• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /Ee Taram Kathalu: ప్రేమ పెరిగే కొద్దీ గొడవలు.. మన జీవితం ఈ 5 వేళ్లలాంటిదే!

Ee Taram Kathalu: ప్రేమ పెరిగే కొద్దీ గొడవలు.. మన జీవితం ఈ 5 వేళ్లలాంటిదే!

Ee Taram Kathalu: ప్రేమ ఉన్న చోట చిన్న చిన్న గొడవలు సహజం. మన చేతిలోని ఐదు వేళ్లు ఒకేలా ఉండనట్లే, ప్రతి మనిషి ఆలోచనలు, అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉంటాయి. అయినా ప్రేమ, అనుబంధం మనుషులను కలిపి ఉంచుతాయి. ప్రేమలోని మధురమైన క్షణాలు, చిన్నపాటి అలకలు, బంధాల విలువను చాటి చెప్పే ‘ఈ తరం కథలు’ విశేషాలను ఈ వీడియోలో చూడండి.

Written ByVishnu Priya
Published: Oct 24, 2026, 10:14 AM IST|Updated: Oct 24, 2026, 10:27 AM IST
joinshare
Ee Taram Kathalu: ప్రేమ పెరిగే కొద్దీ గొడవలు.. మన జీవితం ఈ 5 వేళ్లలాంటిదే!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తెలంగాణపై తుపాను ఎఫెక్ట్.. ఎల్లో అలర్ట్ జారీ..

తెలంగాణపై తుపాను ఎఫెక్ట్.. ఎల్లో అలర్ట్ జారీ..

2

Actress: కరుప్పు సినిమా నటి మృతి.. వైరల్‌గా చివరి పోస్టులు!

3

Oppo అభిమానులకు గుడ్ న్యూస్.. Reno 17, Pro, Reno 17c ఫోన్ల ఫీచర్లు లీక్!

4

Uttar Pradesh: సెల్ టవర్ ఎక్కిన యువతి.. వీడియో కాల్ లో పెళ్లి చేసిన పెద్దలు.. యూపీలో వింత ఘటన..

5

BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై వేటుపడనుందా..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ee Taram Kathalu:  మన జీవితంలో కొన్ని విషయాలు మనకు అనుభవం వచ్చిన తర్వాతే అర్థమవుతాయి. ఒక సంబంధం మొదలైనప్పుడు ఉండే ఆనందం, ఆ తర్వాత పెరిగే అనుబంధం, చివరికి అదే బంధంలో వచ్చే చిన్న చిన్న గొడవలు.. ఇవన్నీ దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో కనిపిస్తాయి. అలాంటి ఓ అనుభవాన్ని నేహా అనే అమ్మాయి మాతో పంచుకుంది. ఇది కేవలం తన కథ కాదని.. తన జీవితంలో నేర్చుకున్న ఓ ముఖ్యమైన పాఠమని ఆమె చెప్పింది. ఈ కథలోని వ్యక్తుల గోప్యత కోసం పేర్లు, కొన్ని వివరాలను మార్చాం.

నేహా చెప్పిన ఓ పోలిక చాలా ఆసక్తికరంగా ఉంది. మన చేతికి ఉన్న ఐదు వేళ్లను గమనిస్తే.. ప్రతి వేలు ఒక దశను గుర్తు చేస్తుందని ఆమె అంటోంది.
చిటికెన వేలు లాంటిదే ఓ కొత్త రిలేషన్‌షిప్ ప్రారంభ దశ. అప్పుడు ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలియదు. చిన్న చిన్న విషయాలు కూడా కొత్తగా అనిపిస్తాయి. మాట్లాడటం, కలవడం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం.. అన్నీ చాలా ఆనందంగా ఉంటాయి.

ఆ తర్వాత ఉంగరం వేలు దగ్గరకు వచ్చేసరికి ప్రేమ మరింత పెరుగుతుంది. ఎదుటి వ్యక్తి మనకు చాలా ప్రత్యేకంగా మారిపోతారు. వారి గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలవుతుంది.

ఇక మధ్య వేలు లాగా ప్రేమ కూడా ఒక దశలో చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుందని నేహా చెబుతోంది.

ప్రేమ పెరిగిన కొద్దీ మనలో అంచనాలు, ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి. “నాతోనే అన్ని విషయాలు చెప్పాలి”, “నన్నే ముందు గుర్తు చేసుకోవాలి”, “నాకు తెలియకుండా ఏదీ చేయకూడదు” అనే ఆలోచనలు మొదలవుతాయి.

అక్కడి నుంచే చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ఎదుటి వ్యక్తి మన అంచనాలకు తగ్గట్టు ప్రవర్తించకపోతే బాధ కలుగుతుంది. అదే బాధ క్రమంగా కోపంగా మారుతుంది. ఒకప్పుడు ఎంతో ఇష్టంగా అనిపించిన విషయాలే తర్వాత చిరాకుగా అనిపించవచ్చు.

“ప్రేమ తగ్గిపోవడానికి ఎప్పుడూ కారణం ప్రేమ లేకపోవడం కాదు. కొన్నిసార్లు మనం పెట్టుకున్న అంచనాలే ఆ ప్రేమను నెమ్మదిగా భారంగా మారుస్తాయి” అని నేహా చెబుతోంది.

ప్రేమైనా.. స్నేహమైనా.. కుటుంబ బంధమైనా ఇదే విషయం వర్తిస్తుందని ఆమె అభిప్రాయం. మొదట్లో ఉన్న ఎగ్జైట్మెంట్ ఎప్పటికీ ఒకేలా ఉండదు. కానీ అంచనాలను తగ్గించుకుని, ఎదుటి వ్యక్తికి కొంత స్వేచ్ఛ ఇస్తే బంధం మరింత ప్రశాంతంగా ఉండొచ్చు.

నేహా నేర్చుకున్న పాఠం ఒక్కటే.. ప్రేమించాలి.. కానీ ప్రేమ పేరుతో అంచనాల భారాన్ని ఎదుటి వ్యక్తిపై పెట్టకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎక్కువగా ప్రేమించిన వ్యక్తినే.. మన ఎక్కువ అంచనాల వల్ల దూరం చేసుకుంటాం.

Read More: Ee Taram Kathalu: భర్త చేసిన మోసం.. జీవితం ముగిసిపోయిందనుకుంది.. కానీ మూడేళ్ల తర్వాత ఏమైందంటే!

Read More: చెట్టు మీద 10 పిట్టలు ఉన్నాయి.. వేటగాడు తుపాకీతో కాల్చి 1 పిట్టను పడగొట్టాడు.. చెట్టు మీద ఎన్ని పిట్టలు ఉంటాయి?
 

Add Zee News as a Preferred Source
TAGS:
Moral Stories
Motivational Stories
Telugu News