొండగట్టు అంజన్నను దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా పొటెత్తారు. ఒకవైపు కార్తీక మాసం, మరోవైపు 60 ఏళ్ల తర్వాత సిందూరం తొలగించి స్వామివారి నిజరూపం దర్శన భాగ్యం కోసం వచ్చే భక్తుల కోసం ఆలయ సిబ్బంది సైతం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.

Written ByInamdar Paresh
Published: Nov 15, 2026, 19:46 IST|Updated: Nov 15, 2026, 19:53 IST
joinshare
Kondagattu Anjanna: 60 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టంకు అంకురార్పణ.. అంజన్న నిజరూప దర్శనం కోసం భారీగా తరలివస్తున్న భక్తులు..
Image Credit: kondagattuhanumansindooremovalrituals

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Huge devote rush in Kondagattu anjanna temple amid sindoor removal rituals: జగిత్యాల జిల్లాలో కొలువైన కొండగట్టు అంజన్న భక్తులకు కొంగు బంగారమని, పిలిస్తే పలికే దైవంగా భక్తులు కొలుచుకుంటారు. ఇక్కడ 40 రోజుల పాటు మండల దీక్షలో ఉంటే తమ కోరిక తప్పకుండా  తీరుతుందని చెబుతుంటారు. అందుకే చాలా మంది  వివాహాలు, సంతానం లేని వారు ఇక్కడ దీక్ష తీసుకుని ఉంటారు. ఈ క్రమంలో కొండగట్టు ఆలయంలో దాదాపు 60 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టంచోటు చేసుకొవడంతో ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కొండగట్టు అంజన్న కొన్ని ఏళ్లుగా అలకరించిన  సిందూరంను తొలగించి నిజరూపంలో స్వామివారి దర్శన భాగ్యంను భక్తులకు కల్పించనున్నారు.  ఆలయ అధికారుల నిర్ణయం ప్రకారం నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు స్వామివారి మూలవిరాట్టుకు అలంకరించిన చందనాన్ని తొలగించే ప్రక్రియ చేపట్టనున్నారు. ఈరోజు చందనాన్ని తొలగించే కార్యక్రమంచేపట్టారు.


దాదాపు 60 ఏళ్ల అనంతరం స్వామివారి మూలవిరాట్టును చందనపు అలంకరణ లేకుండా దర్శించుకునే అరుదైన అవకాశం భక్తులకు లభించింది. ఈ నేపథ్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తులు నిజరూపంలో అంజన్నను దర్శించుకునేందుకు భారీగా ఆలయంకు పొటెత్తారు. ఈ కార్యక్రమాన్ని పండితులు వేదమంత్రాల క్రతువుల మధ్య చందనోత్సవాన్ని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొండగట్టులో ప్రత్యేకంగా పూజలు చేశారు. 
ఆలయ పండితులు, అధికారుల నిర్ణయం ప్రకారం.. నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు స్వామివారి మూలవిరాట్టుకు అలంకరించిన చందనాన్ని తొలగించే ప్రక్రియ చేపట్టనున్నారు. ఆ తర్వాత నవంబర్ 21 నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. 

సుమారు 40 రోజులపాటు కొనసాగే ఈ దర్శన మహోత్సవం కొండగట్టు చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలవనుంది. ఆరు దశాబ్దాల తర్వాత లభిస్తున్న ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. 

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.అన్ని శాఖలక చెందిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకొవాలన్నారు. మరోవైపు ఇప్పటికే కార్తీక మాసంనేపథ్యంలో కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Karimnagar
Festivals