SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బైక్‌పై కూర్చొని చలాన్లు వేస్తున్న కానిస్టేబుల్.. తలపై హెల్మెట్ ఎక్కడ?

Jagtial Traffic Police Viral: బైక్‌పై ఉండి.. ఓ కానిస్టేబుల్‌ రూల్స్‌ను మర్చిపోయి.. అతను ఈ సమయంలో తలకు హెల్మెట్ ధరించకుండా ఈ-చలాన్లు వేస్తుండడంతో.. అక్కడే ఉన్న యువత ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 11, 2026, 01:41 PM IST | Updated: Nov 11, 2026, 01:42 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Jagtial Traffic Police Viral: ట్రాఫిక్‌ రూల్స్‌, రోడ్డు భద్రతపై గంటల తరబడి అవగాహన సదస్సులు నిర్వహించడం, నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాల మోత మోగించడం ట్రాఫిక్ పోలీసుల రోజు పని.. సామాన్యుడు తలకు హెల్మెట్ పెట్టుకోకపోతే.. క్షణాల్లో ఫొటో తీసి చలాన్ పంపించే పోలీసులే.. స్వయంగా ఆ నిబంధనలను కాలరాస్తే.. ఎలా ఉంటుందో తాజాగా జగిత్యాల పట్టణంలో వెలుగుచూసిన ఘటనే నిదర్శనంగా మారింది.. నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఓ పోలీసు అధికారి వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జగిత్యాలలోని రద్దీగా ఉండే.. ఓ చౌరస్తలో ట్రాఫిక్ సిబ్బంది మోటర్‌ సైకిల్‌పై కూర్చొని డ్యూటీ చేస్తున్నాడు. రోడ్డుపై ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా వెళ్తున్న వాహనాలను గుర్తిస్తూ.. తన వద్ద ఉన్న కెమెరాతో వాటి ఫొటోలు తీసి ఈ-చలాన్లు వేసేపనిలో పడ్డారు. అయితే.. అక్కడే అసలు ఓ ఆశ్చర్యం కలిగించే ఘటన చోటు చేసుకుంది.. ఎదుటివారి తప్పులను కెమెరాలో తీసే ఆ సదరు పోలీసు.. తలకు మాత్రం హెల్మెట్ లేదు.. ఆయన ధరించాల్సిన హెల్మెట్ బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై భద్రంగా ఉంది..

ఈ దృశ్యాన్ని గమనించిన ఓ స్థానికులు.. తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో కాస్తా వైరల్‌గా అవుతోంది.. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సామాన్యుడు అత్యవసర పరిస్థితుల్లో హెల్మెట్ మరిచిపోయి వస్తే.. వందల రూపాయల జరిమానా వేసే అధికారులు.. తాము మాత్రం గంటల తరబడి రోడ్డుపై హెల్మెట్ లేకుండా ఉంటూ.. ఇతరులపై చలాన్లు ఎలా వేస్తారు? అని సూటిగా సోషల్‌ మీడియా వినియోగదారులు ప్రశ్నిస్తూ వస్తున్నారు..

ట్రాఫిక్ నిబంధనలు ప్రాణ రక్షణ కోసమేనని.. అవి పౌరులతో పాటు విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని నెటిజన్లు కామెంట్ల రూపంలో గుర్తు చేస్తూ వస్తున్నారు. పోలీసు యూనిఫాం వేసుకున్నంత మాత్రాన రోడ్డు భద్రతా చట్టాల నుంచి మినహాయింపు లభించదని పలువురు సాధారణ ప్రజలు అంటున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES