• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /షుగర్ ఉన్నవారు ఏ పండ్లు తింటే బెస్ట్? డయాబెటాలజిస్ట్ రేటింగ్ ఇవే..! ఈ జ్యూస్‌లు మాత్రం అస్సలు వద్దు!

షుగర్ ఉన్నవారు ఏ పండ్లు తింటే బెస్ట్? డయాబెటాలజిస్ట్ రేటింగ్ ఇవే..! ఈ జ్యూస్‌లు మాత్రం అస్సలు వద్దు!

పండ్లలో సహజమైన చక్కెరలు ఉంటాయి. ఇవి బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచివి. అంతేకాకుండా, డయాబెటిస్‌తో బాధపడేవారు కూడా వీటిని సహజంగా తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్ కూడా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రీ-డయాబెటిస్ లేదా టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వీరు సరైన డైట్ పాటించాలి.

Written ByRenuka Godugu
Published: Sep 24, 2026, 03:54 PM IST|Updated: Sep 24, 2026, 03:57 PM IST
joinshare
షుగర్ ఉన్నవారు ఏ పండ్లు తింటే బెస్ట్? డయాబెటాలజిస్ట్ రేటింగ్ ఇవే..! ఈ జ్యూస్‌లు మాత్రం అస్సలు వద్దు!
Image Credit: Best Fruits for Diabetes

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Best Fruits for Diabetes: పండ్లలో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ, అతిగా తీసుకుంటే చక్కెర స్థాయిలు పెరగవచ్చు. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు పండ్లను పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు తీసుకోవడం వల్ల ఇతర ఆహార పదార్థాలను అతిగా తినకుండా ఉండవచ్చు, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా కొన్ని రకాల పండ్లను తీసుకోవచ్చు, అవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

జామ పండు డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది, ఎందుకంటే ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మెల్లిగా జీర్ణం అవ్వడం వల్ల గ్లూకోజ్ కూడా నెమ్మదిగా గ్రహించబడుతుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది.
బెర్రీ పండ్లలో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ వంటివి ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండి, చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.

యాపిల్స్‌లో పెక్టిన్ ఉంటుంది. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

ఆరెంజ్ పండ్లలో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా చూస్తుంది. కివి పండులో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉండటం వల్ల, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడానికి కివి తీసుకోవడం మంచిది. బొప్పాయి పండులో సహజమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్స్ ఉంటాయి. ఇది జీర్ణక్రియకు మేలు చేయడమే కాకుండా మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది.

దానిమ్మ పండులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇందులో సహజమైన చక్కెరలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండులో ఖనిజాలు ఉన్నప్పటికీ, దీని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో సహజ చక్కెరలు ఉండటం వల్ల ఇది గ్లూకోజ్ స్థాయిలను హఠాత్తుగా పెంచుతుంది. కాబట్టి, దీనిని చాలా తక్కువ మొత్తంలో.. వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.
చక్కెర సమస్య ఉన్నవారు ద్రాక్ష పండ్లను తీసుకోకపోవడం మంచిది, ఎందుకంటే వీటిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతాయి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Health