• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /వినాయక నిమజ్జనంలో విషాదం.. బ్యాండ్‌ సౌండ్‌కు డ్యాన్స్ చేస్తూ యువకుడు కుప్పకూలి మృతి!

వినాయక నిమజ్జనంలో విషాదం.. బ్యాండ్‌ సౌండ్‌కు డ్యాన్స్ చేస్తూ యువకుడు కుప్పకూలి మృతి!

Ganesh Immersion News: బ్యాండ్‌ సౌండ్ తట్టుకోలేక వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఓ యువకుడు మరణించాడు. ఈ ఘటన జగిత్యాలలో చోట చేసుకుంది. అయితే, ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఉంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 25, 2026, 10:06 AM IST|Updated: Sep 25, 2026, 10:09 AM IST
joinshare
వినాయక నిమజ్జనంలో విషాదం.. బ్యాండ్‌ సౌండ్‌కు డ్యాన్స్ చేస్తూ యువకుడు కుప్పకూలి మృతి!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ganesh Immersion Telugu News: వినాయక నిమజ్జన వేడుకల్లో ఘోర విషాదం చేటుకుంది.. తీన్మార్‌ చప్పుళ్లతో పాటు భాజభజంత్రీల నడుమ ఎంతో ఉత్సాహంగా సాగుతున్న గణనాథుడి వీడ్కోలు ఊరేగింపులో ఊహించని ఆపశ్రుతి చోటు చేసుకుంది.. డ్యాన్స్‌ చేస్తూ ఉల్లాసంగా గడిపిన ఓ యువకుడు క్షణాల వ్యవధిలోనే కుప్పకూలి హార్ట్‌ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు.. జగిత్యాల పట్టణంలోని తులసీనగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జగిత్యాల పట్టణం తులసీనగర్‌కు చెందిన తోపారపు జయంత్‌ అనే యువకుడు స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జన వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఊరేగింపు సందర్భంగా బ్యాండ్‌ బాజాలతో మోతతో యువకులంతా కలిసి ఎంతో ఆనందంగా డ్యాన్స్‌ చేస్తున్నారు. వారితో పాటు జయంత్ కూడా చాలా హుషారుగా డ్యాన్స్‌ చేస్తూ ఉన్నాడు. అంతలోనే అతడు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై.. ఛాతీని పట్టుకుని నేలపై కుప్పకూలిపోయాడు.

ఈ ఆకస్మిక పరిణామంతో అక్కడున్న స్నేహితులతో పాటు బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో ఆర్థంకాక వెంటనే తేరుకుని..108 అంబులెన్స్‌కు సమాచారం అందించిన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎంతసేపటికీ కూడా అంబులెన్స్‌ ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో పరిస్థితి విషమించింది.

ఊరేంపు బందోబస్తులో విధులు నిర్వహిస్తున్నయ స్థానిక SI కుమారస్వామి యువకుడు పడిపోయిన విషయాన్ని గమనించి..వెంటనే అక్కడి చేరుకున్నారు. ఆయన యువకుడికి శ్వాస ఆడేలా ప్రథమిక చికిత్సగా CPR చేస్తూ ప్రణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అంబులెన్స్‌ రావడం మరింత ఆలస్యమవుతుండటంతో క్షణం ఆలస్యం చేయకుండా.. పోలీస్‌ వాహనంలోనే యువకుడిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే తరలించారు.

ఆసుపత్రికి చేరిన వెంటనే వైద్యులు యువకుడిని పరీక్షించారు. అయితే.. అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నిమిషాల క్రితం వరకు తమ కళ్లెదుటే నవ్వుతూ.. డ్యాన్స్ చేస్తూ గడిపిన జయంత్ మరణించడంతో కుటుంబసభ్యులతో పాటు స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు.
 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

Add Zee News as a Preferred Source
TAGS:
Karimnagar
Telugu News