SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చైనా సైంటిస్టుల మరో అద్భుత ఆవిష్కరణ.. ఈ ఎలక్ట్రిక్ దువ్వెన వాడితే బట్టతలపై మళ్లీ జుట్టు మొలుస్తుంది..!!

Electric Hair Growth Comb: జుట్టు రాలడం.. బట్టతల సమస్యలతో సతమతమవుతున్న వారికి చైనా పరిశోధకులు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఊడిపోయిన జుట్టును అతి తక్కువ సమయంలోనే తిరిగి మొలిపించే వినూత్నమైన బయోఎలక్ట్రానిక్ దువ్వెనను ఆవిష్కరించారు.

Written By Bhoomi
Published: Nov 18, 2026, 16:18 IST | Updated: Nov 18, 2026, 16:24 IST
Image Credit: Chinese scientists
Join

Electric Hair Growth Comb: జుట్టు రాలడం.. బట్టతల సమస్యలతో సతమతమవుతున్న వారికి చైనా పరిశోధకులు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఊడిపోయిన జుట్టును అతి తక్కువ సమయంలోనే తిరిగి మొలిపించే వినూత్నమైన  బయోఎలక్ట్రానిక్ దువ్వెనను ఆవిష్కరించారు. బీహాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం రూపొందించిన ఈ ప్రత్యేక పరికరానికి  డీట్యాంగిల్  అని నామకరణం చేశారు. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ ఎలక్ట్రిక్ దువ్వెన అద్భుతమైన పనితీరును కనబరిచింది. దీనిని ఉపయోగించిన కేవలం 28 రోజుల్లోనే దాదాపు 98 శాతం మేర కొత్త జుట్టు తిరిగి మొలవడం విశేషం. భవిష్యత్తులో బట్టతల చికిత్సలో ఇదొక పెను విప్లవాత్మక మార్పు కానుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన పూర్తి శాస్త్రీయ వివరాలను ప్రఖ్యాత సైన్స్ జర్నల్  నేచర్ కమ్యూనికేషన్స్ ఇటీవల ప్రచురించింది.

ఈ దువ్వెన విద్యుత్ ప్రేరణ, చికిత్సకు ఉపయోగించే అణువులను ఒకేసారి అందించడం ద్వారా పనిచేస్తుంది. దీనికి రెండు రకాల పళ్లుంటాయి. పొడవాటి పళ్లు తల లోపలికి విద్యుత్ క్షేత్రాన్ని పంపి కేశ కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. పొట్టిగా ఉండే పళ్లు 2 రకాల మందులను రిలీజ్ చేస్తాయి. ఒకటి, రక్త ప్రసరణను మెరుగుపరిచే VEGFAప్లాస్మిడ్ కాగా..రెండవది జుట్టు రాలేందుకు కారణమయ్యే DHTహార్మోన్ను అణచివేసే SRD5A2 siRNA.

ఆండ్రోజెనెటిక్ అలోపేసియా (బట్టతల) సమస్యతో బాధపడుతున్న ఎలుకలపై శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. ఎలాంటి చికిత్స అందించని ఎలుకల్లో 28 రోజుల వ్యవధిలో కేవలం 1 శాతం మాత్రమే జుట్టు పెరగగా.. కేవలం విద్యుత్ ప్రేరణ ద్వారా 40 శాతం, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మందులతో 50 నుంచి 70 శాతం వరకు మాత్రమే ఫలితం కనిపించింది. అయితే, ఈ కొత్త బయోఎలక్ట్రానిక్ దువ్వెనను ఉపయోగించినప్పుడు మాత్రం ఏకంగా 97.85 శాతం మేర కొత్త జుట్టు తిరిగి పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా జనం బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ పరిశోధన ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని, కేవలం ఎలుకలపై మాత్రమే ఈ ప్రయోగాలు నిర్వహించామని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మనుషులపై భద్రతా పరీక్షలు, క్లినికల్ ట్రయల్స్ అన్నీ విజయవంతంగా పూర్తయిన తర్వాతే దీనిని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురాగలమని వారు వెల్లడించారు.

Also Read:

 

బర్డ్‌ఫ్లూ ముప్పుకు చెక్.. తొలి స్వదేశీ H5N1 టీకాను అభివృద్ధి చేసిన భారత్..!!

 

గుడ్ న్యూస్ చెప్పబోతున్న సమంత.. డెలివరీకి ముందు భర్తతో కలిసి ప్రత్యేక పూజలు, ఫొటోలు చూశారా?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES