SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నిద్రలేచాక ఎన్ని గంటల్లో బ్రేక్ ఫాస్ట్ తినాలి?.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న విషయాలివే..!!

Breakfast Timing: మనలో చాలా మంది ఉదయం నిద్రలేవగానే పనుల్లో బిజీగా ఉంటారు. సమయం లేక టిఫిన్ తినడం ఆలస్యం చేస్తుంటారు. చివరకు మధ్యాహ్నం సమయంలో భోజనం చేయాల్సింది టిఫిన్ తింటుంటారు.

Written By Bhoomi
Published: Nov 10, 2026, 11:43 AM IST | Updated: Nov 10, 2026, 11:45 AM IST
Image Credit: Breakfast Timing:
Join

Breakfast Timing: మనలో చాలా మంది ఉదయం నిద్రలేవగానే పనుల్లో బిజీగా ఉంటారు. సమయం లేక టిఫిన్ తినడం ఆలస్యం చేస్తుంటారు. చివరకు మధ్యాహ్నం సమయంలో భోజనం చేయాల్సింది టిఫిన్ తింటుంటారు. భోజనం మధ్యాహ్నం 3గంటలకు చేస్తుంటారు. ఇలా మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లపై వెంటనే దృష్టి పెట్టాల్సిందే. ఎందుకంటే ఉదయం అల్పాహారం చేసే సమయం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12గంటలు దాటిన తర్వాత మొదటి భోజనం చేయడం వల్ల శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. 

రాత్రంతా ఆహారం తీసుకోకుండా నిద్రపోయిన తర్వాత ఉదయం శరీరానికి తిరిగి శక్తిని అందించేది అల్పహారమే. బ్రేక్ ఫాస్ట్ రోజువారీ జీవక్రియలను సక్రమంగా సాగేందుకు సహాయం చేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసేందుకు అవసరమైన శక్తి, పోషకాలను అందిస్తుంది. అందుకే నిద్రలేచని 2గంటల్లోపు బ్రేక్ ఫాస్ట చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడంలో ఎక్కువ ఆలస్యం చేసినట్లయితే.. శరీర జీవగడియారం దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీని వల్ల జీవక్రియల పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఇన్సులిన్ నిరోధకతను పెంచవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది డయాబెటిస్ కు దారితీసే ప్రమాద కారకాల్లో ఒకటిగా చెబుతున్నారు.

ఇక రోజూ వేర్వేరు సమయాల్లో భోజనం చేసినట్లయితే.. శరీరంలో ఆకలి, కడుపు నిండిన భావనకు సంబంధించిన సంకేతాలు గందరగోళానికి గురవుతుంటాయి. దీంతో ఎప్పుడు తినాలి.. ఎంత తినాలి అనే విషయంలో నియంత్రణ తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉదయం టిఫిన్ తినకుండా ఉంటే మధ్యాహ్న సమయానికి ఆకలి ఎక్కువగా అవుతుంది. దీంతో అవసరానికి మించి ఆహారం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు మధ్యలో చిరుతిళ్లు తినడం కూడా పెరుగుతుంది. దీంతో శరీరంలోకి చేరే కేలరీలు అధికమవుతాయి. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం లేకపోలేదు. రక్తంలో షుగర్ లెవల్స్ లో హెచ్చుతగ్గులు ఏర్పడి నీరసం కూడా వస్తుంది.

అయితే నిద్రలేచని 2గంటల్లోపు బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. అందులో ప్రొటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇవి బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచి.. మధ్యాహ్న భోజనం వరకు శక్తి నిలకడగా ఉండేందుకు తోడ్పడతాయి. అయితే ప్రతి ఒక్కరి నిద్ర సమయం, ఆరోగ్య పరిస్థితి, ఆహారపు అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే ఒకే సమయాన్ని అందరికీ వర్తించేలా చూడాలి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు వైద్యుల సూచనల ప్రకారం ఆహార సమయాలను పాటించడం ముఖ్యం.

Also Read: 

ఎన్విడియా CEOకు బిగ్ షాక్.. ఒక్కరోజే రూ.17 లక్షల కోట్లు  ఆవిరి..!!

 

తెలంగాణాలో వారానికి 5 రోజుల పనిదినాలపై సర్కార్ ఆరా..?

ఉద్యోగులకు సుప్రీం బిగ్ షాక్.. ఆ ఒక్క తప్పు చేస్తే ఇక నేరుగా సస్పెన్షనే..!!

 

 

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES