SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మీ జ్ఞాపకశక్తి పెరగాలన్నా.. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ ఈ డ్రై ఫ్రూట్ తినాల్సిందే!

వాల్నట్స్‌ చూడటానికి కూడా మన మెదడు ఆకారం మాదిరి చిన్నవిగా ఉంటాయి. ఇది యాక్సిడెంటల్‌గా కాదు.. నిజానికి ఈ వాల్నట్స్‌ తింటే మెదడు ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ఒమేగా 3s, విటమిన్‌ ఇ ఉంటుంది. ప్రతిరోజూ వాల్నట్స్‌ తింటే కలిగే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 13, 2026, 03:52 PM IST | Updated: Nov 13, 2026, 03:56 PM IST
Image Credit: Eating Soaked Walnuts Daily:
Join

Eating Soaked Walnuts Daily: మన రోజువారీ డైట్‌లో గింజలు తప్పనిసరి.. వాటిని నానబెట్టి ఉదయం పరగడుపున తినడం వల్ల శరీర ఆరోగ్యం మాత్రమే కాదు.. చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుందని వైద్యులు సూచిస్తారు. అందులో మొదటగా చెప్పుకోదగ్గవి వాల్నట్స్‌.. ఇందులో విటమిన్‌ ఇ తోపాటు ఒమేగా 3s కూడా ఉంటాయి. ఇవి ఫ్రీర్యాడకల్‌ సెల్‌ డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి. ఇది మెదడు ఫోకస్‌ను పెంచుతుంది.

గుండె బలంగా..
వాల్నట్స్‌ రోజువారీ డైట్లో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ మన శరీరంలో తగ్గిపోతుంది. మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీంతో రక్తనాళాలు కూడా శుభ్రమైపోతాయి. దీనివల్ల మన గుండె పనితీరు కూడా మెరుగవుతుంది. వాల్నట్‌ వల్ల హార్ట్‌ స్ట్రోక్‌ ప్రమాదం కూడా తగ్గుతుంది.

శరీర నొప్పులు..
శరీరం తరచూ నొప్పులు ఉంటే రానురాను డయాబెటీస్‌ బారిన పడతారు. జాయింట్‌ పెయిన్స్‌, తరచూ అలసిపోవడం జరుగుతుంది. రోజూ ఉదయం నానబెట్టిన వాల్‌నట్‌ తినండి. ఇందులో పాలీఫెనల్స్‌, ఎల్లాజిక్‌ యాసిడ్‌, విటమిన్‌ ఇ సమ్మేళనాలు ఉంటాయి. ఇది తరచూ బాడీ పెయిన్స్‌ రాకుండా చేస్తాయి, తక్షణ శక్తి అందిస్తుంది. డైలీ మీ డైట్‌లో యోగార్ట్‌, కూరల్లో వేసుకునే తింటే మంచిది.

బరువు నిర్వహణ..
వాల్నట్స్‌లో క్యాలరీలు ఉంటాయి. ఇందులో మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌, ఫైబర్‌, కొవ్వులు ఉంటాయి. వీటిని స్నాక్‌ రూపంలో తీసుకోవచ్చు.బెల్లీ ఫ్యాట్‌ కూడా తగ్గుతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

గట్‌ ఆరోగ్యం..
వాల్నట్న్‌లో మంచి బ్యాక్టిరియా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మృదువుగా మారుస్తుంది. దీర్ఘకాలిక మలబద్దక సమస్యకు మంచి రెమిడీగా మారుతుంది. నానబెట్టిన వాల్నట్స్‌తో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ప్రతిరోజూ 43 గ్రాముల వాల్నట్స్‌ నానబెట్టి తినాలని నివేదికలు చెబుతున్నాయి.

Read Also: కార్తీక మాసం.. ఉసిరి ప్రత్యేకం.. రోజుకు ఒక్కటి తింటే చాలు..! మెరిసే చర్మం, నల్లటి ఒత్తైన జుట్టు మీ సొంతం!
Read Also: బోన్స్ బలహీనంగా మారుతున్నాయా? ఈ 5 అలవాట్లు మానకపోతే ఆస్టియోపోరోసిస్ ప్రమాదం!

రోగనిరోధక శక్తి..
వాల్నట్స్‌లో జింక్‌, రాగి, ఫోలెట్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇవి స్ట్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడే శక్తి అందిస్తుంది. సీజనల్‌ జబ్బులు మన దరిచేరకుండా కాపాడుతాయి. చలికాలంలో ఇవి ఎంతో కీలకం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో చేర్చుకుంటే లాభం.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES