తెలంగాణలో విద్యా సంక్షోభం.. 1,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి?: టీ. జీవన్ రెడ్డి
Telangana Education Crisis: కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా మారిపోయిందని.. సంక్షోభం దిశగా వెళ్తోందని BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి పాలనలో 1,000పైగా ప్రభుత్వ పాఠశాలలు క్లోజ్ అయ్యాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్కూల్క్‌పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరారు..
Telangana Education Crisis In Telugu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని మాజీ మంత్రి, BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. CM రేవంత్ రెడ్డి పాలనలో మూడు సంవత్సరాల్లో ఏకంగా 1,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని.. కొత్తగా ఒక్కటంటే ఒక్క రెసిడెన్షియల్ స్కూల్‌ను కూడా ప్రారంభించలేకపోయారని ఆయన విమర్శించారు.
సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడడారు.. గత BRS ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే.. లక్ష్యంతో KCR 652 కొత్త గురుకులాలను విజయవంతంగా ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని నిర్మించారని.. రైతుల సాగునీటి సమస్యలను తీర్చడానికి కాళేశ్వరం ప్రాజెక్టును తలపెట్టారని ఆయన అన్నారు.. అయితే, ప్రస్తుత ప్రభుత్వం KCRకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న భావంతోనే విద్యా.. సాగునీటి రంగాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విధానంపై జీవన్ రెడ్డి పలు ప్రశ్నలు కూడా సంధించారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో SC, ST, BC, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ల సీట్ల కేటాయింపు ఎలా ఉంటుందో? కొత్త అడ్మిషన్ల ప్రక్రియను ఎలా చేపడతారో ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో విద్యా వ్యవస్థను కేంద్రీకరించడం అస్సలు సరికాదన్నారు. ప్రస్తుతమున్న గురుకుల పాఠశాలలకే అదనపు భవనాలను నిర్మించి.. సౌకర్యాలు కల్పిస్తూ.. వాటిని యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వానికి కోరారు..
పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. మరోవైపు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో వేలాది మంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే అన్నదాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని.. కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్షణమే తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి.. సాగునీటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.