శరీరంలో ఓమేగా-3 లోపించిందా? రోజువారీ డైట్‌లో చేపలకు బదులు ఇవి ట్రై చేయండి!
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి ఎంతో ముఖ్యమైన కొవ్వులు. ఇవి ప్రధానంగా కొవ్వు ఆమ్లాలు. ఇవి గుండె ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుకు కూడా మేలు చేస్తా. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ఇవి ఎక్కువగా చేపల్లో లభిస్తాయి, కాబట్టి చేపలు తినలేని వారు ప్రత్యామ్నాయంగా ఒమేగా-3 పుష్కలంగా ఉండే ఐదు రకాల ఆహారాలను తీసుకోవచ్చు. ఆ జాబితా చూద్దాం.
Omega 3 rich vegetarian foods: మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుబాటులో ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. విటమిన్ల వంటి పోషకాలు ఎంత ముఖ్యమో, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అంతే అవసరం. సాధారణంగా ఇవి చేపల్లో ఎక్కువగా ఉంటాయని వింటూ ఉంటాం. శాకాహారుల పరిస్థితి వేరుగా ఉంటుంది, వారు మాంసం తినలేరు. అయితే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కేవలం చేపల్లోనే కాదు, మొక్కల ఆధారిత ఆహారాల్లో కూడా పుష్కలంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల చేపలకు మంచి ప్రత్యామ్నాయం లభిస్తుంది. చాలామంది ఒమేగా-3 కోసం సాల్మన్ వంటి చేపలను లేదా మార్కెట్లో లభించే క్యాప్సూల్స్‌ను వాడుతుంటారు. కానీ వెజిటేరియన్ల కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి.
సాధారణంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌లో మూడు రకాలు ఉంటాయి: ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), EPA, DHA. మొక్కల ఆధారిత ఆహారాల్లో ఇవి కలగలిసి ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సోయాబీన్స్:
చేపలు తినలేని వారు సోయాబీన్స్ ద్వారా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను పొందవచ్చు. ఇందులో ఖనిజాలు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. సోయాబీన్స్‌లో విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇది చేపలకు ఒక చక్కని ప్రత్యామ్నాయం. ఆర్గానిక్ సోయాబీన్స్ తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
వాల్‌నట్స్:
వాల్‌నట్స్‌లో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. వీటిని నానబెట్టి తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. వీటిలో మొక్కల ఆధారిత ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు కలిసి ఉంటాయి. వాల్‌నట్స్‌ను నానబెట్టి సలాడ్స్ లేదా స్మూతీలలో కలిపి తీసుకుంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి అందుతాయి.
అవిసె గింజలు:
వీటిలో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటితో పొడి లేదా నూనెను తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఇవి కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తాయి. మన ఆహారంలో వీటిని కొద్దిగా కలిపి తీసుకుంటే సరిపోతుంది.
చియా విత్తనాలు:
చియా విత్తనాల్లో కూడా ఒమేగా-3 యాసిడ్స్ ఉంటాయి. ఇవి నీటిలో నానబెట్టినప్పుడు జెల్ లాగా మారుతాయి. వీటిని నీటిలో అరగంట పాటు నానబెట్టి తీసుకోవచ్చు, లేదా పుడ్డింగ్స్, స్మూథీలలో కలిపి కూడా తినవచ్చు.
Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!
ఆల్గల్ ఆయిల్: వీటితో పాటు ఆల్గల్ ఆయిల్ అనే సప్లిమెంట్ ద్వారా కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను పొందవచ్చు. ఇది నూనె రూపంలో ఉంటుంది. వీగన్, చేపలు తినలేని వెజిటేరియన్లకు ఇది ఒక ఉత్తమ ప్రత్యామ్నాయ సప్లిమెంట్. మీరు ఒమేగా-3 డైట్‌ను పాటించాలనుకుంటే సరైన ఫుడ్ ప్లానింగ్ కూడా అవసరం. మీ ఆహారంలో ఒమేగా-3 లోటు ఉంటే, పైన పేర్కొన్న ఆహార పదార్థాలను లేదా సరైన సప్లిమెంట్లను చేర్చుకోవచ్చు.(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు, సూచనలు కేవలం పాఠకుల అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే అందించాం. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ వైద్యుల సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కానేరదు. ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నా లేదా కొత్త జీవనశైలి మార్పులు పాటించాలన్నా ముందుగా సంబంధిత వైద్యులను సంప్రదించండి).