Rangarazan Tragedy Accident: రోడ్డుపై ప్రయాణిస్తున్న కాలేజ్ బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. అత్యంత వేగంగా ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడగా బస్సులోని విద్యార్థులందరూ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలోనే 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ప్రయాణికులతోపాటు ఇతర ప్రయాణికులు ఉన్నారు. మరో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. అస్సాం రాష్ట్రంలోని కాజీరంగ పరిధిలోని రంగజన్‌లో చోటుచేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర విషాదం నింపింది. ఎంతో భవిష్యత్ కలిగిన విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో ఆ కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. అతివేగంగా వచ్చిన ట్రావెలర్ వాహనం ట్రక్కును ఢీకొట్టింది. 35 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ (AS02AC6690) అత్యంత వేగంగా ట్రక్కు (KA01AT0977)ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ వాహనంలో కళాశాల విద్యార్థులతోపాటు ఇతర ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం కోహోరా మోడల్ ఆసుపత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద తీవ్రతకు వ్యాన్ నుజ్జునుజ్జయ్యింది. వ్యాన్ లోపల చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీయడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది. మృతదేహాలను బయటకు తీయడానికి తీసేందుకు పోలీసులతో కలిసి స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.