• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /SIR పేరుతో ఓటు హక్కుకు తూట్లు.. బండి సంజయ్‌పై మంత్రి అడ్లూరి నిప్పులు!

SIR పేరుతో ఓటు హక్కుకు తూట్లు.. బండి సంజయ్‌పై మంత్రి అడ్లూరి నిప్పులు!

Karimnagar Latest News: SIR పేరుతో BJP అంబేద్కర్ రాజ్యాంగంలోని అనేక హక్కులను కాలరాస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. కరీంనగర్‌లోని గెస్ట్ హౌస్‌లో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్‌ స్పీచ్‌పై ఊహించని స్థాయిలో నిప్పులు చెరిగారు.. అయితే, ఇంకా ఎలాంటి అంశాలపై మంత్రి మాట్లాడారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 24, 2026, 14:29 IST|Updated: Nov 24, 2026, 14:30 IST
joinshare
SIR పేరుతో ఓటు హక్కుకు తూట్లు.. బండి సంజయ్‌పై మంత్రి అడ్లూరి నిప్పులు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

2

Karnataka: బెంగళూరులో ఘోరం.. లాడ్జీలో ప్రియుడితో గొడవ.. మూడో అంతస్తునుంచి పడి యువతి మృతి..

3

ఆడేవడన్న.. ఈడేవడన్న.. వైభవ్ సూర్యవంశీకి అడ్డవేడన్న.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ..!

4

Vaibhav Sooryavanshi: బుడ్డోడు చితక్కొట్టాడు.. 28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు..!

5

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదాలు- 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Karimnagar Latest News: డాక్టర్ B.R అంబేద్కర్ రాజ్యాంగం ప్రసాదించిన పవిత్రమైన ఓటు హక్కును కేంద్రంలోని BJP ప్రభుత్వం SIR ప్రక్రియ పేరుతో కాలరాస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం కరీంనగర్‌లో ఆర్ అండ్ బి గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశ్నించే బడుగు, బలహీన వర్గాల ఓట్లను తొలగించడమే.. లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని BJP కుట్ర చేస్తోందని మంత్రి ఈ సందర్భంగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఓట్ల తొలగింపుపై పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్చకు పెడితే.. సమాధానం చెప్పలేక ప్రధాని మోదీ, అమిత్ షా పారిపోయారన్నారు. రాహుల్ గాంధీని చూస్తేనే.. BJP నేతలకు వణుకు పుడుతోందని.. దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగాల చరిత్ర గాంధీ కుటుంబానిదని ఈ సమయంలో మంత్రి గుర్తు చేశారు. BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాదయాత్రల పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి.. ఇక్కడి దేవాలయాలకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారో? ప్రత్యేకంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.  అందరి గుండెలు లబ్ డబ్ అని కొట్టుకుంటే..  బండి సంజయ్ గుండె మాత్రమే  జై శ్రీరామ్ అని కొట్టుకుంటుందా? అందరి రక్తం ఎర్రగా ఉంటే ఆయన రక్తం కాషాయ రంగులో ఉందా? అంటూ.. ఘాటుగా విమర్శలు కూడా చేశారు.. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ.. యువతను రెచ్చగొడుతూ బండి సంజయ్ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.

SC, ST, మైనార్టీ యువతకు కల్పించిన ఉద్యోగ అవకాశాలు ఏమిటో చెప్పాలని? గల్ఫ్ బాధితుల సమస్యలను ఏనాడైనా పట్టించుకున్నారా అని ఈ సందర్భంగా నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించి.. CBI విచారణకు ఆదేశించినా.. కేంద్ర మంత్రిగా సంజయ్ ఎందుకు విచారణ వేగవంతం చేయించడం లేదని ప్రశ్నించారు.. నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని.. ఆయన రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా హెచ్చరించారు. తాము దేవుడి పేరుతో కాకుండా అభివృద్ధి పేరుతోనే ఎన్నికలకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News