• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /ATM Security Tips: ఏటీఎం వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 తప్పులు చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది!

ATM Security Tips: ఏటీఎం వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 తప్పులు చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది!

ATM Safety Guidelines: ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ నిత్యజీవితంలో సులభమైన మార్గమైనప్పటికీ, చిన్నపాటి అజాగ్రత్త వల్ల బ్యాంకు ఖాతాలోని సొమ్ముతో పాటు వ్యక్తిగత వివరాలూ మోసగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. కార్డు సమాచారం తస్కరించడం నుంచి పిన్‌ తెలుసుకుని ఖాతాలు ఖాళీ చేయడం వరకు నేరగాళ్లు రకరకాల పద్ధతులు వాడుతున్నారు. అయితే ఏటీఎంలో వినియోగదారులు చేయకూడని 5 ప్రధాన తప్పలు, పాటించాల్సిన రక్షణ చర్యలను ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByHarish Darla
Published: Oct 24, 2026, 06:27 PM IST|Updated: Oct 24, 2026, 06:30 PM IST
joinshare
ATM Security Tips: ఏటీఎం వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 తప్పులు చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
IND vs NZ 2nd T20 Highlights: "అరేయ్ కాల్ ఇవ్వలే నువ్వు.. నేను వచ్చేస్తా ఆరామ్‌ సేయ్.." తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి తెలుగు మాటలు..!

IND vs NZ 2nd T20 Highlights: "అరేయ్ కాల్ ఇవ్వలే నువ్వు.. నేను వచ్చేస్తా ఆరామ్‌ సేయ్.." తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి తెలుగు మాటలు..!

2

DK Aruna: పాలమూరు జిల్లా రైతులకు రేవంత్‌ రెడ్డి ద్రోహం తలపెట్టడం దుర్మార్గం: ఎంపీ డీకే అరుణ

3

ATM Security Tips: ఏటీఎం వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 తప్పులు చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది!

4

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినిని తోసేసిన ఎస్‌ఐ.. ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్..!

5

Tilak Varma New Record: న్యూజిలాండ్‌తో రెండో టీ20లో తిలక్ వర్మ వరల్డ్ రికార్డు..అరుదైన ఘనత సాధించిన వైస్ కెప్టెన్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ATM Safety Guidelines: నేటి రోజుల్లో ఏటీఎం నుంచి నగదు తీసుకోవడం చాలామందికి సర్వసాధారణ అలవాటుగా మారింది. అయితే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఖాతాలోని నగదును కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు పొంచి ఉంటారు. ఈ విధమైన ఆర్థిక మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఏటీఎం వినియోగించేటప్పుడు ప్రతి ఒక్కరూ నివారించాల్సిన ఐదు కీలక తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1) ఏటీఎం పిన్‌ను ఇతరులతో పంచుకోవడం..
మీ రహస్య పిన్‌ నంబర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోకూడదు. బ్యాంకు సిబ్బంది అని చెప్పినా లేదా లావాదేవీకి సాయం చేస్తామని ముందుకొచ్చినా పిన్‌ వివరాలు వెల్లడించరాదు. అలాగే ఫోన్‌ కాల్స్, సందేశాల ద్వారా ఎవరైనా అడిగినా ఇవ్వకూడదు. పిన్‌ ఎంటర్‌ చేసే సమయంలో ఇతరులు చూడకుండా మరో చేత్తో కీప్యాడ్‌ను కప్పి ఉంచడం తప్పనిసరి.

2) తెలియని వారి చేతికి ఏటీఎం కార్డు ఇవ్వడం..
ఏటీఎం కార్డు మెషిన్‌లో ఇరుక్కుపోయినా లేక యంత్రం పనిచేయకపోయినా సమీపంలోని అపరిచితుల సాయం కోరవద్దు. మీ కార్డును వారి చేతికి ఇవ్వడం ప్రమాదకరం. సాయం చేసే నెపంతో పిన్‌ తెలుసుకుని, కార్డును మార్చేసి మోసాలకు పాల్పడే ముప్పు ఉంది. సమస్య తలెత్తితే నేరుగా బ్యాంకు అధికారిక కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి పరిష్కరించుకోవాలి.

3) కార్డు, నగదు సరిచూసుకోకుండా వెళ్లిపోవడం..
తొందరపాటులో నగదు తీసుకుని కార్డును ఏటీఎం వద్దే మరిచిపోయే అవకాశముంది. అక్కడి నుంచి బయలుదేరే ముందు కార్డు, నగదు రెండూ తీసుకున్నారో లేదో నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఖాతాలో డబ్బులు కట్‌ అయినా క్యాష్‌ బయటకు రాకపోతే లావాదేవీ వివరాలను నోట్ చేసుకుని వెంటనే బ్యాంకు శాఖకు ఫిర్యాదు చేయాలి.

4) అనుమానాస్పద ఏటీఎంలను వినియోగించడం..
ఏటీఎం కార్డు చొప్పించే ప్రదేశంలో అదనపు పరికరాలు కనిపించినా, కీప్యాడ్‌ వదులుగా ఉన్నా లేదా యంత్రంలో అసాధారణ మార్పులు గమనించినా ఆ ఏటీఎంను వాడకూడదు. నేరగాళ్లు కార్డు వివరాలు దొంగిలించడానికి స్కిమ్మింగ్‌ పరికరాలు అమర్చే ప్రమాదం ఉన్నందున, ఇలాంటివి కనిపిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి.

5) లావాదేవీ అవ్వకముందే బయటకు రావడం..
డబ్బులు చేతికి రాగానే త్వరపడి బయటకు రాకూడదు. లావాదేవీ పూర్తయిందని యంత్రం స్పష్టంగా ధ్రువీకరించే వరకు వేచి ఉండాలి. స్క్రీన్‌ నిలిచిపోయినా లేదా యంత్రం అసాధారణంగా స్పందించినా అధికారిక బ్యాంకింగ్‌ మార్గాల ద్వారా ఖాతా బ్యాలెన్స్‌ను పరిశీలించుకుని, అవసరమైతే బ్యాంకును సంప్రదించాలి.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News