SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Seethakka Apology: కవితపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన తెలంగాణ మంత్రి సీతక్క

Seethakka Express Sincere Apology To Kavitha: రాజకీయంగా విమర్శలు చేస్తున్న క్రమంలో పొరపాటున తప్పు పదం పలకడంతో ఈ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ కవితకు తెలంగాణ మంత్రి సీతక్క క్షమాపణలు చెప్పారు. ఆ వ్యాఖ్యలు పొరపాటున వచ్చాయని.. వాటికి చింతిస్తున్నట్లు ప్రకటించారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 24, 2026, 18:16 IST | Updated: Nov 24, 2026, 18:28 IST
Image Credit: Seethakka Apology
Join

Seethakka Apology To Kavitha: తెలంగాణ మంత్రి సీతక్క బహిరంగ క్షమాపణలు చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కవితకు క్షమాపణలు చెబుతూ ప్రకటన చేశారు. రాజకీయంగా విమర్శలు చేస్తున్న క్రమంలో పొరపాటున ఓ మాట దొర్లిందని దీనికి తాను క్షమాపణలు కోరుతున్నట్లు సీతక్క ప్రకటించారు. తాను కావాలని చెప్పిన మాట కాదని.. అది పొరపాటున దొర్లిందని మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. క‌ల్వ‌కుంట్ల కవిత వ్యాఖ్యలను ప్రస్తావించే క్రమంలో పొరపాటు జరిగిందని.. దీనికి తాను చింతిస్తున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు.

ములుగులో సోమవారం చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మంత్రి సీతక్క.. ఫైలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ బాధితులకు కూడా పెన్షన్లు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించే సమయంలో కవిత విషయమై మాట్లాడారు. కవిత ఒక మీడియా సంస్థతో చేసిన ఇంటర్వ్యూను ప్రస్తావిస్తున్న క్రమంలో కవితపై మాట దొర్లడంతో అది వైరల్‌గా మారింది. కొందరు ఈ వ్యాఖ్యలను తప్పుగా చేస్తూ ట్రోలింగ్‌కు పాల్పడడంతో వెంటనే సీతక్క స్పందించారు.

కవితపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూనే క్షమాపణలు చెబుతూ సీతక్క మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. 'కవితను ఉద్దేశించి ఆ పదం అనలేదు.. మాటల్లో దొర్లింది. వెంటనే వెనక్కి తీసుకున్నా.. ఇది వైరల్ చేయడం దుర్మార్గం' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కొంటా.. వ్యక్తిగత విమర్శలు తన నైజం కాదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టిన అక్కసుతోనే దుష్ప్రచారం చేస్తున్నారని ప్రత్యర్థులపై మండిపడ్డారు.

'క‌ల్వ‌కుంట్ల క‌విత ఒక మీడియాతో మాట్లాడిన  మాట‌ల‌ను తాను ఊటంకిస్తున్న సంద‌ర్బంలో దొర్లిన పొర‌పాటుకు చింతిస్తున్నా' మంత్రి సీత‌క్క ప్ర‌క‌టించారు. 'ములుగులో కొత్త పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఫైలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ బాధితులకు కూడా పింఛన్లు ఇస్తున్న విషయాన్ని నేను ప్రస్తావించా. అనంతరం అదే అంశాలపై మీడియా మాట్లాడుతున్న సందర్భంగా  కవిత ఒక మీడియా సంస్థతో మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావించే సందర్భంగా పొరపాటు జరిగింది' అని సీతక్క వివరించారు.

ఆ పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నప్పటికీ.. కవితపై ఉన్న రాజకీయ కోపంతో ఓ పార్టీకి చెందినవారు ఆ వ్యాఖ్యలను వైర‌ల్ చేయడం దారుణమని మంత్రి సీతక్క మండిపడ్డారు. రాజ‌కీయ కక్ష‌తో త‌న‌ను క్యాన్స‌ర్ పేషెంట్‌గా బీఆర్ఎస్ చిత్రీక‌రించిట్లు క‌వితే ఓ మీడియా ఛానెల్‌కు చెప్పిన విష‌యాన్ని తాను ప్ర‌స్తావించినట్లు తెలిపారు. క‌వితను కావాల‌ని అన్న ప‌దం కాదని.. అది దొర్లిన ప‌దం.. వెంటనే వెనక్కి తీసుకుంటున్న‌ట్లు చెప్పుకొచ్చారు. వివరణ ఇచ్చినా కూడా ఓ పార్టీ ట్రోల్ చేయ‌డం దారుణ‌మని చెప్పారు.

'వరంగ‌ల్ పర్య‌ట‌న సంద‌ర్భంగా చేయుత పెన్ష‌న్ల‌పై కేటీఆర్ చేసిన త‌ప్పుడు ప్ర‌చారాన్ని నేను తిప్పికొట్టాన‌నే అక్క‌సుతోనే త‌న మాటల‌ను వ‌క్రీక‌రించి ప్ర‌చారం చేస్తున్నారు' అని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిప‌డ్డారు. తాను రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయడం తన నైజం కాదని పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES